STOCKS

News


భారత్‌పై పాజిటివ్‌..

Wednesday 14th November 2018
Markets_main1542177793.png-21993

భారత్‌పై సానుకూల అంచనాలతోనే ఉన్నామని, ఇన్వెస్ట్‌మెంట్‌ అలొకేషన్‌లో ఎలాంటి మార్పులు లేవని సీఎల్‌ఎస్‌ఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ఈక్విటీ స్ట్రాటజిస్ట్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌ తెలిపారు. ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానాలను అనుసరించడంపై కేంద్రం అసంతృప్తి వ్యక్తంచేయడం సముచితమేనని అభిప్రాయపడ్డారు. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుదల నేపథ్యంలో ఆర్‌బీఐ సరళ ద్రవ్య విధానాలను అనుసరించొచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి పదికి ఎనిమిది మార్క్‌లు వేస్తున్నట్లు తెలిపారు. ఎనిమిది గొప్ప మార్కులు ఏమీ కాదని, ప్రభుత్వం బ్యాంకింగ్‌ సమస్యలను పరిష్కారించడంలో వేగంగా స్పందించలేదని  పేర్కొన్నారు. సీఎల్‌ఎస్‌ఏ ఇండియా సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. డీమోనిటైజేషన్‌ అనేది సాహసోపేత నిర్ణయమని, చాలా ధైర్ఘ్యమైన అడుగని పేర్కొన్నారు. ఇక దివాలా కోడ్‌ అనేది పెద్ద సంస్కరణ చర్య అని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో మోదీ ప్రభుత్వమే తక్కువ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు. 
భారత్‌పై ఇదివరకు మాదిరిగానే బుల్లిష్‌గా ఉన్నామని, ఇన్వెస్ట్‌మెంట్లలో కూడా ఎలాంటి మార్పులు లేవని క్రిస్టోఫర్‌ ఉడ్‌ పేర్కొన్నారు. ఇండియన్‌ మార్కెట్లకు సంబంధించి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్లు తరలి వెళ్లిపోవడం పెద్ద సమస్య అని తెలిపారు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ వల్ల పరిస్థితులు జఠిలంగా మారాయని పేర్కొన్నారు. ఇండియన్‌ మార్కెట్లలో కరెక‌్షన్‌ను దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు కొనుగోలు అవకాశంగా భావించాలని ఇన్వెస్టర్లకు సూచించారు. 2019 చివరి కల్లా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్ల పెంపు కూడా చివరకు చేరుకుంటుందని తెలిపారు. 
విదేశీ ఇన్వెస్టర్లు ఇండియన్‌ క్యాపిటల్‌ మార్కెట్లు నుంచి డబ్బుల్ని వెనక్కు తీసుకెళ్లడం, బ్యాంకింగ్‌/ఫైనాన్షియల్‌ కంపెనీలు సమస్యల కారణంగా మార్కెట్లు ఇటీవల కాలంలో బాగా పడిపోయాయి.  
ఐదు రాష్ట్రాల ఎన్నికల విషయానికి వస్తే.. వెలువడనున్న ఫలితం బీజేపీ కన్నా ప్రతిపక్షాలకే ఎక్కువ ప్రాధాన్యమని ఉడ్‌ తెలిపారు. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మంచి పనితీరు కనబర్చాల్సి ఉందని, అప్పుడే సార్వత్రిక ఎన్నికలకు ఫండింగ్‌ను సంపాదించుకోగలదని పేర్కొన్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, మిజోరం, తెలంగాణ, రాజస్తాన్‌ రాష్టాల్లో ఈ నెల, వచ్చే నెల ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు డిసెంబర్‌ 11న వెలువడనున్నాయి. 
 You may be interested

26000పైన బ్యాంక్‌ నిఫ్టీ

Wednesday 14th November 2018

ముడిచమురు ధరల పతనం భారత్‌ మార్కెట్‌కు బాగా కలిసొస్తుంది. చమురు ధరల క్షీణత కారణంగా రానున్న రోజుల్లో క్యాడ్‌ తగ్గుతుందనే అంచనాలతో డాలర్‌ మారకంలో రూపాయి రెండు నెలల గరిష్టాన్ని తాకింది. రూపాయి ర్యాలీతో బ్యాంకింగ్‌ రంగ షేర్లు ఇంట్రాడేలో భారీగా లాభపడ్డాయి. నిజానికి నేటి సూచీల ర్యాలీకి బ్యాంకింగ్‌ రంగ షేర్లు సారథ్యం వహిస్తున్నాయిని  చెప్పవచ్చు. బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీలో భాగంగా ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ బ్యాంక్‌ 1.50శాతం లాభపడి 26వేల

రూపీ ర్యాలీ: భారీ నష్టాల్లో ఐటీ షేర్లు

Wednesday 14th November 2018

డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటంతో ఐటీ షేర్లు నష్టపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల భారీ పతనం కారణంగా రానున్న రోజుల్లో క్యాడ్‌ తగ్గుతుందనే అంచనాలతో నేడు దేశీ ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ రెండు నెలల గరిష్టాన్ని అందుకుంది. రూపాయి బలపడటంతో డాలర్‌ మారకంలో ఆదాయాల్ని ఆర్జించే పలు ఐటీ కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఎన్‌ఎస్‌ఈ ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే

Most from this category