STOCKS

News


మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌

Wednesday 26th December 2018
Markets_main1545820204.png-23243

మిడ్‌సెషన్‌ నుంచి వెల్లువెత్తిన కొనుగోళ్లతో బుధవారం మార్కెట్‌ లాభాలతో ముగిసింది. బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్ల రికవరీ కారణంగా సూచీల మూడు రోజు నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ సూచి 179 పాయింట్ల లాభంతో 35,650 వద్ద, నిఫ్టీ సూచీ 66పాయింట్ల లాభంతో 10,730 వద్ద ముగిసింది. అంతర్జాతీయ పరిణామాలతో భారీ నష్టాలతో ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు మిడ్‌సెషన్‌ సమయానికి సెన్సెక్స్‌ 400పాయింట్లకు పైగా నష్టపోగా, నిఫ్టీ 100 పాయింట్లకుపైగా  కోల్పోయింది. మిడ్‌సెషన్‌ అనంతరం బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ రంగ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సూచీలు తిరిగి లాభాల్లో మళ్లాయి. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ 213 పాయింట్ల రేంజ్‌లో ట్రేడ్‌ అవ్వగా, సెన్సెక్స్‌ సూచీ 700 రేంజ్‌లో కదలాడింది. నిఫ్టీ బ్యాంక్‌ ఇండెక్స్‌ కనిష్టస్థాయి నుంచి 600 పాయింట్లు కోలుకుని 26,986.80 వద్ద ముగిసింది. రూపాయి ర్యాలీతో ఐటీ, ఫార్మా రంగాలకు చెందిన సూచీలు నష్టాలతో ముగిశాయి. మిగిలిన అన్ని రంగాలకు చెందిన ఇండెక్స్‌లు లాభాల్లో ముగిశాయి.
నష్టాల ప్రారంభం
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, వాణిజ్య వివాదాలతో పాటు అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థిరత తదితర కారణాలతో అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న సంక్షోభ భయాలతో నేడు దేశీయ మార్కెట్‌ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ 27 పాయింట్ల నష్టంతో 35,443 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,635 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అటో, ఐటీ, మెటల్‌, ఫార్మా రంగాలకు చెందిన షేర్లలో నెలకొన్న అమ్మకాలతో సూచీల నష్టాలు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. మిడ్‌సెషన్‌ సమయానికల్లా నిఫ్టీ ఇండెక్స్‌ 150 పాయింట్లు నష్టపోయి 10,534.55 వద్ద, సెన్సెక్స్‌ సూచీ 465పాయింట్లను కోల్పోయి 35,011 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అనంతరం మిడ్‌ సెషన్‌ సమయంలో మార్కెట్లో నెలకొన్న ఆకస్మిక కొనుగోళ్లతో సూచీలు అనూహ్యంగా లాభాల్లోకి మళ్లాయి. ముఖ్యంగా అధిక వెయిటేజీ కలిగిన ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం ర్యాలీతో గంటకు గంటకు లాభాలను పెంచుకుంటూ సాగిపోయాయి. ఒకానొక దశలో సెన్సెక్స్‌ 234 పాయింట్లు లాభపడి 35,711 వద్ద, నిప్టీ 84 పాయింట్లను ఆర్జించి 10,747.50 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌ నుంచి బ్యాంకింగ్‌, అటో, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో కొనుగోళ్లతో చివరకు మూడు రోజు నష్టాల ట్రేడింగ్‌కు ముగింపు పలుకుతూ సెన్సెక్స్‌ 35,650 వద్ద, నిఫ్టీ 10,729ల వద్ద స్థిరపడ్డాయి.
కలిసొచ్చిన క్రూడాయిల్‌ పతనం, రూపాయి ర్యాలీ:-
గత మూడు సెషన్స్‌లో దాదాపు 3శాతం వరకు నష్టపోయిన దేశీయ సూచీలకు క్రూడాయిల్‌ భారీ పతనం ఉత్సాహానిచ్చాయి. బ్యారెల్‌ క్రూయిడాల్‌ ధర 50డాలర్ల దిగువకు చేరుకోవడంతో స్టాక్‌ మార్కెట్లో డిసెంబర్‌ డెరివేటివ్స్‌ కాంటాక్టులో షార్ట్‌ కవరింగ్‌ జరిగినట్లు ఏ.కే. ఐడీబీఐ క్యాపిటల్‌ మార్కెట్‌ హెడ్‌ రీసెర్చ్‌ పర్సన్‌ ఏ.కే. ప్రభాకర్‌ తెలిపారు. అలాగే అమెరికాలో నెలకొన్న రాజకీయ అస్థితరతో డాలర్‌ ఇండెక్స్‌ స్తబ్ధుగా ట్రేడ్‌ అవుతుండంతో రూపాయి ర్యాలీ చేసింది. నేటి ఇంట్రాడేలో డాలర్‌ మారకంలో రూపాయి విలువలో ఒకానోక దశలో 39పైసలు బలపడి 70స్థాయి దిగువ 69.75ల స్థాయికి పెరిగింది. ఈ రెండు అంశాలు మార్కెట్‌ షార్ప్‌ రికవరీకి కలిసొచ్చాయి. కొన్ని రోజులుగా భారీ నష్టాలతో ముగిస్తున్న అమెరికా మార్కెట్ల  ఫ్యూచర్స్ నష్టాల నుంచి లాభాల్లోకి రావడం కూడా మార్కెట్‌ రికవరీకి కారణమయినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
హెచ్‌డీఎఫ్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫిన్‌సర్వీసెస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, అదానీ ట్రాన్స్‌ మిషన్స్‌, జీలిమిటెడ్‌ షేర్లు 2నుంచి4శాతం లాభపడగా, ఐషర్‌మోటర్స్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, యస్‌ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు 1శాతం నుంచి 2.50శాతం నష్టపోయాయి.



