STOCKS

News


డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, టాటా కెమికల్స్‌ స్టాక్స్‌ కొనచ్చు

Monday 1st October 2018
Markets_main1538372237.png-20740

దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: చోళమండలం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
ప్రస్తుత ధర: రూ.275
టార్గెట్‌ ధర: రూ.743
ఎందుకంటే: వాధ్వాన్‌ గ్రూప్‌ ప్రమోట్‌ చేస్తున్న ఈ కంపెనీ.. భారత్‌లో మూడో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ. తక్కువ, మధ్య ఆదాయ వర్గాల వారికి రుణాలివ్వడంపై దృష్టి సారించే ఏకైక హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కూడా ఇదే. 352 నగరాల్లో రూ.1,20,900 కోట్ల నిర్వహణ ఆస్తులతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కొత్త గృహాల కొనుగోళ్లు, రీసేల్‌ హౌజ్‌ ప్రొపర్టీ, ఇళ్ల రిపేర్లకు, ఎక్స్‌టెన్సన్‌కు అవసరమైన రుణాలందిస్తోంది. ఇటీవల లిక్విడిటీ సమస్య కారణంగా కుదేలైన కంపెనీ షేర్లలో ఈ షేర్‌ కూడా ఉంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌ బాండ్లలో భారీగా ఇన్వెస్ట్‌చేసిన డీఎస్‌పీ మ్యూచువల్‌ ఫండ్‌...ఇన్వెస్టర్ల నుంచి రిడంప్షన్‌ ఒత్తిడి అధికంగా ఉండటంతో దివాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ కమర్షియల్‌ పేపర్‌(సీపీ)ను డిస్కౌంట్‌కు విక్రయించింది. దీంతో ఈ నెల 21న డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్‌ 42 శాతం పతనమైంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ చెల్లింపుల్లో డిఫాల్ట్‌ కావడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ రేటింగ్‌ను ఇక్రా తగ్గించడం.. తదితర పరిణామాల కారణంగా లిక్విడిటీ సమస్యలు ఉన్నాయామోనన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో కమర్షియల్‌ పేపర్‌ ద్వారా రుణాలు సమీకరించిన పలు హౌసింగ్‌ ఫైనాన్స్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల షేర్లు కుదేలయ్యాయి. అయితే ఈ కంపెనీ సమీకరించిన మొత్తం రుణాల్లో సీపీ ద్వారా సమీకరించిన రుణాలు 8 శాతం వరకూ మాత్రమే ఉన్నాయి. రుణాల చెల్లింపుల్లో డిఫాల్ట్‌ కాలేదని, వచ్చే ఏడాది 2019 వరకూ చెల్లించే రుణాలకు చెల్లించడానికి అవసరమైన నిధులు ఉన్నాయని, ఎలాంటి లిక్విడిటీ సమస్య లేదని కంపనీ ధీమాను వ్యక్తం చేసింది.  ఈ కంపెనీ  నిధుల సమీకరణ  వ్యయం 8.65 శాతంగా ఉంది. కంపెనీ ఇచ్చిన రుణాల్లో 99 శాతం వరకూ  ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలు కావడంతో వడ్డీ రేట్లు పెరిగినా, వాటిని వినియోగదారులకు బదలాయించే వెసులుబాటు కంపెనీకి ఉంది. మరోవైపు కంపెనీ తీసుకున్న రుణాల్లో 7 శాతం మాత్రమే ఫ్లోటింగ్‌ రేట్‌ రుణాలున్నాయి. నికర వడ్డీ మార్జిన్‌ 3-3.85 శాతం రేంజ్‌లోనే ఉంచేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. రుణ ఎగవేతలు తక్కువ స్థాయిలో ఉండటం, కలెక్షన్‌, రికవరీ టీమ్స్‌ పటిష్టంగా ఉండటం, రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటం, వివిధ మార్గాల ద్వారా రుణాల సమీకరణ కారణంగా నిధుల వ్యయం తగ్గుతుండటం, రుణ నాణ్యత నిలకడగా ఉండటం... ఇవన్నీ. సానుకూలాంశాలు.  అంచనాలకనుగుణంగానే ఈ కంపెనీ క్యూ2 ఫలితాలు ఉంటే, ఈ షేర్‌ ధర రికవరీ కాగదలని అంచనా వేస్తున్నాం. 


