STOCKS

News


బీఎస్‌ఈ, ఎస్‌అండ్‌పీ వేరుబాట

Monday 19th November 2018
Markets_main1542604533.png-22167

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో వ్యాపార భాగస్వామ్యానికి ముగింపు పలకాలని బీఎస్‌ఈ నిర్ణయించింది. ఇరు సంస్థల మధ్య జాయింట్‌ వెంచర్‌ ‘ఆసియా ఇండెక్స్‌’ 2013లో ఏర్పాటైంది. ఇరు సంస్థలు కలసి బెంచ్‌మార్క్‌ సెన్సెక్స్‌ సహా పలు సూచీలను నిర్వహిస్తున్నాయి. అయితే, ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌తో చేసుకున్న ఒప్పందం కాల పరిమితి డిసెంబర్‌ 31తో తీరిపోతుందని, ఇకపై పునరుద్ధరించుకోవడం లేదని బీఎస్‌ఈ అధికారులు తెలిపారు. సొంతంగానే సూచీల అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు. ‘‘ఐదేళ్ల క్రితం ఈ ఒప్పందం చేసుకున్నాం. అయితే, విదేశీ అధికార పరిధిలో విస్తరణకు, ఇండెక్స్‌ నిర్వహణ విషయంలో ఇది ఏమంత ఉపయోగ పడలేదు’’ అని బీఎస్‌ఈ ఎండీ ఆశిష్‌కుమార్‌ చౌహాన్‌ తెలిపారు. అందుకే ఒప్పందాన్ని పునరుద్ధరించుకోకూడదని నిర్ణయించామన్నారు. సంస్థ లాభాలు, ఆదాయాలపై దీని ప్రభావం స్వల్పమేనని చెప్పారు. ఎన్‌ఎస్‌ఈకి సంబంధించిన సూచీలను అనుబంధ విభాగం ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిర్వహిస్తోంది. బీఎస్‌ఈతో ఒప్పందానికి ముందు ఎస్‌అండ్‌పీ డౌజోన్స్‌  ఎన్‌ఎస్‌ఈతోనూ భాగస్వామ్యం కొనసాగించిన విషయం గమనార్హం. 



You may be interested

కేంద్రం సంస్కరణలు కొనసాగించాలి

Monday 19th November 2018

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న ద్రవ్య లోటు లక్ష్య సాధనకు కేంద్రం కట్టుబడి ఉండాలని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా చెప్పారు. మరోవైపు గత నాలుగేళ్లుగా ప్రవేశపెట్టిన సంస్కరణలను కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. వస్తు, సేవల పన్నుల విధానం, దివాలా చట్టం వంటి సంక్లిష్టమైన చట్టాలను ప్రవేశపెట్టడంలో గత ప్రభుత్వాలు ఇబ్బందిపడ్డాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ప్రవేశపెట్టడంతో పాటు

358 ప్రాజెక్టులు... రూ.3.37 లక్షల కోట్ల భారం

Monday 19th November 2018

న్యూఢిల్లీ: మౌలికరంగంలో వందలాది ప్రాజెక్టులు అధిక వ్యయ భారాన్ని మోస్తున్నాయి. రూ.150 కోట్లు అంతకంటే అధిక అంచనాతో కూడిన 358 ప్రాజెక్టులపై జాప్యం, ఇతరత్రా కారణాలతో  రూ.3.37 లక్షల కోట్ల మేర అదనపు వ్యయ భారం పడినట్టు కేంద్ర ప్రణాళిక, అమలు విభాగం నివేదిక తెలియజేస్తోంది. ‘‘1,361 ప్రాజెక్టుల వాస్తవ నిర్మాణ వ్యయం రూ.16,78,634 కోట్లు. పూర్తయ్యే నాటికి వీటి వ్యయం రూ.20,16,361 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో పెరిగిన

Most from this category