STOCKS

News


ఎంపిక చేసిన మిడ్‌క్యాప్స్‌ కొనొచ్చు!

Friday 11th January 2019
Markets_main1547200054.png-23535

సీఎల్‌ఎస్‌ఏ సిఫార్సు
గతేడాది పతనానంతరం కోలుకుంటున్న మిడ్‌క్యాప్స్‌ విభాగంలో నాణ్యమైన స్టాకులను లాంగ్‌టర్మ్‌ కోసం కొనుగోలు చేయవచ్చని ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ సూచించింది. తను సూచించిన స్టాక్స్‌పై ఎంతమంది అనలిస్టులు పాజిటివ్‌గా ఉన్నారో సైతం సీఎల్‌ఎస్‌ఏ వెల్లడించింది.
1. ఆదిత్య బిర్లా ఫాషన్‌ అండ్‌ రిటైల్‌: టార్గెట్‌ రూ. 240. దేశంలో టాప్‌ 4 అపెరల్‌ బ్రాండ్స్‌ ఉన్న కంపెనీ. రాబోయే రెండేళ్లలో ఈపీఎస్‌లో దాదాపు 30 శాతం వృద్ది ఉండొచ్చు. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 15 మంది.
2. లెమన్‌ ట్రీ హోటల్‌: టార్గెట్‌ రూ. 87. మిడ్‌ప్రైస్‌ హోటల్‌ విభాగంలో వేగవంతమైన వృద్ధి నమోదవుతోంది. ఇటీవల కంపెనీ కుదుర్చుకున్న జాయింట్‌వెంచర్‌ లాభదాయకం కాగలదు. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 6గురు.
3. సుప్రీం ఇండస్ట్రీస్‌: టార్గెట్‌ రూ. 1217. కంఎపనీ వాల్యూషన్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. కంపెనీ క్యాపిటల్‌ కేటాయింపులు, ఆర్‌ఓసీ బాగున్నాయి. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 15మంది.
4.  అపోలో హాస్పిటల్స్‌: టార్గెట్‌ రూ. 1500. బలమైన బ్రాండ్‌తో దేశమంతా విస్తరించింది. వచ్చే రెండుమూడేళ్లపాటు భారీ క్యాపెక్స్‌ ఏమీ లేదు. ఈపీఎస్‌లో 70 శాతం వృద్ది ఉండొచ్చు. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 21 మంది.
5. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌: టార్గెట్‌ రూ. 843. బలమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ ఉంది. సమయానికి ప్రాజెక్టుల డెలివరీ చేస్తుంది. రాబోయే రోజుల్లో ప్రీసేల్స్‌లో 20 శాతం వరకు మెరుగుదల ఉండొచ్చు. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 10
6. టీటీకే ప్రెస్టేజ్‌: టార్గెట్‌ రూ. 9000. గ్రామీణ వినిమయం పెరగడంతో లబ్ది చేకూరనుంది. ఉజ్వల స్కీమ్‌ కంపెనీకి కలిసిరానుంది. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 5గురు.
7. వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌: టార్గెట్‌ రూ. 550. బ్రాండ్‌ విస్తృతిని పెంచుకుంటోంది. స్టోర్స్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు ఎక్కువ వ్యయాలు చేస్తోంది. కొనొచ్చని సిఫార్సు చేసిన అనలిస్టులు: 5గురు. 



You may be interested

10800 దిగువన నిఫ్టీ ముగింపు

Friday 11th January 2019

ఐటీ, అటో రంగ షేర్ల క్షీణతతో మార్కెట్‌ వరుసగా రెండో రోజూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ 10800 మార్కును కోల్పోయింది. ఆసియా మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో నేడు సూచీలు లాభాలతో ప్రారంభయ్యాయి. అయితే ఇంట్రాడేలో ఐటీ, అటో, ఇన్ఫ్రా, షేర్ల అమ్మకాలు వెల్లువెత్తడంతో మిడ్‌సెషన్‌ సమయానికి సూచీలు నష్టాల బాట పట్టాయి. అలాగే మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ రంగాలకు చెందిన షేర్లలో సైతం అమ్మకాలు సూచీల ట్రేడింగ్‌పై

ఎయిర్‌టెల్‌కు డౌన్‌గ్రేడ్‌ షాక్‌​..!

Friday 11th January 2019

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ దిగ్గజ సంస్థ బ్యాంక్‌ ఆఫ్‌ మెరిలించ్‌ దేశీయ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లకు షాకిచ్చింది. రానున్న రోజుల్లో ఎయిర్‌టెల్‌ ఎదుర్కోనున్న సవాళ్లను దృష్టి పెట్టుకుని ఆ కంపెనీ షేరు రేటింగ్‌ను బ్యాంక్‌ ఆఫ్‌ మెరిలించ్‌ డౌన్‌గ్రేడ్‌ చేసింది. అలాగే షేరు టార్గెట్‌ ధరను ప్రస్తుత ధర నుంచి రూ.300లకు కుదించింది. ఫలితంగా ఎయిర్‌టెల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనై ఇంట్రాడే 2.50శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.2:20లని.కు షేరు

Most from this category