News


ఈ షేర్లు ఆకర్షణీయం: సెంట్రమ్‌ వెల్త్‌

Thursday 1st November 2018
Markets_main1541095656.png-21645

బ్యాంకింగ్‌ రంగం వ్యవస్థాగత, నిర్మాణాత్మక మార్పులోకి వెళ్లడంతో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలపై దృష్టి సారించినట్టు సెంట్రమ్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ జగన్నాథం తూనుగుంట్ల తెలిపారు. ఈ రంగాల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, సీడీఎస్‌ఎల్‌ పట్ల సానుకూలతను వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆ వార్తా సంస్థకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. 

 

ఎల్‌అండ్‌టీ ఎంత వరకు పెరగొచ్చు?
ఎల్‌అండ్‌టీ మంచి ఫలితాలను ప్రకటించిందని, ఈ సమయంలో మంచి ఫలితాలను ప్రకటించే కంపెనీ మార్కెట్‌ను తప్పకుండా ఆకర్షిస్తుందన్నారు. ‘‘ప్రతీ విభాగంలోనూ ఆదాయం, లాభాల పరంగా ఎల్‌అండ్‌టీ మంచి పనితీరు చూపించింది. ఒక్క విద్యుత్‌ విభాగమే ప్రతికూల పనితీరు కనబరిచింది. ఇన్వెస్టర్లు క్రమంగా కొనుగోలు చేసుకోతగిన షేర్లలో ఇదీ ఒకటి’’ అని జగన్నాథం తెలిపారు. 

ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో అమ్మకాల పరంగా అంత తేడా ఎందుకు?
‘‘గ్రామీణ ప్రాంత మార్కెట్‌పై ఆధారపడిన డాబర్‌ మంచి ఫలితాలను ఇ‍వ్వలేదు. ఇమామీ కూడా అంతే. కనుక ఈ స్టాక్స్‌పై ఒత్తిడి కొనసాగుతుంది. గ్రామీణ డిమాండ్‌ తిరిగి గాడిన పడినట్టు మార్కెట్‌ అంచనా వేస్తోంది. కానీ, కంపెనీల ఫలితాలను చూస్తే భిన్న వాతావరణం ఉంది. హెచ్‌యూఎల్‌ గ్రామీణ విక్రయాలు ఫర్వాలేదు. చూస్తుంటే గ్రామీణ డిమాండ్‌ రికవరీకి సమయం పట్టేట్టు ఉంది. ఈ ఫలితాల సీజన్‌లో మార్కెట్‌ కచ్చితంగా మంచి ఫలితాలను ఇచ్చిన స్టాక్స్‌కే ప్రాధాన్యం ఇస్తుంది. అటువంటి కంపెనీల్లోకే పెట్టుబడుల ప్రవాహం ఉంటుంది. ఉదాహరణకు నెస్లే ఆకట్టుకునే ఫలితాలను ఇచ్చింది. బ్రిటానియా కూడా మంచి పనితీరు ప్రదర్శించింది’’ అని జగన్నాథం వివరించారు. 

టాప్‌ మిడ్‌క్యాప్‌ సిఫారసులు?
బ్యాంకింగ్‌ రంగంలో మార్పుల నేపథ్యంలో ఫైనాన్షియల్స్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు జగన్నాథం చెప్పారు. మ్యూచువల్‌ ఫండ్స్‌, ఇన్వెస్టర్లు సైతం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్‌ కంపెనీల వైపు అడుగులు వేస్తున్నట్టు చెప్పారు. వ్యాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ స్టాక్‌ను పోర్ట్‌ఫోలియోకు యాడ్‌ చేసుకోవచ్చని సూచించారు. గత నెలలో చెప్పుకోతగ్గ కరెక్షన్‌కు గురైందన్నారు. ఆర్థిక సేవల విభాగంలో సీడీఎస్‌ఎల్‌ పట్ల సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. చాలా ఆకర్షణీయమైన విలువల వద్ద ఈ స్టాక్‌ లభిస్తోందన్నారు. రేటింగ్‌ ఏజెన్సీల్లో కేర్‌ రేటింగ్స్‌ను సిఫారసు చేస్తున్నట్టు తెలిపారు.You may be interested

టెలికం వినియోగదారులపై ఇక ధరల మోత!

Thursday 1st November 2018

టెలికం మార్కెట్లో జియో రాక ముందు వరకు కస్టమర్లు అధిక చార్జీల భారం భరించే వారు. 2016లో జియో అడుగు పెట్టడంతో కస్టమర్లపై పన్నీరు చల్లినట్టయింది. వాయిస్‌కాల్స్‌, డేటా, ఎస్‌ఎంఎస్‌ల ధరలన్నీ నేలపైకి దిగొచ్చాయి. జియో ఇప్పటికీ ధరలు, సేవల విషయంలో దూకుడు కొనసాగిస్తూనే ఉంది. అయితే, జియో కారణంగా రెండేళ్లపాటు భారీ లాభాలను కోల్పోయిన ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియాలు ఇప్పుడు కస్టమర్లపై ధరల బాదుడుకు రెడీ అయిపోయాయి. ఇన్నాళ్లు

భారీ రాబడిని ఇవ్వనున్న ఎన్‌బీఎఫ్‌సీలు..!

Thursday 1st November 2018

- వచ్చే 3-6 నెలల్లోనే 2013-14 తరహా రాబడి - కార్నెలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్‌ వికాస్ ఖేమానీ వ్యాఖ్య ముంబై: నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీ) వ్యవస్థలో ఉన్నటువంటి ఖాళీని పూరించడానికి వచ్చినవి కాదని వ్యాఖ్యానించిన కార్నెలియన్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఫౌండర్‌ వికాస్ ఖేమానీ.. ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి అవసరం కోసం ఏర్పడిన సంస్థలుగా ఇవి ఉన్నాయని విశ్లేషించారు. బ్యాంకులు చేయడానికి వీలులేనటువంటి వ్యాపారాన్ని ఈ సంస్థలు కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో

Most from this category