STOCKS

News


ఈ రెండు షేర్లను కొనవచ్చు

Monday 25th February 2019
Markets_main1551070092.png-24316

నాల్కో        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ 
ప్రస్తుత ధర: రూ.49
టార్గెట్‌ ధర: రూ.69

ఎందుకంటే: నాల్కో కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కొన్ని అంశాల్లో అంచనాలను మించాయి. అయితే ఉత్పత్తి వ్యయాలు పెరగడం కొంత నిరాశపరిచింది. ఈ క్యూ3లో రూ.620 కోట్ల ఎబిటా రాగలదని అంచనా వేశాం. కానీ ఈ కంపెనీ రూ.510 కోట్ల ఎబిటానే సాధించింది. వార్షికంగా చూస్తే, ఎబిటా 10 శాతం పెరిగినా, సీక్వెన్షియల్‌గా చూస్తే, 40 శాతం క్షీణించింది. అమ్మకాలు, రియలైజేషన్లు తక్కువగా ఉండటం, ఉత్పత్తి వ్యయాలు అధికంగా ఉండటం దీనికి ప్రధాన కారణాలు. నికర లాభం 9 శాతం ఎగసి రూ.300 కోట్లకు పెరిగింది. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, 41 శాతం క్షీణత నమోదైంది. ఈ క్యూ2తో పోల్చితే ఈ క్యూ3లో అల్యుమినా ఉత్పత్తి 12 శాతం పెరిగినా, అమ్మకాలు మాత్రం 10 శాతం తగ్గాయి. అల్యూమినియం ఉత్పత్తి 8 శాతం, అమ్మకాలు 10 శాతం చొప్పున తగ్గాయి. ఇటీవల గరిష్ట స్థాయికి చేరిన అల్యుమినా ధరలు తగ్గడం, అమ్మకాలు తగ్గడంతో స్థిర వ్యయాల ప్రభావం అధికంగానే  ఉండటం నాల్కో పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపించింది.  అమ్మకాలు పెరిగే అవకాశాలు‍న్నాయి. దీంతో ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. అయితే చైనా నుంచి సరఫరాలు పెరుగుతుండటతో అల్యుమినా ధరలు మరింత తగ్గే అవకాశాలున్నాయి. రెండేళ్లలో ఎబిటా రూ.1,600 కోట్లకు, నికర లాభం రూ.1,000 కోట్లకు పెరగవచ్చని అంచనా వేస్తున్నాం. గతంలో ఇచ్చిన అంచనాల కంటే వీటిని 20-30 శాతం మేర తగ్గిచాం.  అల్యూమినా ధరలు తక్కువగా ఉండటంతో ఇలా అంచనాలను తగ్గిస్తున్నాం. అయినప్పటికీ, కొనచ్చు రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. ఏడాది కాలంలో ఈ షేర్‌ రూ.69ను చేరుతుందని భావిస్తున్నాం.  ధరలు పెరిగితే మాత్రం ఈ రంగంలో అత్యధికంగా లాభపడే కంపెనీ ఇదే కానున్నది. 

రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌      
బ్రోకరేజ్‌ సంస్థ: ఎడెల్‌వీజ్‌ ఫైనాన్స్‌ 
ప్రస్తుత ధర: రూ.325
టార్గెట్‌ ధర: రూ.498

