STOCKS

News


ఓ షేరును కొని అట్టే పెట్టుకోవడం సరైనదేనా?

Monday 22nd October 2018
Markets_main1540230294.png-21368

ఓ షేరు కొని, అలాగే ఉంచేసుకోవడం (బై అండ్‌ హోల్డ్‌) అన్నది ఉత్తమ విధానం అని తరచూ వింటుంటాం. కానీ, సంపద సృష్టికి ఇది మెరుగైన విధానం కాదంటున్నారు నిపుణులు. అభిషేక్‌ ఎంతో ఓపిక ఉన్న ఇన్వెస్టర్‌. వారెన్‌ బఫెట్‌ అనుసరించే బై అండ్‌ హోల్డ్‌ విధానాన్ని అనుసరిస్తుంటాడు. డబ్బులు అవసరం పడినప్పుడే షేర్లను విక్రయిస్తాడు తప్పించి వాటి గురించి పట్టించుకోడు. నాణ్యమైన లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ను తగిన పరిశోధన తర్వాతే కొనుగోలు చేస్తుంటాడు. దాంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది అతడి అభిప్రాయం. ఐటీసీ, మారుతి సుజుకీ, ఇన్ఫోసిస్‌ తదితర స్టాక్స్‌ అతడు ఎంచుకునే జాబితాలో ఉంటాయి. కానీ, అన్ని సమయాల్లోనూ ఈ విధానమే మందులా పనిచేస్తుందనుకోవడం సరికాదన్నది నిపుణుల సూచన. 

బలమైన ఆర్థిక మూలాలు ఉండి, క్రమంగా వృద్ధి చెందే స్టాక్స్‌ను అభిషేక్‌ ఎంచుకోవడం చేస్తాడు. అయితే, ఈ స్టాక్స్‌ను ఎల్లవేళలా ఉంచుకోవడం సాధ్యమేనా? నిజంగా కాదు. అభిషేక్‌ పెట్టిన ప్రతీ పెట్టుబడి స్థిరమైన వృద్ధిని నమోదు చేయలేవు. కొన్ని దెబ్బతినిపోవచ్చు. కానీ, అటువంటి వాటి నుంచి తమ పెట్టుబడులతో వెంటనే బయటపడిపోవాలి. అలాగే, షేరు విలువలపై ఎప్పుడూ కన్నేసి ఉంచాలి. మార్కెట్లు పెరుగుతూ, తగ్గుతూ ఉంటాయి. భవిష్యత్తు ఆదాయాలను డిస్కౌంట్‌ చేసుకుంటుంటాయి. మార్కెట్లు బాగా పెరిగి బుడగలా మారిన సందర్భాలను గతంలో (2007-08, 2013-14, 2017-18) చూశాం. ఈ తరహా సందర్భాల్లో లాభాలను స్వీకరించాలి. అలా చేయడం వల్ల మార్కెట్లు పడిపోతే, అభిషేక్‌ ఎంతో కొంత లాభాలతో ఉంటాడు. తన చేతిలో ఉన్న నగదుతో తిరిగి తక్కువ ధరల వద్ద స్టాక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. అందుకే స్టాక్‌ ఏ ధరల వద్ద ఉంటే బయటపడాలి, ఎక్కడ లాభాలను స్వీకరించాలనే దాన్ని ముందే నిర్ణయించుకోవాలి. మార్కెట్లు బాగా పెరిగిన ప్రతీసారీ ఈ విధానమే ఆచరణీయంగా నిపుణులు సూచిస్తున్నారు. కనుక బై అండ్‌ హోల్డ్‌ అని కాకుండా... బై (కొనుగోలు చేసి), హోల్డ్‌ (కొనసాగడం), మానిటర్‌ (పర్యవేక్షించడం) అనుసరించాలని సూచిస్తున్నారు. You may be interested

పలు నోకియా ఫోన్లపై భారీగా ధరల తగ్గింపు

Monday 22nd October 2018

నోకియా బ్రాండ్‌పై స్మార్ట్‌ఫోన్లను విక్రయించే హెచ్‌ఎండీ గ్లోబల్‌ పలు మోడళ్లపై ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. మార్కెట్లో ధరల పరంగా విపరీతమైన పోటీ నెలకొనడం, చైనాకు చెందిన కంపెనీలు పెద్ద ఎత్తున స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరలకు ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో నోకియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.  నోకియా 3.1 నోకియా 3.1 స్మార్ట్‌ఫోన్‌ను మూడు నెలల క్రితం హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసింది. 3జీబీ/32జీబీ వెర్షన్‌ ధరను మొదట్లో రూ.11,999గా నిర్ణయించింది. తాజాగా ఈ

నెల రోజుల కోసం పది రికమండేషన్లు

Monday 22nd October 2018

వచ్చే నెల రోజుల్లో దాదాపు 17 శాతం వరకు రాబడినిచ్చే పది స్టాకులను వివిధ అనలిస్టులు రికమండ్‌ చేస్తున్నారు. 5నాన్స్‌ డాట్‌కామ్‌ దినేశ్‌రోహిరా సిఫార్సులు- 1. ఐటీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 306. స్టాప్‌లాస్‌ రూ. 275. గత నెల రోజుల్లో దాదాపు 17 శాతం పతనమైంది. దిగువన రూ. 270 స్థాయిల్లో బలమైన మద్దతు పొంది పైకి ఎగిసింది. మార్కెట్లు నెగిటివ్‌గా ఉన్నా కొద్దికాలంగా స్టాకు అప్‌మూవ్‌లోనే ఉంది. తాజాగా 200

Most from this category