STOCKS

News


బుల్‌ రన్‌ ఈ రంగంలోనే...!

Wednesday 24th April 2019
Markets_main1556046135.png-25300

పెరుగుతున్న దేశ ప్రజల తలసరి ఆదాయం, పెరుగుతున్న యువ జనాభా ఇవన్నీ వినియోగానికి ఊతమిచ్చేవే. మరి ఈ వినియోగ రంగమే పెట్టుబడులకు మంచి అవకాశాలున్న రంగంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ రంగం కచ్చితంగా ర్యాలీ చేస్తుందని, ఇందులో మంచి బెట్స్‌ ఏవన్నది ఎంపిక చేసుకోవడం ఇన్వెస్టర్ల చేతుల్లో ఉందంటున్నారు. పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వాల చర్యలు, మొబైల్‌, ఇంటర్నెట్‌ వినియోగం వేగంగా విస్తరిస్తుండడం వంటి అంశాలు సైతం దేశ వినియోగ రంగానికి సానుకూలంగా పేర్కొంటున్నారు. 

 

ఐటీసీకి చెందిన ప్రముఖ మెన్స్‌వేర్‌ బ్రాండ్‌ జాన్‌ప్లేయర్స్‌ను రిలయన్స్‌ రిటైల్‌ గత నెలలో కొనుగోలు చేసింది. ఇది రిలయన్స్‌ రిటైల్‌ ఫ్యాషన్‌ అండ్‌ లైఫ్‌స్టయిల్‌ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయనుంది. ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ సోక్తాస్‌ ఇండియాను రూ.135 కోట్లతో కొనుగోలు చేసింది. టర్కీకి చెందిన సోక్తాస్‌ టెక్‌స్టిల్‌ సనాయి వీ టికారెట్‌ఏఎస్‌ సొంత అనుబంధ కంపెనీ ఇది. ఈ సంస్థ ప్రపంచంలో ప్రీమియం షర్ట్‌ ఫ్యాబ్రిక్స్‌లో పేరున్నది. దేశీయ వినియోగ రంగం అతిపెద్ద మార్కెట్‌గా విస్తరించనుందని విశ్లేషకుల అంచనా. 2018లో ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ 13.8 శాతం వృద్ధిని నమోదు చేయగా, అంతర్జాతీయంగా ఈ విభాగంలో వృద్ధి కేలం 2-2.5 శాతమేనని ఏసీ నీల్సన్‌ అంచనా. ఈ రంగం దీర్ఘకాలిక బుల్‌ మార్కెట్లో ఉందని మారథాన్‌ ట్రెండ్స్‌ పీఎంఎస్‌ సీఈవో అతుల్‌సూరి తెలిపారు. దీర్ఘకాలానికి ఈ రంగంపై అధిక వెయిటేజీతో ఉన్నట్టు చెప్పారు. 

 

‘‘ఈ రంగంలో భిన్నమైన ధోరణలు కనిపిస్తున్నాయి. పడిపోతున్న మార్కెట్లో ఎంపిక చేసిన స్టాక్స్‌ పనితీరును గమనిస్తున్నాం. ఎందుకంటే పడిపోయే మార్కెట్లో బలంగా నిలబడే స్టాక్స్‌, పెరిగే స్టాక్స్‌ సాధారణంగా తదుపరి బుల్‌ మార్కెట్లో లీడర్లుగా అవతరిస్తాయి’’ అని అతుల్‌సూరి తెలిపారు. వ్యక్తుల్లో, ముఖ్యంగా మిలీనియల్స్‌లో వచ్చిన జీవనశైలి మార్పులు వినియోగాన్ని పెంచేవిగా పేర్కొంటున్నారు. 2030 నాటికి 160 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అధిక జనాభా కలిగిన దేశంగా అవతరిస్తుందని అంచనా. ప్రస్తుత జనాభాలో 105 కోట్ల మంది 15-60 వయసులోని వారే కావడం వినియోగానికి బలమైన అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఎఫ్‌ఎంసీజీ, ఈకామర్స్‌, స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులు, ఆటో, టెలికం, ఎడ్యుకేషన్‌, సర్వీసెస్‌ లాభపడే రంగాలుగా పేర్కొంటున్నారు. 

 

ఎలారా క్యాపిటల్‌ బ్రిటానియా షేరును రూ.3,478 టార్గెట్‌ ధరకు సిఫారసు చేసింది. అలాగే, నెస్లేకు రూ.11,716 టార్గెట్‌ ఇచ్చింది. జ్యూస్‌లు, బేబీకేర్‌ ప్రొడక్ట్స్‌, రెడీ టు ఈట్‌, రెడీ టు కుక్‌ ఉత్పత్తులకు డిమాండ్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాటా షేరును రూ.1,479తో అక్యుములేట్‌ చేసుకోవచ్చని నిర్మల్‌బంగ్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌, పరాగ్‌ మిల్క్‌ ఫుడ్స్‌ పట్ల ఎలారా క్యాపిటల్‌ బుల్లిష్‌గా ఉంది. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 19 పాయింట్లు అప్‌

Wednesday 24th April 2019

ఆసియా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో వున్నప్పటికీ, వరుసగా మూడురోజులపాటు భారీ పతనాన్ని చవిచూసిన భారత్‌ మార్కెట్‌ బుధవారం స్వల్పలాభాలతో ప్రారంభమయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఇక్కడి ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ ఫ్యూచర్‌తో అనుసంధానంగా ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఈ ఉదయం 8.45  గంటలకు 19 పాయింట్ల లాభంతో11,605 పాయింట్ల వద్ద కదులుతోంది. మంగళవారం ఇక్కడ నిఫ్టీ ఏప్రిల్‌  ఫ్యూచర్‌ 11,586 పాయింట్ల వద్ద ముగిసింది.  అలాగే కోకకోలా తదితర కార్పొరేట్లు ప్రోత్సాహకర ఫలితాల్ని ప్రకటించడంతో మంగళవారం రాత్రి అమెరికా సూచీలు లాభాలతో ముగిసాయి. తాజాగా ఆసియా

ఈ పది స్టాక్స్‌ బఫెట్‌కు నచ్చుతాయ్‌!?

Wednesday 24th April 2019

లాభాలు పోగేసుకోవాలంటే కచ్చితంగా సరైన స్టాక్స్‌ ఎంపికతోనే సాధ్యపడుతుంది. ఈ విషయంలో ప్రపంచ ప్రముఖ ఇన్వెస్టర్‌, బెర్క్‌షైర్‌ హాత్‌వే చైర్మన్‌ వారెన్‌ బఫెట్‌ సిద్ధ హస్తుడు. వారెన్‌ బఫెట్‌ అన్ని కాలాల్లోనూ విజయవంతమైన ఇన్వెస్టర్‌గా ప్రసిద్ధి పొందిన విషయం తెలిసిందే. బెంజమిన్‌ గ్రాహమ్‌కు బఫెట్‌ మాజీ విద్యార్థి కూడా. యాజమాన్యం నాణ్యత, కంపెనీ వృద్ధి అవకాశాలను చూసి ఆయన ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. వీటిల్లోనూ సరసమైన ధరల వద్ద ట్రేడ్‌ అయ్యే

Most from this category