STOCKS

News


స్వల్ప కాలం కోసం మూడు స్టాక్‌ రికమండేషన్లు

Sunday 6th January 2019
Markets_main1546796052.png-23440

మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌ చాలా చౌకగా మారాయని ఈక్విటీ99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ అన్నారు. గత రెండు నెలల్లో అమెరికా మార్కెట్లు చాలా అస్థిరతలకు గురయ్యాయని, ఇది మన మార్కెట్లపైనా ప్రభావం చూపించినట్టు పేర్కొన్నారు. మూడో త్రైమాసికం ఫలితాల సీజన్‌లోకి ప్రవేశించామని, ప్రధాన కంపెనీల్లో చాలా వరకు రానున్న 20 రోజుల్లో ఫలితాలు ప్రకటించనున్నాయని చెప్పారు. ఈ కాలంలో స్టాక్‌ వారీ కదలికలు ఉంటాయని అంచనా వేశారు. అస్థిరతల నేపథ్యంలో రానున్న నెల రోజుల్లో ఎంపిక చేసిన స్టాక్స్‌ వారీగా ట్రేడింగ్‌కు పరిమితం కావడం మంచిదన్నారు. ‍స్వల్పకాలంలో రాబడులను ఇచ్చేందుకు అవకాశం ఉన్న మూడు స్టాక్స్‌ను సుమిత్‌ సూచించారు. 

 

ఆర్తి ఇండస్ట్రీస్‌
స్పెషాలిటీ కెమికల్స్‌, ఫార్మాస్యూటికల్స్‌ తయారీలో అంతర్జాతీయంగా మంచి మార్కెట్‌ కలిగిన భారతీయ కంపెనీ. ఆర్తి తయారు చేసే రసాయనాలను ఫార్మా, ఆగ్రోకెమికల్స్‌, పాలీమర్స్‌, అడిటివ్స్‌, సర్ఫేక్టంట్స్‌, పిగ్మెంట్స్‌, డైస్‌లో వినియోగిస్తుంటారు. 200కు పైగా ఉత్పత్తులను కలిగి ఉంది. 200 విదేశీ కస్టమర్లు, 500 స్థానిక కస్టమర్లు ఈ కంపెనీకి ఉన్నారు. 17 తయారీ ప్లాంట్లను కలిగి ఉంది. స్టాక్‌ 29 పీఈ వద్ద ట్రేడవుతోంది. రూ.40.5 కోట్ల ఈక్విటీకి రూ.1,537 కోట్ల రిజర్వ్‌లను కలిగి ఉంది. దీర్ఘకాలం కోసం కొద్దికొద్దిగా కొనుగోలు చేసుకోవచ్చు. 

డెల్టాకార్ప్‌
మన దేశంలో అతిపెద్ద గేమింగ్‌ కంపెనీ. పైగా ఏకైక లిస్టెడ్‌ గేమింగ్‌ కంపెనీ కూడా. 2008లో గేమింగ్‌ వ్యాపారంలోకి ప్రవేశించిన ఈ కంపెనీకి దేశ గేమింగ్‌ మార్కెట్లో అధిక వాటా ఉంది. గోవా, సిక్కింలో ఐదు క్యాసినోలు ఉన్నాయి. గోవాలో డెల్టిన్‌ సూట్స్‌, డెల్టిన్‌ పామ్స్‌ అనే రెండు ప్రాపర్టీలను కూడా కలిగి ఉంది. ఓ హోటల్‌ను కూడా నిర్వహిస్తోంది. దీర్ఘకాలం కోసం కొద్ది కొద్దగా కొనుగోలు చేసుకోవచ్చు.

వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫారమ్స్‌
ఆయిల్‌తో నిండిన విద్యుత్‌, పంపిణీ ట్రాన్స్‌ఫారమ్‌ల తయారీలో ఉంది. గుజరాత్‌లోని మార్కార్‌పుర, సావ్లిలో తయారీ కేంద్రాలను కలిగి ఉంది. ఈ స్టాక్‌ 15 పీఈ వద్ద ట్రేడవుతోంది. ఈ కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు 19 శాతం వరకు వాటాలు ఉన్నాయి. ఎఫ్‌ఐఐలు కూడా 15 శాతానికి పైగా వాటా కలిగి ఉన్నారు. ప్రమోటర్లు కూడా కొంత మేర తమ వాటాను పెంచుకున్నారు.



You may be interested

ఓఎన్‌జీసీని పిండేస్తున్న కేంద్రం!

Sunday 6th January 2019

చమురు అన్వేషణ, ఉత్పత్తిలో అతిపెద్ద ప్రభుత్వరంగ కంపెనీ ఓఎన్‌జీసీ... కేంద్ర ప్రభుత్వానికి బంగారు బాతులు పెట్టే గుడ్డు మాదిరిగా మారిపోయింది. కేంద్రం తన నిధుల సమీకరణ అవసరాల్లో భాగంగా ప్రభుత్వరంగ కంపెనీలపై ఒత్తిడి తెచ్చి మరీ షేర్ల బైబ్యాక్‌, డివిడెండ్ల రూపంలో ఆదాయం పొందుతోంది. ఈ కార్యక్రమంలో ఓఎన్‌జీసీ కూడా భాగమైపోయింది. అప్పులు తీసుకుని మరీ, కేంద్రానికి నిధులను ధారబోస్తోంది ఓఎన్‌జీసీ.   ఓఎన్‌జీసీ 2016-17, 2017-18లో అస్సలు రుణాలే తీసుకోలేదు. మరీ

రూ.లక్ష పెట్టుబడి... రెండేళ్లలో రూ.32లక్షలు 

Sunday 6th January 2019

స్టాక్‌ మార్కెట్లో నష్టాలు ఎదురైనా... ఒక్క జాక్‌పాట్‌ అయినా కొట్టకపోతామా? అన్న ఆకాంక్షే నేరుగా పెట్టుబడుల వైపు ఆకర్షిస్తుంటుంది. అలాంటి మల్టీబ్యాగర్స్‌ కొన్నే ఉంటుంటాయి. ఆ కోవలోనిదే హెచ్‌ఈజీ లిమిటెడ్‌. నిజమే... రూ.లక్ష పెట్టుబడిని రెండేళ్లలో రూ.32 లక్షలు చేసింది ఈ కంపెనీ. గత ఏడాది కాలంలో మంచి పేరున్న కంపెనీల షేర్లు కూడా కకావికలం అయిన పరిస్థితిని చూశాం. అయినా హెచ్‌ఈజీ మాత్రం అల్లకల్లోల పరిస్థితుల్లోనూ ఇన్వెస్టర్లకు కాసులు

Most from this category