News


ఈ షేర్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌

Thursday 28th February 2019
Markets_main1551348596.png-24380

ఇండోపాక్‌ ఉద్రిక్తతల కారణంగా నిఫ్టీ-50...200 డీఎంఏ, 50 డీఎంఏ స్థాయల్ని కోల్పోయినప్పటికీ, 50 వరకూ షేర్లు రానున్న రోజుల్లో పెరిగే సంకేతాల్ని అందిస్తున్నాయి. ఎస్‌బీఐ, హీరోమోటో, ఇంద్రప్రస్థ గ్యాప్‌ తదితర షేర్లు సాంకేతికంగా బుల్లిష్‌ క్రాసోవర్‌ను కనపరుస్తున్నాయి. మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జెన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా చూస్తే ఆయా షేర్లు రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌ ప్రదర్శించే అవకాశాలున్నాయి. బుల్లిష్‌ క్రాసోవర్‌ కనపర్చిన షేర్లలో పిడిలైట్‌ ఇండస్ట్రీస్‌, బెర్జర్‌ పెయింట్స్‌, అపోలో హాస్పిటల్స్‌, గ్లెన్‌మార్క్‌ ఫార్మా, కాల్గేట్‌ పామోలివ్‌,ఎల్‌ అండ్‌ టీ టెక్నాలజీస్‌, సీమెన్స్‌ షేర్లున్నాయి. అయితే మరో 27 షేర్లు బేరిష్‌ క్రాసోవర్‌ను ప్రదర్శించాయి. వాటిలో అదాని ఫోర్ట్స్‌, ఎన్‌హెచ్‌పీసీ, మాక్స్‌ ఇండియా, ఫ్యూచర్‌ రిటైల్‌, డీకార్‌‍్ప, గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ తదితర షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌ జరిగింది. 

ట్రెండ్‌ రివర్స్‌ల్‌ గుర్తించేందుకు...

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  ట్రేడర్లు ట్రేడ్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి ట్రేడ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.
 



You may be interested

10800 దిగువన నిఫ్టీ ముగింపు

Thursday 28th February 2019

మూడోరోజూ నష్టాలే..! భారత్‌ - పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో మార్కెట్‌ వరుసగా మూడో రోజూ నష్టాలతో ముగిసింది. నిఫ్టీ ఇండెక్స్‌ 10800 మార్కును కోల్పోయింది. నేడు ఫిబ్రవరి సిరీస్‌ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల చివరిరోజు కావడంతో అమ్మకాలు జోరుగా సాగడం కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ బలహీనపరిచింది. సెన్సెక్స్‌ 38 పాయింట్ల నష్టపోయి 35,867 వద్ద, నిఫ్టీ 14 పాయింట్లను నష్టపోయి 10,792.50 వద్ద స్థిరపడింది. ప్రైవేట్‌ రంగ బ్యాంకు షేర్లైన హెచ్‌డీఎఫ్‌సీ

మార్కెట్‌కు అండగా మెటల్‌ షేర్లు

Thursday 28th February 2019

ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో మెటల్ షేర్ల ర్యాలీ మార్కెట్‌ అండగా నిలుస్తోంది. ఎన్‌ఎస్‌ఈలో మెటల్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడింది. వేదాంత లిమిటెడ్‌, కోల్‌ ఇండియా, ఎన్‌ఎండీసీ, ఏపిల్‌ అపోలో షేర్లు 3శాతం లాభపడ్డాయి. హిందూస్థాన్‌ కాపర్‌, నాల్కో, వెల్‌స్పాన్‌కార్ప్‌, హిందాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, మెయిల్‌ ఇండియా షేర్లు 2శాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, జేఎస్‌డబ్లూ‍్య స్టీల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. మధ్యాహ్నం

Most from this category