STOCKS

News


ఎన్నికల ఫలితాల వరకు బుల్లిష్‌ మూమెంటమ్‌...

Tuesday 26th March 2019
Markets_main1553538954.png-24792

ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఈక్విటీ మార్కెట్లలో బుల్లిష్‌నెస్‌ ఉంటుందని ఈక్విటీ 99 వ్యవస్థాపకుడు సుమిత్‌ బిల్‌గయాన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. అధిక స్థాయిల్లో లాభాల స్వీకరణతో సూచీలు నష్టపోయినట్టు చెప్పారు. బలమైన విదేశీ నిధుల ప్రవాహంతో ఫిబ్రవరి 19 నుంచి నిఫ్టీ 987 పాయింట్లు పెరిగిందని, ఫిబ్రవరి నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.40వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌ చేసినట్టు చెప్పారు. మార్చి నెలలో విదేశీ నిధుల పెట్టుబడులు ఈ స్థాయిలో రావడం ఇదే మొదటి సారని, ఇదే బుల్లిష్‌ మూమెంటమ్‌ మే 23 వరకు కొనసాగుతుందని అంచనా వేస్తున్నట్టు పేర్కొన్నారు. కనుక ఈ లోపు మార్కెట్ల దిద్దుబాటును కొనుగోలుకు వినియోగించుకోవచ్చని సూచించారు. దీర్ఘకాలం కోసం సుమిత్‌ కొన్ని స్టాక్స్‌ను సిఫారసు చేశారు. 

 

మహారాష్ట్ర సీమ్‌లెస్‌
డీపీ జిందాల్‌ గ్రూపు కంపెనీ. సీమ్‌లెస్‌ పైపుల తయారీలో దేశంలోనే అతిపెద్ద కంపెనీ. 550 కేపీటీఏల సామర్థ్యం ఉంది. ఈఆర్‌డబ్ల్యూ పైపుల తయారీలోనూ ఒకానొక పెద్ద కంపెనీ. ఈ పైపుల తయారీ వార్షిక సామర్థ్యం 220కేపీటీఏ. అలాగే 43 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కూడా కలిగి ఉంది. డిసెంబర్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలను నమోదు చేసింది. ఆదాయం 40 శాతం పెరగ్గా, ఎబిట్డా 158 శాతం, నికర లాభం 139 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొమ్మిది నెలల కాలంలోనూ లాభం 156 శాతం, ఆదాయం 37 శాతం చొప్పున పెరిగాయి. రూ.1,300 కోట్ల ఆర్డర్‌ బుక్‌ ఉంది. ఈ కంపెనీలో ఎల్‌అండ్‌టీ మ్యూచువల్‌ ఫండ్‌కు 5.1 శాతం, ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌కు 1.4 శాతం వాటాలు ఉన్నాయి. ప్రస్తుతం 9 పీఈ వద్ద ట్రేడ్‌ అవుతోంది. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి క్రమంగా కొనుగోలు చేసుకోవచ్చు.

 

వోల్టాంప్‌ ట్రాన్స్‌ఫారమ్స్‌
160 ఎంవీఏ, 220కేవీ క్లాస్‌ ఆయిల్‌ ఫిల్డ్‌ పవర్‌, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫారమ్‌లు సహా పలు ఇతర ట్రాన్స్‌ఫారమ్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కంపెనీకి గుజరాత్‌లోని మకర్‌పుర, శావ్లిలో ప్లాంట్లు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌ నాటికి తొమ్మిది నెలల కాలంలో కంపెనీ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయి. కంపెనీలో మ్యూచువల్‌ ఫండ్స్‌కు 18.74 శాతం, ఎఫ్‌ఐఐలకు 15.57 శాతం వాటాలు ఉన్నాయి. ప్రమోటర్లు సైతం కంపెనీలో తమ వాటాలను పెంచుకున్నారు. క్రమం తప్పకుండా డివిడెండ్‌ పంపిణీ చేస్తుంటుంది. మధ్య నుంచి దీర్ఘకాలానికి కొనుగోలు చేసుకోవచ్చు.

 

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌
రక్షణ, పౌర అవసరాలకు ఎలక్ట్రానిక్‌ ఎక్విప్‌మెంట్‌లను సరఫరా చేస్తుంటుంది. డిసెంబర్‌ త్రైమాసికానికి చక్కని ఫలితాలు ప్రకటించింది. అమ్మకాలు 8 శాతానికి పైగా పెరగ్గా, ఎబిట్డా 59 శాతం, నికర లాభం 68 శాతం చొప్పున వృద్ధి చెందాయి. నికర లాభం తొమ్మిది నెలల కాలంలో 50 శాతం పెరగడం గమనార్హం. రూ.50,000 కోట్ల ఆర్డర్లు ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం 12 పీఈ వద్ద ట్రేడవుతోంది. నవరత్న కంపెనీ. సాంకేతికంగా అప్‌మూవ్‌లో ఉంది. దీర్ఘకాలం కోసం కొనుగోలు చేసుకోవచ్చు.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ పాజిటివ్‌

Tuesday 26th March 2019

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్నదన్న భయాలతో క్రితం రోజు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనైన అంతర్జాతీయ మార్కెట్లు తిరిగి కుదుటపడిన నేపథ్యంలో మంగళవారం పాజిటివ్‌ ఓపెనింగ్‌కు సంకేతాలిస్తూ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ స్వల్పంగా పెరిగింది.  ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం 8.40  గంటలకు 2 పాయింట్ల లాభంతో 11,372 పాయింట్ల వద్ద కదులుతోంది. సోమవారం ఇక్కడ నిఫ్టీ మార్చి ఫ్యూచర్‌ 11,370  పాయింట్ల వద్ద ముగిసింది.  క్రితం రోజు

మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్‌ చేశారా?

Tuesday 26th March 2019

హావెల్స్‌ కంపెనీలో 1997లో రూ.10,000 ఇన్వెస్ట్‌ చేసి ఉంటే... ఆ షేర్ల విలువ ఇప్పటి మార్కెట్‌ ధర ప్రకారం రూ.3.50 కోట్లు. మిడ్‌క్యాప్‌ సత్తా అంటే ఇదే మరి. అయితే, అలా అని కొన్న ప్రతీ కంపెనీ ఈ స్థాయిలో ర్యాలీ చేస్తుందనుకోవద్దు. కాకపోతే ఈ తరహా భారీ రాబడులను ఇచ్చిన షేర్ల సంఖ్య చెప్పుకోతగ్గ స్థాయిలో ఉంది. అయితే, స్మాల్‌, మిడ్‌క్యాప్‌లో ఇ‍న్వెస్ట్‌ చేసిన వారికి  2018 సంవత్సరం

Most from this category