STOCKS

News


ఈ స్టాక్స్‌ కొనచ్చు

Monday 15th October 2018
Markets_main1539583505.png-21158

అరవింద్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: కోటక్‌ సెక్యూరిటీస్‌
ప్రస్తుత ధర: రూ.330
టార్గెట్‌ ధర: రూ.450
ఎందుకంటే: కంపెనీ ప్రధాన వ్యాపారాలు-టెక్స్‌టైల్స్‌, అప్పారెల్స్‌, ఇంజినీరింగ్‌ మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. అరవింద్‌ ఫ్యాషన్స్‌ పేరుతో బ్రాండెడ్‌ అప్పారెల్‌ వ్యాపారాన్ని, అరవింద్‌ పేరుతో టెక్స్‌టైల్స్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ఫ్లైయింగ్‌ మెషీన్‌, కోల్ట్‌, రగ్గర్స్‌ వంటి సొంత బ్రాండ్స్‌తో పాటు యారో, టామీ హిల్‌ఫిగర్‌ చెరోకి వంటి విదేశీ బ్రాండ్ల దుస్తులను కూడా విక్రయిస్తోంది. అన్‌లిమిటెడ్‌ పేరుతో రిటైల్‌ చెయిన్‌ను నిర్వహిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద బ్యూటీ రిటైలర్‌ సెఫోరాకు ప్రాంచైజీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. సమీప భవిష్యత్తులోనే ​బ్రాండెడ్‌ అప్పారెల్‌ (దుస్తుల) వ్యాపారాన్ని, ఇంజినీరింగ్‌ వ్యాపారాన్ని డీ-మెర్జ్‌ చేయనున్నది. దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉంది. దీనికి సంబంధించిన తుది నిర్ణయాన్ని ఎన్‌సీఎల్‌టీ వెల్లడించాల్సి ఉంది.  ప్రస్తుతం 3 కోట్లుగా ఉన్న వార్షిక దుస్తుల ఉత్పత్తిని 4-5 ఏళ్లలో నాలుగు రెట్లకు పెంచాలనేది కంపెనీ లక్ష్యం. ఈ లక్ష్యసాధనకు అనుగుణంగానే దుస్తుల తయారీ విస్తరణ వ్యూహం ప్రణాళిక ప్రకారంగానే జరుగుతోంది. ఓనమ్‌ పండగ సందర్భంలోనే కేరళలో వరదలు రావడంతో దుస్తుల వ్యాపార విభాగం వృద్ధి ఈ క్యూ2లో అంతంతమాత్రంగానే ఉండనున్నది. దసరా, దీపావళి తదితర పండుగల కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంగాలో అమ్మకాలు బాగా పుంజుకుంటాయని కంపెనీ భావిస్తోంది. నిర్వహణ పనితీరు మెరుగుపడటం,తో బ్రాండెడ్‌ అప్పారెల్‌ బిజినెస్‌ మార్జిన్లు కూడా మెరుగుపడతాయని కంపెనీ భావిస్తోంది. మొత్తం మీద టెక్స్‌టైల్స్‌ వ్యాపారం 10 శాతం వృద్ధి సాధించగలదని కంపెనీ అంచనా వేస్తోంది. ఇక మార్జిన్ల పరంగా చూస్తే, బ్రాండ్‌, రిటైల్‌ వ్యాపారాల్లో మార్జిన్లు 20-24 శాతం, ఇంజినీరింగ్‌ వ్యాపార విభాగం 10-12 శాతం రేంజ్‌లో వృద్ధి చెందవచ్చని అంచనాలున్నాయి. రెండేళ్ల కాలంలో ఆదాయం పరంగా కంపెనీ బ్రాండెడ్‌ అప్పారెల్‌ విభాగం 17 శాతం, టెక్స్‌లైట్స్‌ విభాగం 9 శాతం, ఇంజినీరింగ్‌ విభాగం 17.5 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలవని భావిస్తున్నాం. విదేశీ బ్రాండ్ల లైసెన్స్‌ నిబంధనల్లో మార్పులు, చేర్పులు, ఎగుమతి ప్రోత్సాహకాలు తక్కువగా ఉండటం, ముడి పదార్ధాల ధరలు పెరుగుదల, కరెన్సీ ఒడిదుడుకులు...ఇవన్నీ ప్రతికూలాంశాలు. 

