STOCKS

News


ఈ రెండు షేర్లూ కొనవచ్చు.

Monday 28th January 2019
Markets_main1548650290.png-23844

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.2,096
టార్గెట్‌ ధర: రూ.2,500

ఎందుకంటే: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణ వృద్ధి జోరుగా ఉండటం, ఇతర ఆదాయం మెరుగుపడటంతో నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.5,590 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.12,570 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ నిలకడగా 4.3 శాతంగా నమోదైంది. ఫీజు ఆదాయం 27 శాతం ఎగసి రూ.3,650 కోట్లకు పెరిగింది. ఈ క్యూ2లో రూ.33 కోట్లు ట్రెజరీ నష్టాలు రాగా  ఈ క్యూ3లో రూ.474 కోట్ల ట్రెజరీ లాభాలు వచ్చాయి. ఫలితంగా ఇతర ఆదాయం 27 శాతం పెరిగి రూ.4,920 కోట్లకు చేరింది. రుణాలు 24 శాతం పెరిగి రూ.7.8 లక్షల కోట్లకు పెరగ్గా, డిపాజిట్లు 22 శాతం పెరిగాయి. స్థూల మొండి బకాయిలు 1.38 శాతంగా, నికర మొండి బకాయిలు 0.42 శాతంగా ఉన్నాయి. ప్రొవిజనల్‌ కవరేజ్‌ రేషియో70 శాతంగా ఉంది. ఎన్నికల సందర్భంగా  రైతు రుణ మాఫీ ప్రయత్నాలు జరగవచ్చన్న అంచనాలతో ఈ బ్యాంక్‌ రూ.320 కోట్ల కేటాయింపులు జరిపింది. వ్యక్తిగత రుణాలు, వ్యాపారి, క్రెడిట్‌ కార్డ్, వాహన రుణాలకు సంబంధించిన రిటైల్‌ రంగ రుణాల విషయంలో బ్యాంక్‌ మార్కెట్‌  వాటా పెరుగుతోంది.  మూలధన నిధులు పుష్కలంగా ఉండటం, లిక్విడిటీ సమస్యలు లేకపోవడంతో రానున్న సంవత్సరాల్లో వృద్ధి జోరును ఈ బ్యాంక్‌ కొనసాగించగలదని భావిస్తున్నాం. నిర్వహణ వ్యయాలు నియంత్రణలోనే ఉండటం, కాసా నిష్పత్తి 40 శాతానికి మించి ఉండటం, డిజిటైజేషన్‌ ప్రయత్నాల వల్ల బ్యాంక్‌ పనితీరు మరింతగా మెరుగుపడే అవకాశాలు, బ్రాంచ్‌ల విస్తరణ జోరు కారణంగా ఆదాయం పెరుగుతుండటం, రుణ నాణ్యత అత్యుత్తమంగా ఉండటం... ఇవన్నీ సానుకూలాంశాలు. రెండేళ్లలో నికర లాభం 23 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని అంచనా.
ఐటీసీ    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ. 279
టార్గెట్‌ ధర: రూ.340

ఎందుకంటే: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు దాదాపు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి.  అమ్మకాల పరంగా చూస్తే, ఇతర వ్యాపారాలు రెండంకెల వృద్ధిని, సిగరెట్ల అమ్మకాలు 8 శాతం వృద్ధిని సాధించాయి. మొత్తం మీద ఆదాయం 15 శాతం వృద్ధి చెందింది. నిర్వహణ లాభం 11 శాతం పెరిగి రూ.4,326 కోట్లకు వృద్ధి చెందింది. పొగాకు ధరలు అధికంగా ఉండటంతో సిగరెట్ల విభాగం మార్జిన్‌ తగ్గింది.  ఆటా, బిస్కట్లు, స్నాక్స్, నూడుల్స్‌ అమ్మకాలు బాగా ఉండటంతో ఎఫ్‌ఎంసీజీ విభాగం ఎబిటా రూ.122 కోట్ల నుంచి రూ.173 కోట్లకు పెరిగింది. ఈ క్యూ3లో 5.4 శాతంగా ఉన్న ఎబిటా మార్జిన్లు రెండేళ్లలో రెండంకెల స్థాయికి చేరగలవని అంచనా వేస్తున్నాం. ఎఫ్‌ఎంసీజీ విభాగంలో రూ.70,000 కోట్ల టర్నోవర్‌ సాధించడం లక్ష్యంగా కొత్త సెగ్మెంట్లలోకి ప్రవేశిస్తోంది. బాస్మతియేతర బియ్యం విక్రయాలు, డైరీ సెగ్మెంట్లోకి ఇటీవలనే ప్రవేశించింది. త్వరలోనే దేశవ్యాప్తంగా పాల పానీయాలను అందుబాటులోకి తేనున్నది. ప్రవేశించిన ప్రతి సెగ్మెంట్‌లోనూ వీలైనంత త్వరగా లాభదాయకత సా«ధించాలనేది  కంపెనీ వ్యూహం. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ ఎబిటా మార్జిన్‌ 38 శాతంగా, నికర లాభ మార్జిన్‌ 28 శాతంగా ఉన్నాయి. మార్జిన్లు బాగా ఉండటంతో రూ.12,650 కోట్ల నిర్వహణ క్యాష్‌ ఫ్లోస్‌ను సాధించింది.రిటర్న్‌ ఆన్‌ క్యాపిటల్‌ ఎంప్లాయిడ్‌ 31 శాతంగా ఉంది. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, నికర లాభం 11 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.You may be interested

కోలుకున్న జీ ఎంటర్‌‍ప్రైజెస్‌

Monday 28th January 2019

కలిసొచ్చిన షేర్ల తనఖా ఒప్పందం కంపెనీ రుణదాతలతో షేర్ల తనఖా ఒప్పందం కుదుర్చుకోవడంతో జీ ఎంటర్‌టైన్‌మైంట్‌ షేర్లు సోమవారం రికవరీ బాట పట్టాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే షేర్లు 14శాతానికి పైగా పెరిగాయి.  జీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రమోటింగ్‌ గ్రూప్‌ అయిన ఎస్సెల్‌ గ్రూప్‌ తీవ్రఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నదనే వార్తలు ఒక్కసారిగా వెలుగులోకి రావడంతో శుక్రవారం ఆ గ్రూప్‌ షేర్లు భారీగా పతమైన సంగతి తెలిసిందే. భవిష్యత్తులో షేరు మరింత క్షీణించినప్పటికీ.., షేర్ల విక్రయించకుండా

అన్ని రకాల స్టాక్స్‌లో పెట్టుబడికి అవకాశం

Monday 28th January 2019

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఈ పథకం లార్జ్‌క్యాప్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇలా అన్ని రకాల స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందుకు ఇది మల్టీక్యాప్‌ విభాగంలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు. ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే బెంచ్‌ మార్క్‌ కంటే అధిక రాబడులను ఇచ్చింది. స్థిరమైన రాబడులు ఆశించే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ పథకాన్ని దీర్ఘకాలం ఇన్వెస్టింగ్‌ కోసం పరిశీలించొచ్చు. పనితీరు ఈ పథకం

Most from this category