STOCKS

News


కోట్లు సమకూరాలంటే ఇలా చేస్తే సరి!

Wednesday 1st August 2018
Markets_main1533124071.png-18843

స్టాక్‌ మార్కెట్లు జూలైలో నూతన గరిష్టాలకు చేరాయి. కానీ, విడిగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్టాక్స్‌ లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌ రాబడులు మాత్రం మార్కెట్ల స్థాయిల్లో లేవు. నిజానికి మార్కెట్ల ర్యాలీ కొన్ని బలమైన స్టాక్స్‌తోనే జరుగుతుండడంతో, విడిగా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోపై అది ప్రతిఫలించడం లేదు. మిగిలిన స్టాక్స్‌ చాలానే ఒత్తిళ్లలో ఉన్నాయి. దీంతో సూచీలు గరిష్టాల్లో ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో రూ.కోట్లాది రూపాయల సంపద సృష్టి కోసం తమ పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవడానికి ఇప్పటికీ మంచి అవకాశాలు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మధ్య వయసులో ఉన్నవారికి మార్కెట్‌ నిపుణులు పోర్ట్‌ఫోలియో పరంగా చేస్తున్న సూచనలు ఇవి. 

 

30-40 వయసు వారు...

‘‘నిఫ్టీకి అనుగుణంగా తమ పోర్ట్‌ఫోలియో విలువ పెరగడం లేదని చాలా మంది ఇన్వెస్టర్లు నిరాశలో ఉన్నారు. వారి పోర్ట్‌పోలియోలో ఉన్నవి ఎక్కువగా టిప్స్‌ ఆధారంగా కొనుగోలు చేసిన స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌’’ అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ దీపక్‌ జసాని తెలిపారు. 30-40 ఏళ్ల వయసులో ఉన్నవారు సంపద సృష్టికి తమ పోర్ట్‌ఫోలియోపై దృష్టి సారించాలని జసాని సూచించారు. 5-10 శాతం బంగారంలో, 20-25 శాతం బాండ్లలో (నేరుగా లేదా ఫండ్స్‌ ద్వారా), 20-25 శాతం లార్జ్‌క్యాప్‌లో, మిగిలిన నిధుల్ని మైక్రో, స్మాల్‌, మిడ్‌క్యాప్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా రూ.కోటి కలను సాకారం చేసుకోవచ్చు’’అని ఆయన వివరించారు. పూర్తిగా బుల్లిష్‌ ర్యాలీల్లో ఈక్విటీ పెట్టుబడులను 20-30 శాతానికి తగ్గించుకుని, తిరిగి కరెక్షన్‌ సమయాల్లో మళ్లీ పెంచుకోవాలని సూచించారు.

 

ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియో విలువను వెనక్కు లాగేస్తున్న వాటిలో ఎక్స్‌పోజర్‌ తగ్గించుకుని, విజేతలైన కంపెనీల్లో పెట్టుబడులు పెంచుకోవాలన్నది కేఐఎఫ్‌ఎస్‌ ట్రేడ్‌ క్యాపిటల్‌ సీఎస్‌వో రితేష్‌ ఆషర్‌ సూచన. 30-40 ఏళ్ల వయసులో ఉన్న వారు రిస్క్‌ ఎక్కువగా ఉన్న వాటికి బదులు, రిస్క్‌ తక్కువగా ఉన్న పోర్ట్‌ఫోలియోను ఎంచుకోవాలన్నారు. 60 శాతం ఈక్విటీలకు, అందులోనూ 65-70 శాతం లార్జ్‌క్యాప్‌నకు, 20 శాతం మిడ్‌క్యాప్‌నకు, 10-15 శాతం స్మాల్‌క్యాప్‌నకు కేటాయించుకోవాలని సూచించారు. 15 శాతం డెట్‌లో ఉంచుకోవాలన్నారు. బంగారానికి 20 శాతం కేటాయించుకోవాలని, మిగిలిన 5 శాతాన్ని నగదు రూపంలో ఉంచుకోవాలని సూచించారు. 

  

40 ఏళ్ల వయసు వారికి

కనీసం 10 శాతం బంగారంలో, 20 శాతం బాండ్లలో, 40 శాతం లార్జ్‌క్యాప్స్‌లో, 15 శాతం స్మాల్‌క్యాప్‌, 15 శాతం మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం ఐడిల్‌గా ఉంటుందని శామ్కో సెక్యూరిటీస్‌ సీఈవో జిమీత్‌ మోదీ సూచించారు. ‘‘ఇన్వెస్టర్లు పనితీరు బాలేని లేదా ఫండమెంటల్స్‌ మారిన స్టాక్స్‌ నుంచి బయటపడాలని, నాణ్యమైన స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలన్నది ఈక్విటీ 99 వ్యవస్థాపకుడు సుమీత్‌ సూచన. 70 శాతాన్ని ఈక్విటీల్లో, మిగిలిన నిధులను బాండ్లు, బంగారంలో పెట్టుబడులు పెట్టుకోవాలన్నారు. You may be interested

మీ డబ్బులు బీమా కంపెనీ వద్దే ఉండిపోయాయా?

Wednesday 1st August 2018

దేశంలోని 23 బీమా సంస్థల వద్ద పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకోని నిధులు రూ.15,157 కోట్లు ఉన్నట్టు ఐఆర్‌డీఏ తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ఎల్‌ఐసీ వద్దే రూ.10,509 కోట్లు ఉన్నాయి. మిగిలిన 22 ప్రైవేటు బీమా సంస్థల వద్ద ఉన్న అన్‌ క్లెయిమ్డ్‌ మొత్తం రూ.4,657 కోట్లు. ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులో ఉన్న గణాంకాలు ఇవి.    క్లెయిమ్‌ చేయని నిధుల పరిస్థితి? క్లెయిమ్‌ చేయకుండా పదేళ్లు దాటిన పాలసీల

రికార్డు ర్యాలీకి ఆర్‌బీఐ బ్రేక్‌

Wednesday 1st August 2018

రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్లు పెంపుతో మార్కెట్ల రికార్డు ర్యాలీకి బుధవారం బ్రేక్‌ పడింది. దీనికి తోడు నేడు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష పట్ల ఇన్వెస్టర్ల అప్రమత్తత  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 85 పాయింట్ల నష్టపోయి 37,522 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10 పాయింట్ల పతనమై 11,346 వద్ద ముగిశాయి. ఆరంభలాభాలను మిడ్‌సెషన్‌ వరకు కొనసాగించిన సూచీలు నేడు కూడా (సెన్సెక్స్‌ 37711 వద్ద, నిఫ్టీ

Most from this category