News


ఈ స్టాక్స్‌ కొనొచ్చు

Monday 10th September 2018
Markets_main1536557929.png-20113

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.92
టార్గెట్‌ ధర: రూ.120
ఎందుకంటే:  రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థల కోసం భారత రక్షణ శాఖ కొత్త ధరల నిర్ణాయక విధానాన్ని రూపొందించింది. రక్షణరంగ పీఎస్‌యూల సమర్థతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ విధానాన్ని రక్షణ శాఖ రూపొందించింది. నామినేషన్‌ ప్రాతిపదికగా లభించిన ప్రాజెక్ట్‌లో మార్జిన్లను 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. ఈ  కొత్త ధరల నిర్ణాయక విధాన ప్రభావం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ మధ్య కాలిక లాభదాయకతపై పరిమితంగానే ఉండనున్నది. భవిష్యత్తులో వచ్చే ఆర్డర్లపై మాత్రం ఈ ప్రభావం ఉంటుంది. ఇటీవలే ఈ కంపెనీ పొందిన రూ.9,200 కోట్ల క్షిపణి ఆర్డర్‌, ఇప్పటికే ఉన్న రూ.50,000 కోట్ల ఆర్డర్‌ బుక్‌కు ఈ కొత్త విధానం వర్తించదు. రాయల్టీ, పరిశోధన, అభివృద్ధి, ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొటొటైప్‌ వ్యయాలను పరిగణనలోకి (గతంలో ఈ వ్యయాలను పరిగణించేవారు కాదు)తీసుకునే వెసులుబాటు ఈ కొత్త విధానంలో ఉండటం కొంత ఊరటనిచ్చే విషయం. ప్రస్తుత ప్లాంట్ల ఆధునికీకరణ, విస్తరణ నిమిత్తం ఏడాదికి రూ.500-600 కోట్ల చొప్పున 3-4 ఏళ్ల కాలంలో రూ.2,500 కోట్ల మేర మూలధన పెట్టుబడులు పెట్టనున్నది. ప్రభుత్వం రక్షణ వ్యయాన్ని పెంచడం ఈ కంపెనీకి ప్రయోజనకరం కానున్నది. మరోవైపు రక్షణ, రక్షణేతర కొత్త వ్యాపారాల్లోకి ప్రవేశిస్తోంది. కొత్త ఉత్పత్తుల అభివృద్ధి కోసం విదేశీ సంస్థలతో వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకోవడం,  మిత్ర దేశాలకు ఎగుమతుల పెంపుపై దృష్టి సారించడం... సానుకూలాంశాలు. 

అరబిందో ఫార్మా        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్‌
ప్రస్తుత ధర: రూ.800
టార్గెట్‌ ధర: రూ.915
ఎందుకంటే:  అమెరికాకు చెందిన శాండోజ్‌ కంపెనీ చర్మ సంబంధిత, నోటి ద్వారా తీసుకునే ఔషధాల, జనరిక్స్‌ వ్యాపారాలను అరబిందో ఫార్మా కొనుగోలు చేయనున్నది. నొవార్టిస్‌ ఏజీ కంపెనీ నుంచి ఈ వ్యాపారాలను అరబిందో కంపెనీ 90 కోట్ల డాలర్లకు కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందంలో భాగంగా నోవార్టిస్‌కు చెందిన అమెరికాలోని మూడు ప్లాంట్లతో పాటు మొత్తం 300 ఉత్పత్తులు అరబిందో ఫార్మా పరమవుతాయి.  ఈ ఉత్పత్తుల ఆదాయం ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో 60 కోట్ల డాలర్ల వరకూ ఉంది. తొలి ఏడాదిలో ఈ ఉత్పత్తుల ఆదాయం 90 కోట్ల డాలర్ల వరకూ ఉండొచ్చని అరబిందో ఫార్మా అంచనా వేస్తోంది. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ డీల్‌ పూర్తయ్యే అవకాశాలున్నాయి.  ఈ డీల్‌ పూర్తయితే అమెరికాలో రెండో అతి పెద్ద జనరిక్‌ కంపెనీగా(ఉత్పత్తుల పరంగా) అరబిందో అవతరిస్తుంది. అంతేకాకుండా చర్మ సంబంధిత ఔషధాల విషయంలో కూడా అమెరికాలో రెండో అతి పెద్ద కంపెనీ కూడా ఇదే అవుతుంది. ఈ డీల్‌కు అవసరమైన నిధులను రుణాల ద్వారానే సమకూర్చుకుంటామని కంపెనీ పేర్కొంది. డీల్‌ భారీగానే ఉన్నప్పటికీ,  వచ్చే ఆర్థిక సంవత్సరంలో రుణ, ఈక్విటీ నిష్పత్తి 0.6 స్థాయిలోనే ఉండగలదని   అంచనా. ఈ డీల్‌ కారణంగా జనరిక్‌ ఔషధాల ధరల ఒత్తిడి సమస్య కొంత వరకూ తీరనున్నది. ఈ డీల్‌ కారణంగా కంపెనీ రుణభారం పెరిగినప్పటికీ, గతంలో కంపెనీ టేకోవర్లు విజయవంతం అయిన దృష్ట్యా... ఈ రుణభారం పెద్ద సమస్య కాదని భావిస్తున్నాం.You may be interested

రిస్క్‌, రాబడుల మధ్య సమతుల్యం

Monday 10th September 2018

మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ ఫండ్‌ దేశీయ స్టాక్‌ మార్కెట్లు రికార్డు స్థాయి గరిష్టాల్లో ఉండడంతోపాటు, అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ, ఇతర అంశాలు ప్రభావం చూపిస్తున్న వేళ, ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా కాస్తంత రిస్క్‌ తగ్గించుకుని, మెరుగైన రాబడులు అందుకోవాలనుకునే వారికి మిరే అస్సెట్‌ హైబ్రిడ్‌ ఈక్విటీ పథకం అనకూలంగా ఉంటుంది. హైబ్రిడ్‌ పథకంగా మొత్తం పెట్టుబడుల్లో 65-80 శాతం మేర ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌, మనీ మార్కెట్‌ ఇనుస్ట్రుమెంట్లలో ఇన్వెస్ట్‌

కీలకస్థాయి 38,525 పాయింట్లు

Monday 10th September 2018

ఇతర దేశాల సూచీలతో పోలిస్తే కొద్దివారాల నుంచి పటిష్టమైన అప్‌ట్రెండ్‌ కొనసాగిస్తూ కొత్త రికార్డుల్ని నెలకొల్పుతున్న భారత్‌, అమెరికా సూచీలు, మొత్తంమీద గతవారం కుదుపునకు లోనయ్యాయి. ఈ నేపథ్యంలో చైనాపై ట్రేడ్‌వార్‌ను తీవ్రతరం చేస్తూ అమెరికా అధ్యక్షుడు మరో 267 బిలియన్‌ డాలర్ల సుంకాల్ని విధిస్తామని గత శుక్రవారం ప్రకటించడం, ఈ నెలాకర్లో జరిగే సమీక్షా సమావేశంలో మరోదఫా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునకు మార్గం సుగమం చేస్తూ పటిష్టమైన

Most from this category