STOCKS

News


ఈ రెండు షేర్లను కొనవచ్చు.

Monday 4th February 2019
Markets_main1549264052.png-24002

హెచ్‌డీఎఫ్‌సీ            కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.1,961
టార్గెట్‌ ధర: రూ.2,300

ఎందుకంటే:  భారత దేశపు మొదటి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా 1977లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇదే. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ రిటైల్‌ రుణాలు 18 శాతం, కార్పొరేట్‌ లెండింగ్‌ 8 శాతం చొప్పున వృద్ధి చెందడం వల్ల నిర్వహణ ఆస్తులు 15 శాతం వృద్ధితో 4.4 లక్షల కోట్లకు పెరిగాయి. రుణ నాణ్యత నిలకడగా ఉంది. ఈ క్యూ3లో స్థూల మొండి బకాయిలు 1.22 శాతంగా ఉన్నాయి. లిక్విడిటీ సమస్యలు తీవ్రంగా ఉన్నప్పటికీ, కంపెనీ ట్రెజరీ మేనేజ్‌మెంట్‌ పటిష్టంగా ఉండటంతో స్ప్రెడ్స్‌ 2.3 శాతంగా, మార్జిన్లు 3.2 శాతంగా నమోదయ్యాయి. మొత్తం మీద ఈ కంపెనీ తాను సమీకరించిన నిధులపై 8.35 శాతం వడ్డీని చెల్లిస్తోంది. సీక్వె‍న్షియల్‌గా చూస్తే, కంపెనీ సమీకరించిన రుణాలు 18 శాతం నుంచి 21 శాతానికి, డిపాజిట్లు 28 శాతం నుంచి 30 శాతానికి పెరిగాయి. స్థూల ఫీజు ఆదాయం 25 శాతం తగ్గి రూ.104 కోట్లకు చేరింది. టైర్‌ వన్‌ మూలధనం 17.2 శాతంగా ఉంది. పోటీ తీవ్రత పెరుగుతున్నప్పటికీ, రిటైల్‌ రుణాల జోరు పెరుగుతూనే ఉంది. కార్పొరేట్‌ లెండింగ్‌ కూడా పుంజుకుంటోంది. లిక్విడిటీ సమస్యలు తీవ్రంగా ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు పుష్కలంగా ఉన్న ఈ కంపెనీ రిటైల్‌ రుణ మార్కెట్‌ వాటా మరింత పెరగనున్నది.  గత 20 ఏళ్లలో ఈ కంపెనీ ఎన్నో అనుబంధ సంస్థలను అభివృద్ధి చేసింది. బ్యాంకింగ్‌, బీమా, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, రియల్టీ, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ క్యాపిటల్‌, ఎడ్యుకేషన్‌ లోన్స్‌ తదితర రంగాల్లో ఆ అనుబంధ కంపెనీలు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ కంపెనీ నికర లాభంలో ఈ అనుబంధ కంపెనీల వాటాయే 40 శాతంగా ఉంది. రూ. లక్ష కోట్లకు పైగా డిపాజిట్లు ఉండటం, రుణ నాణ్యత ట్రాక్‌ రికార్డ్‌ పటిష్టంగా ఉండటం, వ్యయానికి, ఆదాయానికి గల నిష్పత్తి ఒక అంకె కంటే తక్కువగానే ఉండటం ఫలితంగా రిటర్న్‌ ఆన్‌ అసెట్‌ 2 శాతం మేర, రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ 15 శాతానికి మించి ఉండటం సానుకూలాంశాలు.
బజాజ్‌ ఫిన్‌సర్వ్‌        కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ  డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.6,100
టార్గెట్‌ ధర: రూ.6,950

