STOCKS

News


ఈ షేర్లలో బుల్లిష్‌ క్రాసోవర్‌

Saturday 23rd February 2019
Markets_main1550905983.png-24294

ఇటీవలి కనిష్టస్థాయి నుంచి స్టాక్‌ సూచీలు 2 శాతం వరకూ కోలుకున్న నేపథ్యంలో 260కి పైగా షేర్లు సాంకేతికంగా బుల్లిష్‌ క్రాసోవర్‌ను కనపరుస్తున్నాయి. మూమెంటమ్‌ ఇండికేటర్‌ అయిన మూవింగ్‌ ఏవరేజ్‌ కన్వర్జన్స్‌ డైవర్జెన్స్‌ (ఎంఏసీడీ) ఆధారంగా చూస్తే ఆయా షేర్లు రానున్న ట్రేడింగ్‌ సెషన్లలో బుల్లిష్‌ మూమెంటమ్‌ ప్రదర్శించే అవకాశాలున్నాయి. బుల్లిష్‌ క్రాసోవర్‌ కనపర్చిన షేర్లలో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, హెచ్‌డీఐఎల్, స్ట్రయిడ్స్‌ ఫార్మా, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా, మహింద్రా అండ్‌ మహింద్రా, రెయిన్‌ ఇండస్ట్రీస్‌ షేర్లున్నాయి. అయితే మరో 26 షేర్లు బేరిష్‌ క్రాసోవర్‌ను ప్రదర్శించాయి. వాటిలో మిస్టాన్‌ ఫుడ్స్, ప్రభాత్‌ టెలికాం, లారెల్‌ ఆర్గానిక్స్‌ తదితర షేర్లలో బేరిష్‌ క్రాసోవర్‌ జరిగింది. 

ట్రెండ్‌ రివర్స్‌ల్‌ గుర్తించేందుకు...

ట్రెండ్‌ రివర్సల్‌ గుర్తించేందుకు ఎంఏసీడీ ఇండికేటర్‌ను వాడతారు.  26, 12 రోజుల ఎక్స్‌పొటెన్షియల్‌ మూవింగ్‌ యావరేజెస్‌ మధ్య భేదం ఆధారంగా ఎంఏసీడీ పనిచేస్తుంది. సిగ్నల్‌లైన్‌ ఆధారంగా బై, సెల్‌ అవకాశాలను గణిస్తారు. సిగ్నల్‌లైన్‌కు పైన ఎంఏసీడీ లైన్‌ కదలాడితే బుల్లిష్‌గా, ఈ లైన్‌కు దిగువకు వస్తే బేరిష్‌గా చెప్పవచ్చు. ఎంఏసీడీ రెండు లైన్లు ఒకదానినొకటి క్రాస్‌ చేసే విధానాన్ని బట్టి బేరిష్‌ క్రాసింగ్‌, బుల్లిష్‌ క్రాసింగ్‌గా చెబుతారు.  ట్రేడర్లు ట్రేడ్‌ చేయాలంటే కేవలం ఎంఏసీడీ ఇండికేటర్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా,  ఇతర ఇండికేటర్లు పరిశీలించి ట్రేడ్‌ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంఏసీడీతోపాటు ఆర్‌ఎస్‌ఐ, బోలింగర్‌ బ్యాండ్‌ లాంటి ఇతర ఇండికేటర్లను పరిశీలించి ట్రెండ్‌ను నిర్ధారణ చేసుకోవాలి.
ఓవర్‌సోల్డ్‌....ఓవర్‌బాట్‌
శుక్రవారం మార్కెట్‌ ముగిసేటప్పటికి రెలిటివ్‌ స్ట్రెంత్‌ ఇండెక్స్‌ ప్రకారం 67 షేర్లు ఓవర్‌సోల్డ్‌ జోన్‌లో వున్నాయి.  ఓవర్‌సోల్డ్‌ కండీషన్‌లో వున్న షేర్లలో కావేరి సీడ్స్‌ కంపెనీ, మీర్జా ఇంటర్నేషనల్, హాత్‌వే కేబుల్స్, రిచా ఇండస్ట్రీస్, కీర్తి ఇండస్ట్రీస్‌లు వున్నాయి. అయితే అవాస్‌ ఫైనాన్షియర్స్‌ , నర్బదా జెమ్స్, ఎస్‌పీఎస్‌ ఇంటర్నేషనల్, పయనీర్‌ ఇన్వెస్ట్‌కార్ప్‌ తదితర 31 షేర్లు ఓవర్‌బాట్‌ కండీషన్‌లో వున్నాయి. 



You may be interested

లాభాల్లో ముగిసిన అమెరికా మార్కెట్లు

Saturday 23rd February 2019

అమెరికా - చైనాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు సఫలవ్వచ్చనే అంచనాలు మరోసారి తెరపైకి రావడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. చైనాతో కీలకమైన వాణిజ్య చర్చలు సజావుగా సాగుతున్నాయి. చర్చలు అమెరికాకు మంచి ఫలితాన్ని ఇస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే చైనాపై  వాణిజ్యపరమైన కొత్త ఆంక్షలు విధింపు తుది గడువు వాయిదా పడవచ్చని ఆయన తెలిపారు.

మార్కెట్లోకి ఫోర్డ్‌ ఎండీవర్‌ 2019 ఎడిషన్‌

Saturday 23rd February 2019

ధర రూ.28.19 లక్షలు న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీ ఫోర్డ్‌ ఇండియా.. ‘2019 ప్రీమియం ఎస్‌యూవీ ఎండీవర్‌’ను శుక్రవారం మార్కెట్లో విడుదలచేసింది. 18-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ కలిగిన ఈ కారు ప్రారంభం ధర రూ.28.19 లక్షలుగా ప్రకటించింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ 2.2 లీటర్‌, 3.2 లీటర్‌ డీజిల్‌ ఇంజిన్‌ ఆప్షన్లు ఉండగా.. హైఎండ్‌ ధర రూ.33.31 లక్షలుగా తెలియజేసింది.

Most from this category