STOCKS

News


సెన్సెక్స్‌ లాభం @ 391 పాయింట్లు

Friday 3rd August 2018
Markets_main1533292191.png-18922

11350 పైకి నిఫ్టీ
ముంబై:- క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ శుక్రవారం రెట్టించిన ఉత్సాహంతో ర్యాలీ జరిపింది. ఆర్థిక రంగ షేర్ల అండతో సూచీలు చెలరేగడంతో మార్కెట్‌ రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. మార్కెట్‌ ముగిసే సమయానికి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 391 పాయింట్ల లాభంతో 37556 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 116 పాయింట్లు ర్యాలీ జరిపి 11360వద్ద ముగిశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌, ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌ రంగ షేర్లల్లో వెల్లువెత్తిన కొనుగోళ్లతో క్రితం రోజు నష్టాలను పూర్తిగా పూడ్చుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 400 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 11,360 మార్కును మరోసారి అందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలకు చెందిన సూచీలు లాభపడగా, అత్యధికంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ ఇండెక్స్‌  2శాతం లాభపడింది. కీలకమైన నిఫ్టీ బ్యాంకు ఇండెక్స్‌ 339 పాయింట్లు లాభపడి 27,695 వద్ద ముగిసింది.
సెన్సెక్స్‌ 400 పాయింట్ల లాభం
రెండు రోజుల నష్టాల తరువాత నేడు మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 162 పాయింట్ల లాభంతో 37,530 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 11,297 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ఆరంభ లాభాలను అందుకున్న సెన్సెక్స్‌ 200 పాయింట్ల లాభాల్ని, నిఫ్టీ 11300 పాయింట్ల స్థాయిని క్షణాల్లో అందుకుంది. అనంతరం ఆర్థిక షేర్ల అండతో మిడ్‌ సెషన్‌ కల్లా అవలీలగా సెన్సెక్స్‌ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్ల లాభాలను సాధించాయి.  మిడ్‌ సెషన్‌ అనంతరం యూరప్‌ మార్కెట్లు లాభాల ప్రారంభానికి తోడు ఎఫ్‌ఎంజీసీ, మెటల్‌ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తడంతో  సెన్సెక్స్‌ 417 పాయింట్ల లాభంతో 37,582 వద్ద, నిఫ్టీ 122 పాయింట్లతో 11,368 వద్ద ఇంట్రాడే హైని నమోదు చేశాయి.
గెయిల్‌, యస్‌ బ్యాంకు, వేదాంత, యాక్సి్‌స్‌ బ్యాంకు, ఇండియన్‌బుల్‌ హౌసింగ్స్‌ ఫైనాన్స్‌ షేర్లు 3నుంచి 6.25 శాతం లాభపడగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, హీరోమోటో కార్ప్‌, గ్రాసీం, టాటామోటర్స్‌, టెక్‌మహీంద్రా షేర్లు అరశాతం నుంచి 1.50శాతం నష్టపోయాయి.



You may be interested

ఈ నెలంతా 11000- 11500 మధ్యలో నిఫ్టీ!

Friday 3rd August 2018

వే2వెల్త్‌ అంచనా గత శుక్రవారం ఆల్‌టైమ్‌ హై 11171 పాయింట్లను దాటేసిన నిఫ్టీ క్రమంగా బుధవారానికి ఆల్‌టైమ్‌ గరిష్ఠం 11390.55 పాయింట్లను తాకింది. అనంతరం ఆర్‌బీఐ రేట్లపెంపు నిర్ణయంతో వెనుకంజ వేసింది. ఈ క్రమంలో గురువారం 11300 పాయింట్లను కోల్పోయి 11250 పాయింట్ల దిగువన క్లోజయింది. అయితే శుక్రవారం తిరిగి వేగంగా రీబౌండైంది. టెక్నికల్‌గా చూస్తే సూచీల్లో విస్తృత ట్రెండ్‌ బుల్లిష్‌గానే ఉంది. గత శుక్రవారపు గ్యాప్‌ అప్‌ జోన్‌ 11185-

మిడ్‌ క్యాప్స్‌.. ఇదే సరైన సమయం..

Friday 3rd August 2018

మిడ్‌ క్యాప్‌ షేర్లలో ఇన్వెస్ట్‌ చేయడానికి ఇదే సరైన సమయం అంటున్నారు ఐఐఎఫ్‌ఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెట్స్‌ అండ్‌ కార్పొరేట్‌ వ్యవహారాలు) సంజీవ్‌ భాసిన్‌. మిడ్‌ క్యాప్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల వచ్చే కొన్ని నెలల్లో మంచి రాబడులు అందుకోవచ్చని తెలిపారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయని భాసిన్‌ తెలిపారు. నిఫ్టీ 1,000 పాయింట్ల మేర పెరిగిందని, అలాగే

Most from this category