STOCKS

News


ఈ మూడు రంగాలకు సై..

Friday 14th September 2018
Markets_main1536911554.png-20252

2013 నాటి ట్రెండ్‌ ఆధారంగా చూస్తే ప్రస్తుతం రూపాయి వేగంగా కోలుకుంటుందని ఐసీఐసీఐ డైరెక్ట్‌ హెచ్‌ఓఆర్‌ పంకజ్‌ పాండే తెలిపారు. ఆటో, సిమెంట్‌, కొన్ని ఫార్మా షేర్లల్లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని సూచించారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు. 
దేశీయంగా స్థూల ఆర్థికాంశాలు బాగున్నాయని పంకజ్‌ పాండే తెలిపారు. క్యూ1లో బలమైన జీడీపీ వృద్ధి రేటు సాధించామని పేర్కొన్నారు. కంపెనీల ఎర్నింగ్స్‌ పుంజుకున్నాయని తెలిపారు. అంతర్జాతీయ పరిస్థితుల నుంచే సవాళ్లు పొంచి ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికా-చైనా వాణిజ్య చర్చలు, రూపాయి మారక విలువ, క్రూడ్‌ ధరల కదలికలపై ప్రస్తుతం ఒక అంచనాకు రావడం కష్టతరమని తెలిపారు. క్రూడ్‌, రూపాయి వంటి అంశాలు దేశంలో ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ పరిస్థితులపై స్పష్టత వచ్చేంత వరకు మార్కెట్లు దాదాపు 1-2 నెలలపాటు కన్సాలిడేట్‌ దశలో ఉంటాయని తెలిపారు. 
దేశీయంగా మంచి పనితీరు కనబరుస్తున్నామని పంకజ్‌ పాండే పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్‌బీఐ కానీ రూపాయిని రక్షించడానికి ప్రయత్నిస్తాయని అనుకోవడం లేదన్నారు. అయితే 2013 పరిస్థితుల ఆధారంగా చూస్తే రూపాయి వేగంగా కోలుకుంటుందని తెలిపారు. అంతర్జాతీయంగా ఒడిదుడుకులున్నాయని, అందువల్ల మార్కెట్లు ఏ దిశలో కదులుతాయో అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. నిఫ్టీ 11,000 మార్క్‌ను హోల్డ్‌ చేయవచ్చని తెలిపారు. అలాగే కొన్ని స్టాక్స్‌ గత కొన్ని నెలలుగా సరైన పనితీరు కనబర్చలేదని, ఇప్పుడు అవి జోరు చూపవచ్చని పేర్కొన్నారు. అందులో ఆటో రంగం ఒకటని తెలిపారు. రానున్న పండుగ సీజన్‌ నేపథ్యంలో అమ్మకాలు పెరగొచ్చని అంచనా వేశారు. రానున్న నెలల్లో కన్‌స్ట్రక‌్షన్‌ కార్యకలాపాలు పుంజుకోవచ్చని, అందువల్ల సిమెంట్‌ రంగంలో మంచి వృద్ధి నమోదు కావొచ్చని తెలిపారు. అలాగే ఫార్మా రంగంలో కొన్ని స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఈ మూడు రంగాల స్టాక్స్‌ ధరలు పడిపోయాయని గుర్తుచేశారు.
టాటా మోటార్స్‌ స్టాక్‌ ఇంకా బాటమ్‌కు చేరుకోలేదని పంకజ్‌ పాండే తెలిపారు. తమ పోర్ట్‌ఫోలియో నుంచి ఈ స్టాక్స్‌ను కొంత కాలం క్రితం తొలగించామని పేర్కొన్నారు. నిఫ్టీలో అత్యంత చెత్త ప్రదర్శన కరబరుస్తున్న స్టాక్‌ ఇదేనని తెలిపారు. 40 శాతంమేర పడిపోయిందని పేర్కొన్నారు. దేశీయంగా ఈ కంపెనీ మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. అయితే అంతర్జాతీయంగా పరిస్థితులు బాగులేవని పేర్కొన్నారు. ప్రస్తుత స్థాయిల్లో టాటా మోటార్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయడం సవాలేనని తెలిపారు. టెక్నికల్‌గా చూస్తే స్టాక్‌లో కొంత బౌన్స్‌బ్యాక్‌ ఉంటుందని, అయితే వచ్చే 2-3 ఏళ్ల పాటు స్టాక్‌ ధరలో చెప్పుకోదగ్గ పనితీరు ఉండకపోవచ్చని పేర్కొన్నారు.      
 You may be interested

నాలుగునెలల కనిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Friday 14th September 2018

ముంబై:-  టోకు ధరల సూచీ(డబ్లూ‍్యపీఐ) ఆగస్ట్‌లో నాలుగునెలల కనిష్టానికి చేరుకుంది. ఆగస్ట్‌లో కూరగాయల ధరలు తగ్గడంతో పాటు, ఆహారోత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడంతో టోకు ధరల సూచీ(డబ్లూ‍్యపీఐ) 4.53 శాతానికి తగ్గింది. అందుకు ముందు నెల జూలైలో ఇది 5.09 శాతంగా నమోదు కాగా, గతేడాది ఇదే ఆగస్ట్‌లో ఇది 3.24శాతంగా నమోదైంది.  కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల శుక్రవారం విడుదల చేసిన ఆగస్ట్‌ ద్రవ్యోల్బణ గణాంకాల వివరాలు -  

ఇథనాల్‌ ధర పెంపుతో తీపెక్కిన చక్కెర షేర్లు

Friday 14th September 2018

ముంబై:- ఇథనాల్‌ ధరను కేంద్రం ప్రభుత్వం పెంచడంతో  శుక్రవారం చక్కెర షేర్లు మరింత తీపెక్కాయి. చక్కెర తయారీలో ఉత్పన్నమయ్యే ఇథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహించే యత్నాల్లో భాగంగా ఇథనాల్‌ ధరను  25శాతం పెంచుతున్నట్లు గత బుధవారం పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడించారు. ప్రస్తుతం లీటర్‌ ఇథనాల్‌ ధర రూ.47.13 ఉండగా.. దీన్ని రూ.59.13కి పెంచనున్నట్లు ఆయన తెలిపారు. ఇథనాల్‌ ధరను పెంచడం ద్వారా చక్కెర మిల్లులకు లాభం పెరుగుతుందనే అంచనాలతో

Most from this category