STOCKS

News


ఈ టాటా షేర్లు కొనొచ్చు!!

Monday 16th July 2018
Markets_main1531728473.png-18358

ఇండిట్రేడ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్‌, వోల్టాస్‌ స్టాక్స్‌ కొనొచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌తో మాట్లాడుతూ ఈ రికమెండేషన్లు చేశారు. టైటాన్‌ గురించి అందరికీ తెలుసన్నారు. ఈ స్టాక్ ధరలో కరెక‌్షన్‌ జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కొనడానికి ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్నారు. టైటాన్‌ ప్రధాన వ్యాపారం చాలా పటిష్టంగా ఉందని గుర్తుచేశారు. ఈ సంస్థ క్రమంగా మార్కెట్‌లో వాటాను పెంచుకుంటూ వస్తోందని తెలిపారు. గీతాంజలి, నీరవ్‌ చోక్సీ, పీసీ జువెలర్స్‌ పరిణామాలు కూడా టైటాన్‌కు సహకరిస్తున్నాయని పేర్కొన్నారు. కన్సూమర్లు టైటాన్‌ బ్రాండ్‌ను విశ్వసిస్తున్నారని తెలిపారు. ఇన్వెస్టర్లు ఎలాంటి అనుమానం లేకుండా టైటాన్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేశారు. మరో టాటా గ్రూప్‌కు చెందిన స్టాక్‌ కూడా స్థిరమైన పనితీరు కనబరుస్తోందన్నారు. అదే వోల్టాస్‌. ఈ సంస్థ మార్కెట్‌ వాటాను పెంచుకుంటూ వస్తోందని పేర్కొన్నారు. ఎయిర్‌ కండీషనర్‌ వ్యాపారం బలంగా ఉందని తెలిపారు. అందువల్ల ఈ స్టాక్‌కు కూడా కొనొచ్చని రికమెండ్‌ చేశారు. 
అలాగే మరోవైపు ఐనాక్స్‌, పీవీఆర్‌ షేర్ల జోలికి వెళ్లకపోతేనే మంచిదని సలహా ఇచ్చారు. మల్టీప్లెక్స్‌లోకి బయటి నుంచి ఆహార పదార్థాలను తీసుకుళ్లేవచ్చనే నిర్ణయం వల్ల ఈ కంపెనీల ఆదాయంపై ప్రతికూల ప్రభావం పడొచ్చని పేర్కొన్నారు. 



You may be interested

నాలుగున్నరేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

Monday 16th July 2018

ముంబై:- టోకు ధరల ద్రవ్యోల్బణం (డబ్య్లూపీఐ )జూన్‌ నెలలో నాలుగున్నరేళ్ల గరిష్టసాయికి చేరుకుంది. పెరిగిన ఇంధన ధరలతో పాటు, కూరగాయాల ధరలకు రెక్కలు రావడంతో జూన్‌లో టోకు ద్రవ్యోల్యణ సూచి 5.77 శాతానికి ఎగిసింది. గతేడాది(2017) ఇదే జూన్‌లో డబ్య్లూపీఐ ద్రవ్యోల్బణం రికార్డు కనిష్టస్థాయి 0.90 శాతంగా నమోదుకాగా, ఈ ఏడాది మే నెలలో టోకు ద్రవ్యోల్బణం 4.43శాతంగా నమోదైంది. జూన్‌లో పెరిగిన ద్రవ్యోల్యణం కారణంగా ఆగస్ట్‌లో మరింత పెరిగే

ఇన్ఫీvs టీసీఎస్‌: అంతలో ఎంత తేడా!

Monday 16th July 2018

పదేళ్లలో తారుమారు  సరిగ్గా దశాబ్ద కాలం ముందు అంటే 2008 ఆరంభంలో దేశీయ ఐటీ రంగంలో అతిపెద్ద కంపెనీ టీసీఎస్‌ కన్నా ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ దాదాపు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంది. అప్పట్లో ఇండియన్‌ ఐటీ అంటే ఇన్ఫీ అనేంతగా కంపెనీ పేరు మారుమోగిపోయింది. అయితే అదంతా గతం. అప్పటి నుంచి క్రమంగా టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫీ ప్రభ మసకబారుతూవచ్చింది. పదేళ్ల తర్వాత 2018లో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌(4172 కోట్ల

Most from this category