STOCKS

News


ఈ స్టాక్స్‌ కొనొచ్చు

Monday 3rd September 2018
Markets_main1535951992.png-19904

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌        కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: చోళమండలం సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.520
టార్గెట్‌ ధర: రూ.640
ఎందుకంటే: భారత హౌసింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో రెండో అతి పెద్ద కంపెనీ ఇది. వ్యక్తులకు, కార్పొరేట్‌ సంస్థలకు గృహ రుణాలందిస్తోంది. డెవలపర్లకు, బిల్డర్లకు నిర్మాణ రుణాలను కూడా అందిస్తోంది. మరోవైపు ఈ కంపెనీ అనుబంధ సంస్థ, ఎల్‌ఐసీ హౌసింగ్‌... హోమ్‌ లోన్‌ ఏజెంట్లతోనూ, డైరెక్ట్‌ సెల్లింగ్‌ ఏజెంట్లతోనూ పటిష్టమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ కంపెనీ రుణాలు ఈ క్యూ1లో 15 శాతం వృద్ధితో రూ.1.69 లక్షల కోట్లకు చేరాయి. ఇళ్ల తాకట్టు రుణాలు 42 శాతం, ప్రాజెక్ట్‌ రుణాలు 51 శాతం చొప్పున పెరగడమే దీనికి కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 15 శాతం రేంజ్‌లో ఉండగలదని అంచనా. ఈ క్యూ1లో రుణ పంపిణీ 10 శాతం పెరిగి రూ.9,590 కోట్లకు పెరిగింది.  అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, రుణ పంపిణీ 45 శాతం క్షీణించింది. పోటీ తీవ్రత పెరుగుతుండటంతో నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎమ్‌) స్వల్పంగా తగ్గింది. ›ప్రైమ్‌ లెండింగ్‌ రేట్‌(పీఎల్‌ఆర్‌)ను ఈ కంపెనీ జూన్, ఆగస్టుల్లో పెంచడంతో నికర వడ్డీ మార్జిన్‌ మెరుగుపడగలదని భావిస్తున్నాం. స్థూల మొండి బకాయిలు 1.2 శాతానికి, నికర మొండి బకాయిలు 0.8 శాతానికి పెరిగాయి. అయితే ఈ క్యూ1లో రూ.40 కోట్ల మేర డెవలపర్‌ లోన్‌ను ఈ కంపెనీ వంద శాతం రికవరీ చేయగలిగింది. రుణ నాణ్యత మెరుగుపడగలదని కంపెనీ భావిస్తోంది. ఈ క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 7 శాతం వృద్ధితో రూ.980 కోట్లకు, ఇతర ఆదాయం 50 శాతం వృద్ధితో రూ.32 కోట్లకు పెరిగాయి. నికర లాభం 18 శాతం పెరిగి రూ.568 కోట్లకు పెరిగింది. రెరా అమలు కారణంగా ప్రాజెక్ట్‌ ఫైనాన్స్‌ సెగ్మెంట్‌ జోరు పెరుగుతుందని, ఇది ఈ కంపెనీకి ప్రయోజనకరమేనని భావిస్తున్నాం. 

నెస్లే ఇండియా    కొనొచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌ 
ప్రస్తుత ధర: 11,577
టార్గెట్‌ ధర: 12,000
ఎందుకంటే: కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తేవడం ద్వారా అమ్మకాలు మరింతగా పెంచుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఆరోగ్య,  పోషక సంబంధిత ఉత్పత్తులపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తోంది.  కొత్త ఉత్పత్తుల కోసం తగిన స్థాయిల్లో పెట్టుబడులు పెడుతోంది. ఇన్‌స్టంట్‌ నూడుల్స్, పాస్తా, ఇన్‌ఫాంట్‌ సెరియల్స్, టీ క్రీమర్, వైట్‌ అండ్‌ వేఫర్‌ చాక్లెట్స్, ఇన్‌స్టంట్‌ కాఫీ తదితర కేటగిరీల్లో ఈ కంపెనీదే అగ్రస్థానం. 2011–13 కాలంలో భారీ పెట్టుబడులతో చేపట్టిన ప్లాంట్ల విస్తరణ, ఉత్పత్తి సామర్థ్య పెంపు ఫలితాలు అందడం మొదలైంది. ఫలితంగా రాబడి నిష్పత్తులు మరింతగా మెరుగపడనున్నాయి. ఆరోగ్యానికి హానికరమంటూ వార్తలు రావడంతో కంపెనీ బ్రాండ్‌ మ్యాగీ అమ్మకాలు గతంలో బాగా పడిపోయాయి. కంపెనీ తీసుకున్న వివిధ చర్యల కారణంగా మ్యాగీ తిరిగి తన పూర్వ మార్కెట్‌ వాటాను  సొంతం చేసుకోగలిగింది. గత రెండేళ్లలో వివిధ కేటగిరీల్లో మొత్తం 39 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చింది.  గత ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో 16 శాతంగా ఉన్న ఎబిటా ఈ ఏడాది ఇదే కాలానికి 22 శాతానికి ఎగసింది. ముడి పదార్ధాల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. పట్టణీకరణ వేగం పుంజుకోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో మహిళల మాటకు విలువ పెరుగుతుండటం(ఈ కంపెనీ ఉత్పత్తులు మహిళలకు శ్రమను, కాలాన్ని తగ్గిస్తాయి) కలసి వచ్చే అంశాలు.  రెండేళ్లలో ఆదాయం 13 శాతం, అమ్మకాలు 12 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. వృద్ధి జోరును పెంచడానికి ఉద్దేశించిన కన్సూమర్‌ క్లస్టర్‌ అప్రోచ్‌ (భారత్‌ను 15 క్లస్టర్లుగా విభజించింది) మంచి ఫలితాలనిస్తోంది. You may be interested

సెక్టోరియల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చా ?  

Monday 3rd September 2018

ప్ర: నేను స్వల్పకాల అవసరాల నిమిత్తం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. రెండు మంచి  ఫండ్స్‌ సూచించండి.  - కిరణ్‌, విజయవాడ  జ: సాధారణంగా దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తేనే మీకు మంచి రాబడులు వస్తాయి. అయితే స్వల్పకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కూడా కొన్ని మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. స్వల్ప కాలానికే ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నారు. కాబట్టి మీరు పెద్దగా రిస్క్‌ తీసుకోవలసిన అవసరం లేదు. దీని కోసం

మిశ్రమంగా ఆటో అమ్మకాలు

Monday 3rd September 2018

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థల వాహనాల విక్రయాలు ఆగస్టులో మిశ్రమంగా నమోదయ్యాయి. దేశీయంగా మారుతీ సుజుకీ ఇండియా, హ్యుందాయ్ అమ్మకాలు తగ్గగా.. టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాల విక్రయాలు పెరిగాయి. కేరళలో వరదల పరిస్థితి వాహనాల డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఆగస్టులో దేశీయంగా మారుతీ ప్యాసింజర్ వాహనాల (పీవీ) 2.8 శాతం క్షీణించి 1,52,000 నుంచి  1,47,700 యూనిట్లకు తగ్గాయి. మినీ కార్ల

Most from this category