STOCKS

News


10,700–10,800 శ్రేణికి తగ్గుదల.. కొనుగోళ్లకు అవకాశం

Monday 4th March 2019
Markets_main1551690885.png-24421

సమీప భవిష్యత్తులో నిఫ్టీ 10,700–10,800 శ్రేణికి తగ్గితే కొనుగోళ్లకు అవకాశమని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా అభిప్రాయపడ్డారు. 11,000, 11,200 స్ట్రయిక్స్‌ వద్ద అధిక కాల్‌ బిల్డప్, 10,700, 10,600 స్ట్రయిక్స్‌ వద్ద అధిక పుట్‌ బిల్డప్‌ వుందని, ఈ కారణంగా ఆయా స్థాయిలు మార్చి సిరీస్‌లో నిరోధాలు, మద్దతులుగా వుంటాయని అంచనావేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి కరెక్షన్‌లో నిఫ్టీ 10–12 వారాల స్లోపింగ్‌ ట్రెండ్‌లైన్, మల్టీపుల్‌ సపోర్ట్స్‌ కలిగిన 10,580 పాయింట్ల స్థాయిని పరిరక్షించుకున్నందున, స్వల్పకాలికంగా ట్రెండ్‌ పాజిటివ్‌గా వుండవచ్చని ఆయన విశ్లేషించారు. అయినప్పటికీ మార్కెట్‌ హెచ్చుతగ్గులకు లోనవుతుందని, 10,700–10,660 పాయింట్ల మద్దతుశ్రేణిని కోల్పోకపోతే బుల్లిష్‌నెస్‌ కొనసాగుతుందని పాల్వియా అంచనావేశారు. ఈ నేపథ్యంలో నిఫ్టీ మద్దతుస్థాయిలకు తగ్గినపుడు ఎంపికచేసిన షేర్లు కొనవచ్చని సూచించారు. పీఎస్‌యూ బ్యాంకులు, ఫెర్టిలైజర్స్, సిమెంటు, ఫార్మా షేర్లు రానున్న వారాల్లో పటిష్టంగా వుండవచ్చని అంచనాగా చెప్పారు. 
 



You may be interested

పదేళ్లలో మల్టీబ్యాగర్లు ఇవే

Monday 4th March 2019

ముంబై:- అమెరికా ఆర్థిక సంక్షోభం తర్వాత గత పదేళ్లలో మార్కెట్‌ పడుతూ, లేస్తూ వున్నా...  కేవలం రూ.10వేల పెట్టుబడితో 10ఏళ్ల కాలపరిమితిలో ఇన్వెస్టర్లను కోటిశ్వర్లను, లక్షాధికారులను చేసిన మల్టీబ్యాగర్లు స్టాక్‌ మార్కెట్లో ఉన్నాయి. అలాంటి మల్టీబ్యాగర్లు ఇవే... వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ లిమిటెడ్‌ షేరు:- సరిగ్గా 10 ఏళ్ల క్రితం అంటే 2009 మార్చిలో కంపెనీ షేరు ధర రూ.0.20 పైసలు మాత్రమే. తన అనుబంధ సంస్థ హార్డ్‌క్యాస్టిల్‌ రెస్టారెంట్స్‌ పశ్చిమ, దక్షిణ భారత్‌లో

 మార్చి సిరీస్‌లో నిఫ్టీకి 10,700 మంచి మద్దతు

Monday 4th March 2019

మార్చి డెరివేటివ్‌ సిరీస్‌లో నిఫ్టీకి 10,700 పాయింట్ల స్థాయి మంచి మద్దతుగా నిలుస్తుందన్న అంచనాల్ని ఐసీఐసీఐ డెరివేటివ్‌ హెడ్‌ అమిత్‌ గుప్తా వెల్లడించారు. మార్చి సిరీస్‌ కేవలం 14.2 మిలియన్‌ షేర్లతో (రోలోవర్స్‌) మొదలయ్యిందని, గత మూడేళ్లలో కొత్త సిరీస్‌ ఇంత తక్కువ రోలోవర్స్‌తో మొదలుకావడం ఇదే ప్రధమమని, కనిష్ట ఓపెన్‌ ఇంట్రస్ట్‌ కారణంగానే ఇటీవల మార్కెట్‌ కదకలికల శ్రేణి పరిమితంగా వుందని ఆయన వివరించారు. అయితే రోలోవర్‌ స్ప్రెడ్‌

Most from this category