STOCKS

News


ఈ షేర్లను పడ్డప్పుడల్లా కొనండి..

Monday 12th November 2018
Markets_main1542004506.png-21897

నిఫ్టీ ఇండెక్స్‌ తన బలమైన మద్దతు స్థాయి 10,000 మార్క్‌ నుంచి బౌన్స్‌బ్యాక్‌ అయ్యిందని ఎల్‌కేపీ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ రోహిత్‌ సింగ్రే తెలిపారు. డైలీ చార్ట్స్‌లో పాజిటివ్‌ డైవర్జెన్స్‌ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. రివర్సల్‌కు ఇది ఒక సంకేతమని తెలిపారు. ఇండెక్స్‌ తన 200 రోజుల మూవింగ్‌ యావరేజ్‌కు దిగువున ట్రేడ్‌ అవుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది బలమైన నిరోధ స్థాయి 10,600- 10,700 జోన్‌ దిగువున కదలాడుతోందని తెలిపారు. 10,700 స్థాయిని బ్రేక్‌ చేస్తే ఇండెక్స్‌లో మరింత పెరుగుదల ఉంటుందని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. 
నిఫ్టీ ఇండెక్స్‌ పోయిన వారంలో 10,585 స్థాయి వద్ద ముగిసిందని, వారంగా చూస్తే 32 పాయింట్లు లాభపడిందని రోహిత్‌ తెలిపారు. ‘ఇండెక్స్‌కు తక్షణ నిరోధ స్థాయి 10,700 మార్క్‌. ఇండెక్స్‌ ఈ మార్క్‌ను బ్రేక్‌ చేస్తే.. అప్పుడు 11,100 జోన్‌కు వెళ్లొచ్చు’ అని అంచనా వేశారు. 
ప్రస్తుతం మార్కెట్‌ పరిస్థితులు పాజిటివ్‌గా ఉన్నాయని రోహిత్‌ తెలిపారు. ఇన్వెస్టర్లు పడ్డప్పుడల్లా కొనే స్ట్రాటజీని అనుసరిస్తే మంచిదని సూచించారు. ఇన్వెస్ట్‌ చేసే ముందు స్టాక్‌, సెక్టార్‌ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఫార్మా, ఆటో రంగాలపై పాజిటివ్‌గా ఉన్నామని తెలిపారు. అందువల్ల సన్‌ ఫార్మా, ఆరబిందో ఫార్మా, మారుతీ, హీరో మోటొకార్ప్‌, బజాజ్‌ ఆటో స్టాక్స్‌ విషయంలో పడ్డప్పుడల్లా కొనే వ్యూహాన్ని అనుసరించవచ్చని పేర్కొన్నారు. ఇండిగో, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, సన్‌ టీవీ షేర్లకు కూడా ప్రాధాన్యమివ్వొచ్చని తెలిపారు. 



You may be interested

అవంతీ ఫీడ్స్‌ షేరు ధర 14% డౌన్‌

Monday 12th November 2018

రూ.361 వద్దకు పతనం ముంబై: అవంతీ ఫీడ్స్‌ షేరు ధర సోమవారం ఉదయం 14 శాతం నష్టపోయింది. ఇంట్రాడేలో రూ.361 వద్ద కనిష్టస్థాయిని నమోదుచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2018-19) రెండో త్రైమాసిక ఫలితాలను కంపెనీ శనివారం విడుదల చేయగా.. ఈ ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో ఇవాళ షేరు ధర అమ్మకాల ఒత్తిడికి గురైంది. ఈఏడాది క్యూ2(జులై-సెప్టెంబర్‌)లో నికర లాభం రూ.46.40 కోట్లుగా కంపెనీ ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన నికర లాభం 60.11

రూపాయి డీలా : ఐటీ ర్యాలీ

Monday 12th November 2018

డాలర్‌ మారకంలో రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసి వస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌ ప్రారంభంలో 2 శాతం ర్యాలీ చేసింది. డాలర్‌ ఇండెక్స్‌ స్థిరమైన ర్యాలీ కారణంగా నేడు ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి బలహీనపడింది. ఫలితంగా డాలర్‌ రూపంలో ఆదాయాల్ని ఆర్జించే ఐటీ కంపెనీ షేర్లు లాభాల ర్యాలీ చేస్తున్నాయి. నేటి ఇంట్రాడేలో నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతం ర్యాలీ

Most from this category