ఎందుకంటే: భారత ప్రభుత్వానికి చెందిన రిపాట్రియేట్స్‌ కోపరేటివ్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (రెప్‌కో)బ్యాంక్‌ ప్రమోట్‌ చేస్తున్న రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే బలహీనంగా ఉన్నాయి. ఆదాయం అంతంతమాత్రంగానే ఉండటం, కేటాయింపులు అధికంగా ఉండటంతో రూ.56 కోట్ల నికర లాభాన్ని మాత్రమే సాధించగలిగింది. రుణాల మంజూరు సీక్వెన్షియల్‌గా చూస్తే 6 శాతం తగ్గి రూ.7,300 కోట్లకు పరిమితమైంది. దీంతో నిర్వహణ ఆస్తులు 12 శాతం మాత్రమే పెరిగాయి. సీజనల్‌ ట్రెండ్‌కు అనుగుణంగానే స్థూల మొండి బకాయిలు పెరిగాయి. ఈ క్యూ2లో 3.6 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ3లో 3.9 శాతానికి పెరిగాయి. అధిక విలువ ఉన్న రుణాలను మంజూరు చేయడాన్ని నిలిపేసిన ఈ కంపెనీ రివకరీలపై దృష్టి పెట్టింది. ఈ చర్యల ఫలితాలు, ఫలాలు రానున్న క్వార్టర్లలో కనిపిస్తాయి.   ఈ కంపెనీ లోన్‌బుక్‌లో 60 శాతానికి పైగా తమిళనాడు నుంచే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో భూమి రిజిస్ట్రేషన్‌ సమస్య కారణంగా రుణ రికవరీలు మందగమనంగా ఉన్నాయి. మరోవైపు మహారాష్ట్ర మార్కెట్‌ 25 శాతం, గుజరాత్‌ మార్కెట్‌ 45 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. సాధారణంగా వేతన ఉద్యోగులకే పలు గృహ రుణ సంస్థలు రుణాలిస్తాయి. కానీ ఈ కంపెనీ స్వయం ఉపాధి వ్యక్తులకు కూడా రుణాలిస్తోంది. ప్రస్తుత నిధుల లభ్యత సమస్య, గృహ రుణాల రంగంలో రికవరీ మందకొడిగా ఉండటం వంటి ప్రతికూలతలు రెప్కో హోమ్‌ ఫైనాన్స్‌పై సమీప భవిష్యత్తులో ప్రభావం చూపించవచ్చు. ఫలితంగా వృద్ధి, నికర వడ్డీ మార్జిన్‌పై ఒత్తిడి కొనసాగవచ్చు. అయినప్పటికీ, ఈ షేర్‌ను విక్రయించకుండా, అట్టేపెట్టుకోవాలని రికమెండ్‌ చేస్తున్నాం. లోన్‌ క్యాంప్స్‌ ద్వారా ప్రచారాన్ని నిర్వహించడం, మార్కెటింగ్‌ దళారీ వ్యవస్థ లేకపోవడం సానుకూలాంశాలు. ఈ కంపెనీ 11 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నా, తమిళనాడులోనే సగానికి పైగా రుణాలనిచ్చింది. తమిళనాడు రియల్టీ మార్కెట్లో సమస్యలు తలెత్తితే అది ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.You may be interested

లాభసాటి పెట్టుబడులు!

Monday 25th February 2019

లాభసాటి పెట్టుబడులు! ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ ఈక్విటీ పెట్టుబడులపై తగినంత రాబడులు కోరుకునే వారికి ఎస్‌బీఐ ఫోకస్డ్‌ ఈక్విటీ ఫండ్‌ మంచి ఎంపికే అవుతుంది. అన్ని రకాల మార్కెట్లలోనూ లాభాలు ఇవ్వగల స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రాబడులు ఇచ్చే విధానంలో ఈ పథకం పనిచేస్తుంటుంది. కనుక ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు ఇదొక మంచి పెట్టుబడి ఆప్షన్‌ అవుతుంది. ఈ పథకానికి ఆర్‌ శ్రీనివాసన్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు.  పెట్టుబడుల విధానం ఫోకస్డ్‌

పసిడి ర్యాలీకి బ్రేక్‌లు?

Monday 25th February 2019

పసిడి ర్యాలీకి బ్రేక్‌లు? వాణిజ్య చర్చలు, ఫెడ్‌ ధోరణి కీలకం న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధానికి సంబంధించి అమెరికా, చైనా మధ్య సంధి కుదిరే అవకాశాలు ఉన్న నేపథ్యంలో పసిడి ర్యాలీకి కాస్త బ్రేకులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య వివాదాల పరిష్కార చర్చల్లో గణనీయంగా పురోగతి ఉందని, త్వరలో ఒక ఒప్పందం కుదరవచ్చని  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, అటు చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్

Most from this category