STOCKS

News


10,600 స్టాప్‌లాస్‌!

Tuesday 18th December 2018
Markets_main1545111804.png-23038

నిఫ్టీ లాంగ్స్‌పై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ సూచన
కేవలం ఐదు సెషన్లలో నిఫ్టీ 550 పాయింట్ల ర్యాలీ జరిపి సోమవారం 10900 పాయింట్లకు చేరువలో క్లోజయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో మంగళవారం కాస్త వెనకడుగు వేసి 10830 పాయింట్ల వద్ద కదలాడుతోంది. తాజా ర్యాలీలో నిఫ్టీ తన అధోముఖ వాలు రేఖను అవలీలగా దాటేసింది. దీంతో పాటు 200 రోజుల డీఎంఏ స్థాయి 10757ను కూడా అధిగమించింది. ప్రస్తుతం నిఫ్టీ తన 20, 50, 100, 200 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన స్థిరంగా ఉంది. ఇవన్నీ స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌నే సూచిస్తున్నాయి. కొంత వెనకడుగు వేసినా చివరకు నిఫ్టీ 10950, 11200 పాయింట్ల వరకు ఎగబాకే ఛాన్సులు కనిపిస్తున్నాయని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. ఒకవేళ నిఫ్టీ పరుగులకు బ్రేక్‌ పడితే 10600 పాయింట్ల వద్ద గట్టి మద్దతు లభించనుందని తెలిపింది. ఇండెక్స్‌ ఫ్యూచర్‌లో ఎఫ్‌ఐఐలు కొత్త లాంగ్స్‌ తీసుకున్నాయి. ఆప్షన్‌ డేటా చూస్తే నిఫ్టీ పుట్‌, కాల్‌ నిష్పత్తి 1.61కి చేరింది. 10600, 10700 పాయింట్ల వద్ద పుట్‌ రైటింగ్‌ కనిపిస్తోంది. నిఫ్టీ మిడ్‌ స్మాల్‌ క్యాప్‌ సూచీలు ప్రధానసూచీ కన్నా మెరుగ్గా కదలాడుతున్నాయి. గతవారం ఈ సూచీలు సుమారు 4 శాతం వరకు లాభపడగా, నిఫ్టీ 2 శాతం లాభపడింది. ఇదే ధోరణి కొనసాగవచ్చు. సాంకేతిక విశ్లేషణ సైతం స్వల్పకాలిక అప్‌మూవ్‌కే అవకాశాన్ని సూచిస్తోంది. అందువల్ల నిఫ్టీలో 10600 స్టాప్‌లాస్‌గా లాంగ్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు.
బ్యాంకు నిఫ్టీ కొన్ని సెషన్లుగా నిఫ్టీ కన్నా మెరుగైన ‍ప్రదర్శన చూపుతోంది. ప్రస్తుతం చాలా బుల్లిష్‌గా కనిపిస్తోంది. సోమవారం 27,000 పాయింట్లను దాటి కీలకమైన పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించింది. ఇకపై బ్యాంకు నిఫ్టీకి 27200, 27650 పాయింట్ల వద్ద నిరోధాలు ఎదురవుతాయి. దిగువన 26500 పాయింట్ల వద్ద మద్దతు లభిస్తుంది. బ్యాంకు నిఫ్టీ ఫ్యూచర్స్‌లో లాంగ్స్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల మరికొంత కాలం అప్‌మూవ్‌ కొనసాగవచ్చు.You may be interested

ఎగిసిన పసిడి ధర

Tuesday 18th December 2018

అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి మందగమన భయాలు పసిడి ధరను పరుగులు పెట్టించాయి. ఫలితంగా నిన్నటి ట్రేడింగ్‌ సెషన్‌లో పసిడి ధర 11డాలర్లు ర్యాలీ చేసింది. గత రెండువారాల్లో ఒకేరోజులో పసిడి ఇంతస్థాయిలో లాభపడటం ఇదే మొదటిసారి. రాత్రి అమెరికా మార్కెట్లో వడ్డీరేట్ల పెంపు భయాలతో పాటు ఆర్థిక వృద్ధి నెమ్మదించదనే కారణంతో అక్కడి స్టాక్‌మార్కెట్లు 19నెలల కనిష్టానికి చేరుకున్నాయి. దీంతో అక్కడి మార్కెట్లో పసిడి ధర ఇంట్రాడేలో 1,252.20 గరిష్టాన్ని

20 నుంచి సిమెంట్‌ ఎక్స్‌పో

Tuesday 18th December 2018

హైదరాబాద్‌: ఈనెల 20–21 తేదీల్లో 10వ ఇండియన్‌ సిమెంట్‌ ఎక్స్‌పో–2018 జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఈ ప్రదర్శనకు భారతి సిమెంట్స్‌ సిల్వర్‌ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. ఈ ప్రదర్శనలో సిమెంట్, కాంక్రీట్, ఎక్విప్‌మెంట్, నిర్మాణ, మౌలిక రంగ టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటారు. 80కి పైగా కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఎక్స్‌పోతో పాటుగా ఈ కార్యక్రమంలో 3వ సెమెంట్‌ రివ్యూ అవార్డులు–2018, 5వ సిమెంట్‌

Most from this category