STOCKS

News


ఈ స్టాక్స్‌ కొనచ్చు..

Monday 13th August 2018
Markets_main1534138098.png-19213

టైటాన్‌    కొనచ్చు 
బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.921
టార్గెట్‌ ధర: రూ.1,130
ఎందుకంటే: వాచ్‌లు, బ్రాండెడ్‌ జ్యూయలరీ రంగాల్లో అగ్రస్థానం ఈ కంపెనీదే. ఈ కంపెనీకి చెందిన ఎకానమీ వాచ్‌ సెగ్మెంట్‌... సొనాటా.. భారత్‌లోనే అత్యధికంగా అమ్ముడయ్యే వాచ్‌ బ్రాండ్‌. టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 9 శాతం వృద్ధితో రూ.4,450 కోట్లకు పెరిగింది. ఎబిటా 32 శాతం వృద్ధి చెంది రూ.480 కోట్లకు, నికర లాభం 32 శాతం ఎగసి రూ.330 కోట్లకు పెరిగాయి.  స్థూల మార్జిన్‌ 1 శాతం వృద్ధితో 27.4 శాతానికి చేరింది. జ్యూయలరీ విభాగం అమ్మకాలు 6 శాతం, మార్జిన్‌ 1 శాతం వృద్ధితో 11 శాతానికి పెరిగాయి. ఈ విభాగంలో కంపెనీ మార్కెట్‌ వాటా కూడా పెరిగింది.  పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం మార్జిన్‌ తగ్గినా, అమ్మకాలు మాత్రం 22-23 శాతం రేంజ్‌లో వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. వాచ్‌ల విభాగం అమ్మకాలు 15 శాతం వృద్ధి చెందాయి. 19 శాతం మార్జిన్స్‌ను సాధించింది. కళ్లజోళ్ల విభాగం కూడా వృద్ధి బాట పట్టింది. పూర్తి ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగం 26 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనా. రిటైల్‌ రంగంలో ఉత్తమమైన ఆదాయ వృద్ధి సాధిస్తున్న లార్జ్‌క్యాప్‌  కంపెనీల్లో ఇది కూడా ఒకటి. ఈ కారణంగా ఈ షేర్‌కు అధిక వేల్యూయేషన్‌ ఉండటం సమంజసమే.  2020 ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 52 రెట్ల ధర, రూ.1,130ను ఏడాది కాలంలో ఈ షేర్‌ చేరుతుందని అంచనా వేస్తున్నాం. తరుగుదల పెరుగుతుండటంతో ఇబిటా మార్జిన్లపై కొంత ప్రతికూల ప్రభావం ఉండొచ్చు. 


హిందుస్తాన్‌ పెట్రోలియమ్‌ కార్పొ    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.286
టార్గెట్‌ ధర: రూ.463
ఎందుకంటే: ఈ ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌ క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి.  ఎబిటా 96 శాతం వృద్ధితో రూ.3,191 కోట్లకు పెరిగింది.  స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌)22 శాతం వృద్ధితో 7.15 డాలర్లు(ఒక్కో బ్యారెల్‌కు) పెరగడం వల్ల ఎబిటా ఈ స్థాయిలో ఎగసింది. ఇతర ఆదాయం 46 శాతం తగ్గి రూ.306 కోట్లకు పడిపోయింది. అయినప్పటికీ, నికర లాభం 86 శాతం వృద్ధితో రూ.1,719 కోట్లకు పెరిగింది. రూ.537 కోట్ల ఫారెక్స్‌ నష్టాలను కూడా కలుపుకుంటే నిర్వహణ వ్యయాలు 12 శాతం పెరిగాయి. అయితే సీక్వెన్షియల్‌గా చూస్తే, 8 శాతం తగ్గాయి. గత క్యూ1లో రూ.12,200 కోట్లుగా ఉన్న రుణ భారం ఈ క్యూ1లో రూ.14,800 కోట్లకు పెరిగింది. దీంతో వడ్డీ వ్యయాలు 34 శాతం పెరిగి రూ.191 కోట్లకు చేరాయి. అయితే గత ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్‌లో రూ.20,990 కోట్లుగా ఉన్న రుణ భారం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.14,800 కోట్లకు తగ్గింది. మొత్తం అమ్మకాలు 6 శాతం పెరిగాయి. స్థూల మార్జిన్‌ ప్రస్తుతం తక్కువ స్థాయిలోనే ఉన్నా, త్వరలోనే సాధారణ స్థాయికి చేరుతుందని అంచనా వేస్తున్నాం. ప్రస్తుత స్థాయి నుంచి మార్కెటింగ్‌ మార్జిన్‌లు మరింతగా పెరిగితే అత్యధిక ప్రయోజనం పొందే ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఇదే అవుతుంది. ఏడాది కాలంలో ఈ షేర్‌ 42 శాతం క్షీణించింది. సమ్‌ ఆఫ్‌ ద పార్ట్స్‌(ఎస్‌ఓటీపీ) ప్రాతిపదికన ఈ షేర్‌ టా‍ర్గెట్‌ ధరను నిర్ణయించాం. 
 You may be interested

నెలరోజుల కోసం టాప్‌ టెన్‌ సిఫార్సులు

Monday 13th August 2018

వచ్చే నెల రెండు నెలల్లో 14 శాతం వరకు లాభాన్నిచ్చే పది స్టాక్స్‌ను వివిధ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. ఏంజల్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు 1. టాటాస్టీల్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 610. స్టాప్‌లాస్‌ రూ. 553. గత రెండు వారాలుగా మెటల్‌ స్టాకుల్లో టాటాస్టీల్‌ టర్న్ ఎరౌండ్‌ చూపి అప్‌మూవ్‌లోకి మళ్లింది. గత వారం రూ. 565ను దాటి బుల్లిష్‌ బ్రేకవుట్‌ సాధించింది. వారం చార్టుల్లో మరింత అప్‌మూవ్‌ అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలో

స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో అన్నీ చిన్న షేర్లే ఉండవా ?

Monday 13th August 2018

ప్ర: స్మాల్‌ క్యాప్‌ ఫండ్స్‌లో వంద శాతం స్మాల్‌ క్యాప్‌ షేర్లు ఉండవని, కొన్ని లిక్విడ్‌ షేర్లను కూడా ఫండ్‌ మేనేజర్లు కొనుగోలు చేస్తారని విన్నాను. అది నిజమేనా ? ఎందుకలా చేస్తారు. ఫండ్‌ మేనేజర్లు తమ ఫండ్స్‌కు సంబంధించి లిక్విడిటీని ప్రతికూల పరిస్థితుల్లో ఎలా మేనేజ్‌ చేస్తారు ? -శ్రీకాంత్‌, విజయవాడ  జ: లిక్విడిటీ నిర్వహణకు వివిధ రకాలైన పద్ధతులను ఫండ్‌ మేనేజర్లు అనుసరిస్తూ ఉంటారు. దాంట్లో ప్రధానమైనది లిక్విడ్‌(అమ్మకాలు, కొనుగోళ్లు

Most from this category