You may be interested

రెండు రంగాలపై యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ సానుకూలం

Wednesday 26th December 2018

మార్కెట్‌ మొత్తం మీద 60-70 శాతం స్టాక్స్‌ పనితీరు వెనుకబడి ఉన్నంత మాత్రాన బేర్‌ మార్కెట్‌ అని చెప్పడం సరికాదని యూటీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫండ్‌ మేనేజర్‌ వి. శ్రీవాస్తవ అన్నారు. బెంచ్‌ మార్క్‌ ఇండెక్స్‌లు సానుకూలంగా ఉన్నాయని, ఇతర మార్కెట్లతో పోలిస్తే మంచి పనితీరు చూపించాయన్నారు. సమీప కాలంలో సాధారణ ఎన్నికలే మార్కెట్ల విషయంలో అనిశ్చితికి దారితీసే అంశంగా పేర్కొన్నారు. మన దేశంలో పెట్టుబడులను

ఈ స్మాల్‌క్యాప్స్‌ ఇకపై మిడ్‌క్యాప్స్‌!!

Wednesday 26th December 2018

స్మాల్‌క్యాప్‌ బాస్కెట్‌లో ఉన్న దాదాపు 15 స్టాక్స్‌ మిడ్‌క్యాప్‌ కేటగిరిలోకి మారనున్నాయి. అదేసమయంలో మిడ్‌క్యాప్‌లోని కొన్ని స్టాక్స్‌ స్మాల్‌క్యాప్‌ విభాగంలోకి రానున్నాయి. లార్జ్‌క్యాప్‌- మిడ్‌క్యాప్‌ మధ్య కొన్ని స్టాక్స్‌ అటూఇటూ బదిలీ కానున్నాయి. మార్కెట్‌ రెగ్యులేటర్‌ సెబీ కొత్త పునఃవర్గీకరణ నిబంధనల్లో భాగంగా మ్యూచువల్‌ ఫండ్స్‌ సమాఖ్య యాంఫీ త్వరలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ప్రకారం ఏ ఏ స్టాక్స్‌ ఏ కేటగిరిలో ఉండాలో తెలిపే కొత్త జాబితాలను ప్రకటించనుంది. ఇందులో

Most from this category