ఎందుకంటే: బజాజ్‌ గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ జీవిత, సాధారణ బీమా రంగాలతో కన్సూమర్‌ ఫైనాన్స్‌ రంగాల్లో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. అన్ని సెగ్మెంట్లు మంచి వృద్ధి సాధించడంతో ఆదాయం(కన్సాలిడేటెడ్‌) 45 శాతం వృద్ధి చెంది రూ.11,142 కోట్లకు,  నికర లాభం 16 శాతం వృద్ధితో రూ.851 కోట్లకు పెరిగాయి. నిర్వహణ ఆస్తులు 41 శాతం ఎగిశాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ నాణ్యత కొంత తగ్గినా, మొత్తం మీద నియంత్రణలోనే ఉంది. సాధారణ బీమా విభాగం ప్రీమియమ్‌ ఆదాయం 35 శాతం పెరిగింది. సాధారణ బీమా వ్యాపారం లాభదాయకత ఇతర రెండు బిజినెస్‌ సెగ్మెంట్ల కంటే అధికంగా ఉంది. ఈ విభాగం రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ(ఆర్‌ఓఈ) 24 శాతం కంటే ఎక్కువగానే ఉంది.  రెండేళ్లలో ఈ విభాగం స్థూల ప్రీమియమ్‌ ఆదాయం 19 శాతం చక్రగతి వృద్ధితో రూ.13,316 కోట్లకు, నికర లాభం 14 శాతం చక్రగతి వృద్ధితో రూ.1,188 కోట్లకు పెరగగలదని అంచనా. వినియోగ వస్తువుల కొనుగోళ్లకు రుణాలిచ్చే బజాజ్‌ ఫైనాన్స్‌ పనితీరు బాగా ఉంది. ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ, రుణ నాణ్యత నిలకడగానే ఉంది. 2011-17 ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం 40 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందింది. రెండేళ్లలో నికర లాభం 39 శాతం చక్రగతి వృద్ధితో రూ.6,653 కోట్లకు పెరగగలదని భావిస్తున్నాం. జీవిత బీమా వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటోంది. 2009-10 ఆర్థిక సంవత్సరం తర్వాత గత ఆర్థిక సంవత్సరంలోనే తొలిసారి లాభాన్ని ఆర్జించింది. రెండేళ్లలో ఈ విభాగం ప్రీమియమ్‌ ఆదాయం 13 శాతం చక్రగతి వృద్ధితో రూ.9,653 కోట్లకు పెరుగుతుందని అంచనా. తొలిసారిగా జీవిత బీమా, సాధారణ బీమా వ్యాపారాలు డివిడెండ్‌ను ప్రకటించాయి.  మొత్తం మీద రెండేళ్లలో ఈ కంపెనీ ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.48,836 కోట్లకు, నికర లాభం 26 శాతం వృద్ధితో రూ.4,159 కోట్లకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.



You may be interested

36,220 - 36778 శ్రేణిని ఎటు ఛేదిస్తే అటు

Monday 4th February 2019

కేంద్ర ప్రభుత్వం ప్రవేశేట్టిన మధ్యంతర బడ్జెట్‌లో పేద, మధ్యతరగతి ప్రజలపై వరాల జల్లు కురిసింది. ఈ బడ్జెట్‌ ప్రతిపాదనల అనంతరం లబ్దిపొందుతాయని అంచనావేస్తున్న ఆటో, కన్జూమర్‌ షేర్లు ర్యాలీ జరపగా, ద్రవ్యలోటు పెరుగుతుందన్న ఆందోళనలతో బాండ్లతో పాటు బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లు క్షీణించాయి. మరోవైపు రూపాయి క్షీణత ఫలితంగా ఐటీ షేర్లు కూడా మెరుగుపడ్డాయి. రానున్న కొద్ది రోజుల్లో బడ్జెట్‌ రోజునాటి ట్రెండే కొనసాగే అవకాశం లేదు. మరో మరో

3.4శాతం ద్రవ్యలోటు కష్టమే..!

Monday 4th February 2019

-అధికంగా ప్రభుత్వ వ్యయాలు -అల్పంగా రాబడి వృద్ధి -ద్రవ్యలోటు లక్ష్యం కష్టమే -మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వెల్లడి న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ​‍ద్రవ్యలోటును 3.4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కావడం కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తెలిపింది. ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండడం, రాబడి వృద్ధి అల్పంగా ఉండనుండటం దీనికి ప్రధాన కారణాలని మూడీస్‌ తెలిపింది. పెరుగుతున్న ప్రభుత్వ రుణ భారం... ప్రభుత్వ రుణం భారీగా పెరుగుతోందని, ద్రవ్య

Most from this category