News


నేడు మార్కెట్లకు సెలవు

Monday 4th March 2019
Markets_main1551672288.png-24411

మహాశివరాత్రి సందర్భంగా సోమవారం దేశీయ స్టాక్‌ ఎక్చే‍్సంజీలకు సెలవు. అలాగే కమోడిటీ, బులియన్‌, మెటల్‌, ఫారెక్స్‌ మార్కెట్లకు సైతం నేడు పని చేయవు. అన్ని మార్కెట్లు తిరిగి మంగళవారం ప్రారంభవుతాయి. భారత్‌ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం మార్కెట్‌ మూడు రోజుల వరుస నష్టాలకు ముగింపు పలికిన సంగతి తెలిసిందే. సెన్సెక్స్‌ 196 పాయింట్లు పెరిగి 36, 064 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10863 వద్ద స్థిరపడ్డాయి. మిడ్‌క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్ల సూచీలకు అండగా నిలిచింది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 1.44శాతం లాభపడగా, నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌ 2.7శాతం ర్యాలీ చేసింది. ఇక ఈ వారంలో భారత్‌ - పాక్‌ల మధ్య ఉద్రిక్తతలు, చైనా- అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు అంశం, ముడిచమురు ధరల ప్రభావం, అంతర్జాతీయ పరిణామాలతో పాటు ఇదే వారంలో విడుదలయ్యే కీలక గణాంకాలపై మార్కెట్‌ కదలిక ఆధాపడి ఉంంటుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.



You may be interested

భౌగోళిక రాజకీయ అంశాలే కీలకం..!

Monday 4th March 2019

సోమవారం మార్కెట్‌కు సెలవు మంగళవారం నికాయ్‌ ఇండియా సర్వీసెస్‌ పీఎంఐ వెల్లడి- బుధవారం యూఎస్‌ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ డేటా- యూఎస్‌ నాన్‌ ఫామ్ పేరోల్స్ గణాంకాలు ఈవారంలోనే.. ముంబై: భారత వైమానిక దళ పైలట్‌ అభినందన్‌ వర్థమాన్‌ను వాఘా సరిహద్దు దగ్గర పాక్‌ అప్పగించిన నేపథ్యంలో గతవారం దేశీ స్టాక్‌ మార్కెట్‌ లాభాల్లో ముగిసింది. పైలట్‌ను తిరిగి అప్పగించడంతో భారత్-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొంత వరకు తగ్గి దాయాదుల మధ్య

ఇన్వెస్ట్‌ చేస్తున్నది స్టాక్‌లో కాదు... కంపెనీలో: కేడియా

Monday 4th March 2019

స్టాక్స్‌, మార్కెట్లలో ఇన్వెస్ట్‌ చేస్తున్నదానికి బదులు... తాము పెట్టుబడి పెడుతున్నది ఓ కంపెనీలో అని భావిస్తే ఇన్వెస్టర్ల దృక్పథం వేరుగా ఉంటుందని ప్రముఖ ఇన్వెస్టర్‌, కేడియా సెక్యూరిటీస్‌ ఎండీ విజయ్‌ కేడియా సూచించారు. మార్కెట్ల తీరుతెన్నులపై ఆయన ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను తెలియజేశారు.    అతి అనర్థదాయకమన్న ఓ నానుడిని కేడియా గుర్తు చేశారు. మార్కెట్లలో జరిగింది ఇదేనన్నారు. 2017లో స్టాక్స్‌ అతిగా పెరగడం వల్లే ఆ

Most from this category