STOCKS

News


మూడు నెలల్లో రూ.30వేల కోట్ల బైబ్యాక్‌ ఆఫర్లు

Tuesday 28th August 2018
Markets_main1535445611.png-19726

ముంబై:- గడిచిన మూడు నెలల్లో 13 కంపెనీలు రూ.30వేల కోట్ల విలువైన బైబ్యాక్‌ ఆఫర్‌ను ప్రకటించాయి. బైబ్యాక్‌ ప్రకటించిన కంపెనీల్లో నిఫ్టీ-50 సూచీలోని ప్రధాన షేర్లతో టాటా కన్సల్టెసీ సర్వీసెస్‌(టీసీఎస్‌), లార్సన్‌ అండ్‌ టర్బో(ఎల్‌ అండ్‌ టీ), హెచ్‌సీఎల్‌తో పాటు ఎంఫసీస్‌, డీసీఎం శ్రీరాం, జస్ట్‌ డయల్‌, ఇక్రా, నవనీత్‌ ఎడ్యుకేషన్‌, మెక్‌లాండ్‌ రస్సెల్‌ కంపెనీలున్నాయి. బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించిన మొత్తం 13 కంపెనీల్లో 7 కంపెనీలు నేరుగా ఇన్వెస్టర్లకు లేఖలు రాసి (టెండర్‌ ఆఫర్‌) షేర్లు బై బ్యాక్‌ చేయగా, 6 కంపెనీలు మాత్రం స్టాక్‌ ఎక్స్చేంజ్‌ల ద్వారా కొనుగోలు చేశాయి. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటి వరకు మొత్తం 38 కంపెనీలు బైబ్యాక్‌ ఆఫర్‌ ద్వారా రూ.550 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశాయి. కాగా 2017 ఆర్థిక సంవత్సరంలో 50 కంపెనీలు రూ.55300కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను, 2016 ఆర్థిక సంవత్సరంలో 37 కంపెనీలు రూ.27900 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను బైబ్యాక్‌ ఆఫర్‌ ద్వారా కొనుగోలు చేశాయి.
సాదారణంగా ఆయా కంపెనీలు తమ ఈక్విటీవాటాను పెంచుకునేందుకు ఈ బైబ్యాక్‌ ఆఫర్‌ ప్రకటిస్తాయి. అయితే కంపెనీలు పన్నుల భారం నుంచి తప్పించుకనేందుకు, బుక్‌ రికార్డుల్లో తమ నగదు నిల్వలను తగ్గించునేందుకు ఉపయోగపడుతుందనేది మరో వాదన. 

కంపెనీల బైబ్యాక్‌ ప్రకటనతో ఆయా షేర్లపై ప్రభావం
కంపెనీ   బైబ్యాక్‌ బైబ్యాక్‌ ధర   ప్రస్తుత ధర షేరు ట్రేడింగ్‌లో మార్పు
టీసీఎస్‌ రూ.160బిలియన్లు రూ.2100 రూ.2051.65  -2.3%
ఎల్‌అండ్‌టీ రూ.90బిలియన్లు  రూ.1500 రూ.1356.15 -9.6%
హెచ్‌సీఎల్‌ రూ.40బిలియన్లు రూ. 1100 రూ.1038.35 -5.6%
ఎంఫసీస్‌ రూ.9.9బిలియన్లు రూ.1350 రూ. 1266.05 -6.2%
జస్ట్‌డయల్‌ రూ.2.2బిలియన్లు రూ.800 రూ.555.05 -30.6%



You may be interested

గూగుల్‌ తేజ్‌  పేరు మారింది..

Tuesday 28th August 2018

టెక్‌ దిగ్గజం గూగూల్‌.. భారత్‌ పేమెంట్స్‌ మార్కెట్‌లో వాటాను మరింత పెంచుకోవాలనే లక్ష్యంతో ముందుకెళ్తోంది. తన పేమెంట్స్‌ యాప్‌ గూగుల్‌ తేజ్‌ను రీబ్రాండ్‌ చేసింది. దీని పేరును ‘గూగుల్‌ పే’గా మార్చింది. అలాగే యాప్‌కి కొత్త ఫీచర్లను జతచేసింది. బ్యాంక్‌ ఒప్పందాలతో యాప్‌ సేవలను కూడా విస్తరించింది. న్యూఢిల్లీలో జరుగుతున్న సంస్థ వార్షిక కార్యక్రమంలో గూగుల్‌ ఈ విషయాలు వెల్లడించింది. సంస్థ గూగుల్‌ పే కస్టరమ్లకు ప్రి-అప్రూవ్‌డ్‌ రుణాలను తక్షణం

ఐసీఐసీఐ డైరెక్ట్‌ నుంచి టాప్‌ పిక్స్‌

Tuesday 28th August 2018

బ్యాంకింగ్‌ రంగంలో గడ్డుకాలం ముగియడం, సాగు రంగం పుంజుకోవడం, పారిశ్రామికం జోరు పెరగడంతో వచ్చే రెండేళ్లు నిఫ్టీ ఎర్నింగ్స్‌లో 20 శాతం వృద్ధి ఉంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ రిసెర్చ్‌ హెడ్‌ పంకజ్‌ పాండే అంచనా వేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌ పరంగా ఐదు స్టాకులను లాంగ్‌టర్మ్‌ కోసం రికమండ్‌ చేశారు. 1. గ్రిండ్‌వెల్‌ నార్టన్‌: క్యు1లో మంచి ప్రదర్శన చూపింది. ఎబిటాలో 33.5 శాతం వృద్ధి నమోదయింది. సిరామిక్స్‌, ఇతర విభాగాలు మంచి పనితీరు

Most from this category