టాటా కెమికల్స్‌    కొనచ్చు
బ్రోకరేజ్‌ సంస్థ: మెతిలాల్‌ ఓస్వాల్‌
ప్రస్తుత ధర: రూ.690
టార్గెట్‌ ధర: రూ.956
ఎందుకంటే: టాటా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ఇటీవలనే కిచిడి మిక్స్‌, చట్నీ తదితర ఐదు సెగ్మెంట్లలలో కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. అయితే వీటిని ఆన్‌లైన్‌ ద్వారానే విక్రయిస్తోంది. టాటా సాల్ట్‌, టాటా సాల్ట్‌ లైట్‌, పప్పు ధాన్యాలు, శనగపిండి తదితర ఉత్పత్తులను సాధారణ కిరాణా దుకాణాల ద్వారా  అందిస్తోంది.  ఐ-శక్తి బ్రాండ్‌ కింద పప్పు ధాన్యాలను విక్రయిస్తోంది. టాటా సంపన్న్ బ్రాండ్‌ కింద  ఐదు రకాలైన (సుగంధ ద్రవ్యాలు, ధాన్యాలు, శనగపిండి, చట్నీలు, మిక్స్‌) ఉత్పత్తులను వివిధ వేరియంట్లలో అందిస్తోంది. మరో ఐదు రకాలైన సెగ్మెంట్లలో ఉత్పత్తులను అందించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. 17 లక్షల రిటైల్‌ అవుట్‌లెట్ల ద్వారా తన ఉత్పత్తులను అందిస్తోంది. ఉప్పు కాకుండా ఇతర ఉత్పత్తులతో కూడిన టాటా సంపన్న్‌ వ్యాపారం ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు రెట్లు పెరుగుతుందని కంపెనీ అంచనా వేస్తోంది. తక్కువ మార్జిన్లు వచ్చినప్పటికీ, అన్ని రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చి, ఆ తర్వాత విలువాధారిత ఉత్పత్తులను కూడా అందించడం ద్వారా మార్జిన్లను పెంచుకోవాలనేది కంపెనీ వ్యూహం. టాటా కెమికల్స్‌ అందించే ఉత్పత్తుల ధరలన్నీ..ఇతర కంపెనీల ఉత్పత్తుల ధరల కంటే 10-15 శాతం అధికంగా ఉంటాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరా కారణంగా కంపెనీకి కామధేనువు లాంటి సోడా యాష్‌, సోడియం బైకార్బొనేట్‌ల వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. పంట దిగుబడి సమయంలోనే ఉత్పత్తులను సమీకరించే విధానానికి స్వస్తి చెప్పి, అవసరాలకనుగుణంగా మండీలద్వారా సమీకరించేలా ఇన్వెంటరీ పాలసీలో మార్పులు, చేర్పులు చేసింది. మార్కెటింగ్‌పై పెట్టుబడులను రెట్టింపు చేస్తోంది. రెండేళ్లలో ఆదాయం, నికర లాభం చెరో 10 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించగలవని అంచనా వేస్తున్నాం. 
 You may be interested

సేవల్లో సంస్కరణలతో వృద్ధికి ఊతం

Monday 1st October 2018

వాషింగ్టన్‌: దీర్ఘకాలికంగా ఎకానమీ వృద్ధి మెరుగుపడేందుకు సేవల రంగంలో సంస్కరణలు తోడ్పడతాయనడానికి భారత్‌ నిదర్శనమని అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంక్‌, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సంయుక్తంగా రూపొందించిన నివేదికలో పేర్కొన్నాయి. 1990లలో భారత్‌లో ప్రవేశపెట్టిన సంస్కరణలు మరింత స్వేచ్ఛా వాణిజ్యానికి, మెరుగైన నియంత్రణ విధానాలు, భారీగా పెట్టుబడుల ఆకర్షణకు ఉపయోగపడ్డాయని నివేదిక వివరించింది. దేశ, విదేశీ సంస్థల నుంచి భారత తయారీ సంస్థలు సర్వీసులు పొందేందుకు, పోటీ

10 నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌

Monday 1st October 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: దసరా, దీపావళి సీజన్‌ సందర్భంగా భారీ ఆఫర్లు, డీల్స్‌తో ఈ నెల 10 నుంచి 15 వరకు ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ను నిర్వహిస్తున్నట్లు ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ ప్రకటించింది. ఈ సారి కూడా తమ ప్రైమ్‌ కస్టమర్లకు ఈ డీల్స్‌ను, ఆఫర్లను ముందే చూసే అవకాశం ఉంటుందని తెలియజేసింది. స్మార్ట్‌ఫోన్లు, టీవీల వంటి గృహోపకరణాలు, హోమ్‌-కిచెన్‌ ఉత్పత్తులు, ఫ్యాషన్‌ వస్తువులతో పాటు గ్రోసరీ, కన్సూమర్‌ ఎలక్ట్రానిక్‌

Most from this category