టీసీఎస్‌        కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: షేర్‌ఖాన్‌ 
ప్రస్తుత ధర: రూ.1,918
టార్గెట్‌ ధర: రూ.2,400
ఎందుకంటే: కంపెనీ ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఆదాయం 12 శాతం (సీక్వె‍న్షియల్‌గా చూస్తే, 4 శాతం) చొప్పున వృద్ధి చెందింది. దాదాపు రెండేళ్ల తర్వాత రెండంకెల వృద్ధిని సాధించింది. డిజిటల్‌ విభాగం ఆదాయం 60 శాతం వృద్ధి చెందడమే దీనికి ప్రధాన కారణం. రూపాయి బలహీనపడటం, వేతన పెంపు లేకపోవడం వల్ల ఎబిట్‌ మార్జిన్‌ 150 బేసిస్‌ పాయింట్లు పెరిగి 26.5 శాతానికి ఎగసింది. అయితే ఇతర ఆదాయం సీక్వెన్షియల్‌గా 51 శాతం తగ్గింది. మొత్తం మీద నికర ఆదాయం 8 శాతం పెరిగి(క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన) రూ.7,901 కోట్లకు పెరిగింది. డిజిటల్‌ వ్యాపార విభాగం మంచి వృద్ధిని సాధిస్తోంది. అమెరికా, యూకేల్లోని పెద్ద కంపెనీల నుంచి డిమాండ్‌ పెరుగుతుండటంతో డిజిటల్‌ విభాగం జోరు మరింతగా పెరగనున్నది. భౌగోళికంగా చూస్తే, వివిధ దేశాల నుంచి వ్యాపార వృద్ధి జోరుగానే కొనసాగుతోంది. ఈ క్యూ2లో 10 కోట్ల డాలర్ల కాంట్రాక్టులను నాలుగు పెద్ద, కొత్త కంపెనీల నుంచి సాధించింది. కొత్తగా 10 వేలకు పైగా ఉద్యోగాలిచ్చింది. ఒక్క క్వార్టర్‌లో ఈ స్థాయిలో కొత్త ఉద్యోగాలివ్వడం గత మూడేళ్లలో ఇదే మొదటిసారి.  సాధారణంగా ఆర్థిక సంవత్సరంలో చివరి ఆరు నెలల్లో ఐటీ రంగానికి ఏమంత ఆశావహంగా ఉండదు. అయినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వృద్ది రెండంకెల స్థాయిలో ఉండగలదని కంపెనీ గైడెన్స్‌ను ఇచ్చింది. బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, బీమా(బీఎఫ్‌ఎస్‌ఐ), రిటైల్‌ రంగాలు రికవరీ బాటలో ఉండటం, యూరప్‌లో అవుట్‌సోర్సింగ్‌ డిమాండ్‌ పెరగడమే దీనికి ప్రధాన కారణాలు. జర్మనీ, ఫ్రాన్స్‌ల్లో కంపెనీ పెట్టిన ఇన్వెస్ట్‌మెం‍ట్స్‌ ఫలాలనివ్వడం ప్రారంభమైంది. ఇటీవల ఈ షేర్‌ 12 శాతం వరకూ పతనమైంది. 2020 ఆర్థిక సంవత్సరం అంచనా ఈపీఎస్‌కు 21 రెట్ల ధరకు ప్రస్తుతం ఈ షేర్‌ ధర ట్రేడవుతోంది. డిజిటల్‌ విభాగంలో ప్రాజెక్ట్‌ల అమలు తీరు బాగా ఉండటం, ఇతర ఐటీ కంపెనీలతో పోల్చితే ఆదాయ వృద్ధి అత్యుత్తమంగా ఉండటం, డిజిటల్‌ విభాగం మంచి జోరు మీద ఉండటం.. సానుకూలాంశాలు. 



You may be interested

సుగర్‌ కంపెనీల స్టాకులపై పాజిటివ్‌!

Monday 15th October 2018

స్టీవర్ట్‌ అండ్‌ మాకరిట్చ్‌  ప్రభుత్వం తాజాగా ప్రకటించిన ఇథనాల్‌ పాలసీతో సుగర్‌ కంపెనీల స్టాకులకు మేలు జరుగుతుందని స్టీవర్ట్‌ అండ్‌ మాక్‌రిట్చ్‌ బ్రోకరేజ్‌ అంచనా వేస్తోంది. బలరామ్‌పూర్‌ చిని, ధర్మపూర్‌ సుగర్‌, ప్రజ్‌ ఇండస్ట్రీస్‌పై పాజిటివ్‌గా ఉన్నట్లు తెలిపింది. ఈ స్టాకులు మరో 50- 90 శాతం వరకు ర్యాలీ జరపగలవని అభిప్రాయపడింది.  1. బలరాంపూర్‌ చిని: టార్గెట్‌ రూ. 152. ఇప్పటికే కంపెనీకి భారీ డిస్టిలరీ సామర్ధ్యం ఉంది. కొత్తగా గులారియా

ఫండ్స్‌కు స్టాప్‌-లాస్‌ వర్తిస్తుందా ?

Monday 15th October 2018

ప్ర: స్మాల్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) విధానంలో ఇన్వెస్ట్‌ చేస్తే ఫలితాలు బాగా ఉంటాయని పలు పర్సనల్‌ ఫైనాన్స్‌ వెబ్‌సైట్‌లు పేర్కొంటున్నాయి.  స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌ చాలా రిస్క్‌ అని తెలుసు. అయినప్పటికీ ఈ ఫండ్స్‌లో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేటప్పుడు నేను తీసుకోవలసిన జాగ్రత్తలేంటి ?  -శ్రీధర్‌, కాకినాడ  జ: స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం

Most from this category