STOCKS

News


దీర్ఘకాలానికి మూడు స్టాక్స్‌

Sunday 30th September 2018
Markets_main1538305877.png-20721

సెప్టెంబర్‌ మాసం స్టాక్‌ మార్కెట్లను నష్టాల్లో నడిపించింది. నిఫ్టీ 12,000 దాటేస్తుందన్న అంచనాలతో కొందరు అనలిస్టులు, ఇన్వెస్టర్లు ఉండగా, మార్కెట్లు ఉన్నట్టుండి రివర్స్‌గేర్‌ పట్టాయి.  కేవలం ఒక్క నెలలోనే ఇన్వెస్టర్లు రూ.15 లక్షల కోట్ల పెట్టుబడుల విలువను కోల్పోయారు. నిఫ్టీ 7 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి గరిష్టాల నుంచి చూస్తే బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌ 19.5 శాతం, స్మాల్‌క్యాప్‌ 28.5 శాతం నష్టపోయాయి. చాలా స్టాక్స్‌ వాటి సరసమైన ధరలను కూడా కోల్పోయి తక్కువకు వచ్చేశాయి. అయినా కొనేందుకు ఆసక్తి చూపించేవారు లేరు. కానీ, దీర్ఘకాలంలో మంచి పనితీరుకు అవకాశం ఉన్న ఎల్‌అండ్‌టీ సబ్సిడరీ కంపెనీలు మూడింటిని ‘ఈక్విటీ99’ వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ సూచించారు. 

 

ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో అంచనాలకు మించి మెరుగైన పనితీరును ప్రకటించింది. క్వార్టర్‌ వారీగా కరెన్సీ ఆదాయంలో 5.1 శాతం, వార్షికంగా 22.9 శాతం మేర ఆదాయ వృద్ధి నమోదైంది. అమెరికా డాలర్‌ రూపేణా ఆదాయం త్రైమాసికం వారీగా 3.5 శాతం, వార్షికంగా 23.4 శాతం మేర ఉంది. ఎబిట్డా మార్జిన్‌ క్వార్టర్‌ వారీగా 19.4 శాతం ఉంది. ఇది 1.7 శాతం అధికం. నికర లాభం త్రైమాసికం వారీగా 24.8 శాతం వృద్ధితో రూ.361.3 కోట్లకు చేరుకుంది. బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగంలో, హైటెక్‌ మీడియా విభాగంలోనూ రెండంకెల వృద్ధి నమోదైంది.  

 

ఎల్‌అండ్‌టీ టెక్నాలజీ సర్వీసెస్‌
జూన్‌ క్వార్టర్‌లో కంపెనీ నికర లాభం రెట్టింపు కాగా, ఆదాయంలో 40 శాతం వృద్ధి నమోదైంది. సీక్వెన్షియల్‌గా చూస్తే ఆదాయం 9.2 శాతం, నికర లాభం 24 శాతం చొప్పున పెరిగాయి. డాలర్‌ రూపేణా ఆదాయం 169 మిలియన్‌ డాలర్లుగా ఉంది. క్వార్టర్‌ వారీగా 5.6 శాతం, వార్షికంగా 32 శాతం వృద్ధి ఇది. ఎబిట్డా మార్జిన్‌ 170 బేసిస్‌ పాయింట్లు పెరిగి 17 శాతానికి చేరుకుంది. ఐదు మల్టీ మిలియన్‌ డాలర్లతో కూడిన ఆర్డర్లను కంపెనీ జేజిక్కించుకుంది. పీఈ రేషియో 29.05 కాగా, గత ఆర్థిక సంవత్సరంలో 800 శాతం డివిడెండ్‌ చెల్లించింది. మధ్య కాలానికి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

 

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌
జూన్‌ క్వార్టర్‌కు సంబంధించి అద్భుతమైన ఫలితాలను ప్రకటించింది. నికర వడ్డీ మార్జిన్‌ వార్షికంగా చూస్తే 48.2 శాతం మెరుగుపడి రూ.1,528 కోట్లుగా ఉంది. నికర లాభం 71 శాతం వృద్ధితో రూ.538 కోట్లుగా నమోదైంది. కంపెనీ రుణ పుస్తకం 24 శాతం వృద్ధితో రూ.86,571 కోట్లకు చేరుకుంది. గ్రామీణ ఫైనాన్స్‌లో 76 శాతం, హౌసింగ్‌ ఫైనాన్స్‌లో 48 శాతం, హోల్‌సేల్‌ ఫైనాన్స్‌లో 7 శాతం వృద్ధిని కంపెనీ చూపించింది. మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు 60 శాతం పెరిగి రూ.71,118 కోట్లకు చేరాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఈ స్టాక్‌ పీఈ 15గానే ఉంది. మాతృసంస్థ ఎల్‌అండ్‌టీకి 107.81 మిలియన్‌ ప్రిఫరెన్షియల్‌ షేర్లను, ఒక్కో షేరును రూ.1185.51 చొప్పున కేటాయించింది. ఈ రేటు కంటే ప్రస్తుతం చాలా తక్కువ ధరకే స్టా్క్‌ అందుబాటులో ఉంది. మధ్య, దీర్ఘకాలానికి దీన్ని కొనుగోలు చేయవచ్చు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Monday 1st October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో సోమవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 7 పాయింట్ల లాభంతో 10,966 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,954 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్లు లాభంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా పాజిటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలు లాభాల్లో ఉన్నాయి. అమెరికా

వచ్చే ఆరు నెలలు మార్కెట్లపై ప్రభావం చూపించేవి ఇవే!

Sunday 30th September 2018

దేశీయ, అంతర్జాతీయ అంశాలు ఎన్నో స్టాక్‌ మార్కెట్లను నష్టాల పాల్జేస్తుండడాన్ని చూస్తున్నాం. మార్కెట్లలో కొత్తగా లిక్విడిటీ సమస్య వచ్చినట్టు ఆందోళన కూడా నష్టాలకు మరింత ఆజ్యం పోసింది. మరి ఈ కాలంలో మీ దగ్గరున్న పోర్ట్‌ఫోలియోను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే ఆరు నెలల కాలంలో మన మార్కెట్లపై ప్రభావం చూపించే అంశాలు గురించి తెలుసుకుంటే, ఆ తర్వాత ఓ నిర్ణయానికి రావచ్చు. రూపాయి ఈ ఏడాది రూపాయి డాలర్‌ మారకంలో

Most from this category