News


మూడు రంగాలపై కోటక్‌ బుల్లిష్‌

Tuesday 8th January 2019
news_main1546927771.png-23461

వచ్చే 2- 5 సంవత్సరాల కాలానికి క్యాపిటల్‌గూడ్స్‌, రైల్వే, నిర్మాణం మరియు రియల్టీ రంగాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని కోటక్‌ మహీంద్రా ఏఎంసీ మేనేజర్‌ అన్షుల్‌ సైగల్‌ అభిప్రాయపడ్డారు. ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలన్న ఆతృతలేకుంటే వీటిలో మంచి కంపెనీల షేర్లు ఎంచుకొని రెండు నుంచి ఐదేళ్లు వేచిచూడాలని ఇన్వెస్టర్లకు సలహా ఇచ్చారు. స్మాల్‌, మిడ్‌క్యాప్స్‌లో కొన్ని షేర్లు అత్యంత ఆకర్షణీయ వాల్యూషన్ల వద్ద కనిపిస్తున్నాయని చెప్పారు. గత కొన్నాళ్లుగా రియల్టీ పలు నియంత్రణాపరమైన ఇబ్బందులను ఎదుర్కొందన్నారు. రియల్టీలో ఎక్కువ శాతం వాటా అసంఘటిత రంగానిది ఉండే పరిస్థితి నుంచి క్రమంగా సంఘటితరంగం వాటా ఎక్కువగా ఉండే పరిస్థితి దిశగా పయనిస్తోందని చెప్పారు. అసంఘటిత రంగం వాటాను చేజిక్కించుకునే బడా రియల్టీ సంస్థలను గుర్తించి పెట్టుబడులు పెడితే దీర్ఘకాలంలో మంచి రాబడులు ఉంటాయన్నారు. ఈ రంగంలో కంపెనీలు దీర్ఘకాలంలో సాధించే విజయాలను వాల్యూషన్లు అంచనా వేయలేకపోతున్నాయని, అందుకే ఈ రంగం షేర్లు ఇంకా తక్కువ వాల్యూషన్ల వద్దనే ఉన్నాయన్నారు. 
దేశీయ సామర్ధ్య వినియోగం చాలా కాలం నుంచి 65- 70 శాతం వరకే ఉందని, సరాసరిన ఈ వినియోగం 75 శాతం వరకు ఉండాలని అన్షుల్‌ చెప్పారు. వినిమయం పెరిగిన కొద్దీ క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో మరింత జోరు కనిపిస్తుందన్నారు. మరోవైపు పలు రైల్వే కంపెనీలు ఐపీఓకి రానున్నాయని, దీంతో రైల్వేలో విలువ మార్కెట్లో అన్‌లాక్‌ అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుతం లార్జ్‌ క్యాప్స్‌, చిన్న క్యాప్స్‌ మధ్య వాల్యూషన్ల అంతరం చాలా ఎక్కువగా ఉందని, ఇంతటి వ్యత్యాసాలు గతంలో 2008 సంక్షోభానంతరం కనిపించాయని చెప్పారు. గతేడాది చిన్న స్టాక్స్‌లో వచ్చినట్లు లార్జ్‌క్యాప్స్‌లో భారీ పతనం వస్తే ఈ వ్యత్యాసం తగ్గుతుందన్నారు. ఈ పతనం రాకుంటే గతేడాదిలాగే ఈ ఏడాది కూడా చిన్న, పెద్ద స్టాక్స్‌ ప్రదర్శనలో వ్యత్యాసం కొనసాగుతుందన్నారు. దీంతో ఈ తేడా సవరించే క్రమంలో చిన్న, మిడ్‌స్టాక్స్‌ ఫండమెంటల్స్‌ మెరుగుపడే అవకాశాలుంటాయన్నారు. 



You may be interested

బంధన్‌బ్యాంక్‌పై బ్రోకరేజ్‌లు ఏమంటున్నాయ్‌?

Tuesday 8th January 2019

గృహ్‌ ఫైనాన్స్‌ను విలీనం చేసుకుంటున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 2 శాతం పతనమయ్యాయి. ఈ విలీనంపై బ్రోకరేజ్‌ సంస్థలు న్యూట్రల్‌గా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు బ్యాంకు రేటింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోవట్లేదని బ్రోకరేజ్‌లు తెలిపాయి. అయితే ఒప్పంద అనంతరం ఇరు కంపెనీల సమన్విత సహవాసంపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. గృహ్‌ ఫైనాన్స్‌ క్రమానుగతంగా లాభదాయక కంపెనీగా ఎదిగింది. అందువల్ల దీన్ని కొనుగోలు చేయడం

నెల రోజులకు పది సిఫార్సులు

Tuesday 8th January 2019

వచ్చే నెల రోజుల్లో 3- 12 శాతం రాబడినిచ్చే పది స్టాక్‌ ఐడియాలను మార్కెట్‌ నిపుణులు రికమండ్‌ చేస్తున్నారు. దినేశ్‌రోహిరా రికమండేషన్లు: 1. ఎస్కార్ట్స్‌': కొనొచ్చు. టార్గెట్‌ రూ. 759. స్టాప్‌లాస్‌ రూ. 680.  2. హిందాల్కో: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 201. స్టాప్‌లాస్‌ రూ. 228. 3. జేఎస్‌డబ్ల్యు స్టీల్‌: అమ్మొచ్చు. టార్గెట్‌ రూ. 142. స్టాప్‌లాస్‌ రూ. 155. మజార్‌మొహమద్‌ రికమండేషన్లు: 1. వేదాంత: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 203. స్టాప్‌లాస్‌ రూ. 183.  2. భారతి

Most from this category