STOCKS

News


స్టాక్‌ మార్కెట్‌కు సెలవు

Friday 23rd November 2018
Markets_main1542944675.png-22317

గురునానక్‌ జయంతి సందర్భంగా నేడు (శుక్రవారం) మార్కెట్‌కు సెలవు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో ట్రేడింగ్‌ జరగదు. అలాగే మెటల్‌, బులియన్‌ సహా అన్ని హోల్‌సెల్‌ కమోడిటీ మార్కెట్లు పనిచేయవు. ఫారెక్స్‌, కమోడిటీ ఫ్యూచర్స్‌మార్కెట్లకు కూడా సెలవు. తిరిగి స్టాక్‌ మార్కెట్‌​ట్రేడింగ్‌ 26వ తేదీన (సోమవారం) మొదలవుతుంది. కాగా గురువారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 219 పాయింట్లు నష్టపోయి 34,981 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 73 పాయింట్లు కోల్పోయి 10,527 పాయింట్ల వద్ద ముగిశాయి. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అప్‌

Friday 23rd November 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే ఉదయం 9:20 సమయంలో 23 పాయింట్ల లాభంతో 10,549 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ గురువారం ముగింపు స్థాయి 10,524 పాయింట్లతో పోలిస్తే 25 పాయింట్ల లాభంతో ఉందని గమనించాలి. మరోవైపు ఆసియా ప్రధాన సూచీలన్నీ శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇక అమెరికా మార్కెట్లు బుధవారం లాభాల్లోనే ముగిశాయి.

ఎఫ్‌ఐఐలు, డీఐఐలు భారీగా ఇన్వెస్ట్‌ చేసినవి..?

Friday 23rd November 2018

దేశీయ సంస్థాగత పెట్టుబడి దారులు (డీఐఐలు), విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు/ఎఫ్‌పీఐలు) సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఎక్కువగా కొనుగోలు చేసిన స్టాక్స్‌ ఏ రంగానివో తెలుసుకోవాలన్న ఆసక్తి ఉందా...? బ్యాంకులు, మెటల్స్‌, ఆటోమొబైల్స్‌, ఫార్మా రంగాల్లోకి వీరి నుంచి అదనపు పెట్టుబడులు వచ్చినట్టు ఎడెల్వీజ్‌ సెక్యూరిటీస్‌ డేటా తెలియజేస్తోంది. ముఖ్యంగా బ్యాంకులు, ద్విచక్ర వాహన కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, గ్యాస్‌ పంపిణీ, మిడ్‌క్యాప్‌ ఐటీ కంపెనీలు ఆకర్షణీయంగా మారాయి. కొన్ని రంగాల్లో డీఐఐలు

Most from this category