STOCKS

News


‘బుల్‌’ను గుర్తించడం సులువు..

Tuesday 9th October 2018
Markets_main1539060439.png-20963

బేర్‌ మార్కెట్‌ కన్నా బుల్‌ మార్కెట్‌ను గుర్తుపట్టడం సులువంటున్నారు ఫస్ట్‌ గ్లోబల్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శంకర్‌ శర్మ. ‘నేను చాలా బుల్‌ మార్కెట్లను చూశాను. అలాగే బేర్‌ మార్కెట్లను కూడా చూశాను. బుల్‌ మార్కెట్లను గుర్తుపట్టడం సులువు. స్టాక్స్‌కు ఒక స్థాయి అంటూ ఉంటుంది. అక్కడి దాకా అవి క్షీణించగలవు. ఏవీ సున్నా స్థాయికి అయితే పడిపోవు. అయితే మార్కెట్లు అలా కాదు. పడుతూ ఉంటాయి. పెరుగుతూ ఉంటాయి. వ్యాల్యుయేషన్స్‌ చౌకగా మారితే.. ఫండమెంటల్స్‌ మెరుగుపడుతూ ఉంటే.. అలాంటి పరిస్థితులను బుల్‌ మార్కెట్‌కు ప్రారంభంగా భావించొచ్చు. మార్కెట్‌ రెండేళ్లపాటు స్తబ్దుగా ఉండి తర్వాత ఇలాంటి పరిస్థితులు చోటుచేసుకుంటే అప్పుడు బుల్‌ మార్కెట్‌ వచ్చేసిందనే నిర్ణయానికి రావొచ్చు. మార్కెట్లు పుంజుకుంటాయి’ అని వివరించారు. బేర్‌ మార్కెట్‌ను గుర్తుపట్టడం చాలా కష్టమని తెలిపారు. స్టాక్‌ ధరలు పెరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. ‘2000లో ఇన్ఫోసిస్‌ 60 పీఈతో ట్రేడయ్యేది. దీన్ని చాలా ఖరీదైనదిగా భావించాలి. ఇదివరకు నేను ఎప్పుడూ 60 పీఈతో ట్రేడయ్యే స్టాక్‌ను చూడలేదు’ అని తెలిపారు. చివరకు ఇది రూ.300కు వచ్చేసిందన్నారు. స్టాక్స్‌ ధరలు ఏ స్థాయిలో పెరుగుతూ వెళ్తాయో చెప్పలేమని తెలిపారు. అందువల్ల బేర్‌ మార్కెట్‌ ప్రారంభాన్ని గుర్తుపట్టడం చాలా కష్టమని పేర్కొన్నారు.  



You may be interested

క్రూడ్‌ తగ్గితే.. మార్కెట్‌ పరుగు!!

Tuesday 9th October 2018

ఒకవేళ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 70 డాలర్లకు వస్తే అప్పుడు స్టాక్‌ మార్కెట్‌లో పెరుగుదల ఉండొచ్చని కోటక్‌ ఏఎంసీ ఎండీ నీలేశ్‌ షా తెలిపారు. ఇప్పటి నుంచి ముందుకెళ్లే కొద్దీ క్రూడ్‌ ధరలు, ఎన్నికలు.. మార్కెట్లను ప్రభావం చేస్తాయని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో ఈ విషయాలు వెల్లడించారు. డెట్‌ మార్కెట్‌, క్రెడిట్‌ మార్కెట్‌, కరెన్సీ మార్కెట్‌, ఆయిల్‌ మార్కెట్‌లలో ఒడిదుడుకులు చోటుచేసుకున్నాయని తెలిపారు. క్రూడ్‌

అపోలో మ్యునిక్‌ నుంచి ‘ఐకెన్‌’

Tuesday 9th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆరోగ్య బీమా కంపెనీ అపోలో మ్యునిక్‌... విపణిలోకి ‘ఐకెన్‌’ పేరిట క్యాన్సర్‌ పాలసీని విడుదల చేసింది. జీవితకాల కవరేజీ అందించడమే ఈ ప్లాన్‌ ప్రత్యేకత అని కంపెనీ సీఎంఓ డాక్టర్‌ నందినీ అలీ సోమవారమిక్కడ విలేకరులకు తెలిపారు. క్లెయిమ్‌ చేసిన తర్వాత వార్షిక పునరుద్దరణకు వీలుంటుందని.. ఇప్పటివరకు 20 రకాల ఆరోగ్య బీమా పాలసీలను విడుదల చేశామని చెప్పారు. 5–60 ఏళ్ల వయస్సున్న కుటుంబ సభ్యులెవరైనా

Most from this category