STOCKS

News


వెలుగులో టెలికాం షేర్లు

Friday 16th November 2018
Markets_main1542361044.png-22100

టెలికం రంగ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల మోత మోగిస్తున్నాయి. బీఎస్‌ఈలో టెలికాం షేర్లకు సూచీగా ఉన్న ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ టెలికాం సూచీ ఇంట్రాడేలో 5.09 శాతం లాభపడింది. టెలికాం రంగంలోని ప్రధాన షేర్లైన ఐడియా, ఎయిర్‌టెల్‌, రిలయన్స్‌, టాటా కమ్యూనికేషన్స్‌, జీపీటీఎల్‌, టీటీఎంఎల్‌, ఇన్ఫ్రాటెల్‌ షేర్లు దాదాపు 13శాతం లాభపడ్డాయి. అత్యధికంగా ఐడియా సెల్యూలార్‌ 15శాతం చేసింది. ఎయిర్‌టెల్‌ 8.50శాతం లాభపడి నెలన్నర గరిష్టానికి చేరుకుంది. జీపీటీఎల్‌ హాత్‌వే 5శాతం, టాటా కమ్యూనికేషన్‌ 4.50శాతం లాభపడింది. మరోవైపు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోంటున్న జీటీఎల్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ 5శాతం నష్టపోయింది. వింధ్యాటెలిలింక్స్‌ 3శాతం, సెర్టిలైట్‌ టెక్నాలజీస్‌ 3శాతం, ఐటీఐ 2శాతం నష్టాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.



You may be interested

బైబ్యాక్‌ రూట్లో డిజిన్వెస్ట్‌మెం‍ట్‌

Friday 16th November 2018

ముంబై: నిర్థేశిత పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే బైబ్యాక్‌ అస్త్రాన్ని సంధించనున్న తెలుస్తోంది. ఈ ఏడాదిలో రూ.80,000 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యంగా వెల్లడించిన మోడీ సర్కార్‌ ఇప్పటివరకు ఈ మొత్తంలో కనీసం నాలుగింట ఒక వంతును కూడా సమకూర్చుకోలేకపోయింది. గడిచిన ఏడున్నర నెలల్లో కేవలం రూ.15,000 కోట్లను మాత్రమే అందుకున్న కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరో రూ.20,000 కోట్లను ఉపసంహరణల ద్వారా పొందనుందని విశ్వసనీయ

టీసీఎస్‌ వెనక్కు.. రిలయన్స్‌ ముందుకు..

Friday 16th November 2018

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ పరంగా టీసీఎస్‌ను మళ్లీ వెనక్కు నెట్టింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు శుక్రవారం 2 శాతానికిపైగా పెరిగింది. దీంతో రిలయన్స్‌.. టీసీఎస్‌ను వెనక్కు నెట్టి అత్యంత విలువైన కంపెనీగా అవతరించింది. మధ్యాహ్నం 2:34 సమయంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 2.74 శాతం పెరుగుదలతో రూ.1,126 వద్ద ట్రేడవుతోంది. అప్పుడు కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,13,971 కోట్లుగా ఉంది. అదే సమయంలో టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.7,02,821

Most from this category