STOCKS

News


20 స్టాక్స్‌ రేటింగ్‌ అప్‌గ్రేడ్‌..

Friday 31st August 2018
Markets_main1535704281.png-19835

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్లు ర్యాలీ చేస్తున్నాయి. కొత్త గరిష్ట స్థాయిలను నమోదు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు 20 స్టాక్స్‌ రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేశాయి. ఇవి వచ్చే ఏడాది కాలంలో 40 శాతం దాకా రిటర్న్స్‌ అందిస్తాయని పేర్కొంటున్నాయి. అవేంటో చూద్దాం..

బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి

స్టాక్‌: ఐటీడీ సిమెంటేషన్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.190
రిటర్న్‌ అంచనా: 41 శాతం
ప్రస్తుత క్యూ1లో కంపెనీ ఆదాయంలో 25 శాతం వృద్ధి నమోదయ్యింది. వచ్చే త్రైమాసికంలోనూ ఇదే ట్రెండ్‌ ఉండొచ్చని అంచనా. బలమైన ఆర్డర్లు సానుకూల అంశం. అందుకే బై రేటింగ్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 

స్టాక్‌: స్వరాజ్‌ ఇంజిన్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,498
రిటర్న్‌ అంచనా: 40 శాతం
ట్రాక్టర్లకు బలమైన డిమాండ్‌ ఉంటుందనే అంచనాలున్నాయి. దీనివల్ల స్వరాజ్‌ ఇంజిన్స్‌ బలమైన ఎర్నింగ్స్‌ను ప్రకటించొచ్చు. ఇటీవల స్టాక్‌ ధర తగ్గింది. ఇది సానుకూల అంశమే. అందువల్ల రేటింగ్‌ను బై కి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 

స్టాక్‌: ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.671
రిటర్న్‌ అంచనా: 20 శాతం
బీపీ విభాగంలో బలమైన వృద్ధి నమోదవుతోంది. ఇటీవలే క్యూ1లో గరిష్ట పీఏటీని ప్రకటించింది. విస్తృత శ్రేణి రూఫింగ్‌ ప్రొడక్ట్స్‌, కొత్త ప్రొడక్టుల ఆవిష్కరణ, నిర్వహణ సామర్థ్యం వంటివి సానుకూల అంశాలు. అందువల్ల స్టాక్‌ రేటింగ్‌ను బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ఉత్పత్తి వ్యయాలు పెరుగుదల, కరెన్సీ ఒడిదుడుకులు ప్రతికూలం.

బ్రోకరేజ్‌: యూబీఎస్‌

స్టాక్‌: జూబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,750
రిటర్న్‌ అంచనా: 12 శాతం
గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థ యూబీఎస్‌ ఈ స్టాక్‌ రేటింగ్‌ను సెల్‌ నుంచి న్యూట్రల్‌కు అప్‌గ్రేడ్‌ చేసింది. అలాగే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.950 నుంచి రూ.1,750కి పెంచింది. 

బ్రోకరేజ్‌: కోటక్‌ సెక్యూరిటీస్‌

స్టాక్‌: ఫోనిక్స్‌ మిల్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.707
రిటర్న్‌ అంచనా: 16 శాతం
రానున్న కాలంలో ఆదాయ వృద్ధి అంచనాలు బాగున్నాయి. 2018-20 ఆర్థిక సంవత్సరాల మధ్యకాలంలో ఆదాయ వృద్ధి చక్రగతిన 7.4 శాతంగా ఉండొచ్చు. ఇదేసమయంలో నికర లాభంలో 14.5 శాతం వృద్ధి నమోదు కావొచ్చు. స్టాక్‌పై పాజిటివ్‌గా ఉన్నాం. అక్యుములేట్‌ నుంచి బై కి రేటింగ్‌ అప్‌గ్రేడ్‌ చేశాం.

బ్రోకరేజ్‌: డోలత్‌ క్యాపిటల్‌

స్టాక్‌: ఒరాకిల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌
రేటింగ్‌: అక్యుములేట్‌
టార్గెట్‌ ప్రైస్‌: రూ.4,650
రిటర్న్‌ అంచనా: 12 శాతం
కొత్త లైసెన్స్‌ రెవెన్యూ తగ్గినప్పటికీ, ఓఎఫ్‌ఎస్‌ఎస్‌ మాత్రం పాజిటివ్‌ సాంకేతాలిస్తోంది. కొత్త ఓబీపీ డీల్‌ సొంతం చేసుకోవడం వల్ల బుకింగ్స్‌లో మంచి వృద్ధి నమోదయ్యింది. మరో పెద్ద ఓబీపీ డీల్‌ను సొంతం చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లైసెన్స్‌ రెవెన్యూలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నాం. ఎర్నిం‍గ్స్‌ అంచనాలను అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ఈ స్టాక్‌ను అక్యుములేట్‌ చేసుకోవచ్చు. 

బ్రోకరేజ్‌: ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌

స్టాక్‌: సన్‌ ఫార్మా
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.690
రిటర్న్ అంచనా: 11 శాతం
ఎర్నింగ్స్‌ పరంగా చూస్తే క్యూ1లో కంపెనీ ఫలితాలు అంచనాలు మించాయి. స్పెషాలిటీ విభాగం ఆకర్షణీయంగా ఉంది. సమీప కాలంలో మార్జిన్లపై కొంత ప్రభావం పడొచ్చని కంపెనీ తెలిపింది. అమెరికాలోని ప్రతికూలతల నేపథ్యంలో కంపెనీ జెనరిక్‌ నుంచి స్పెషాలిటీపై ఎక్కువ దృష్టి కేంద్రకరిస్తోంది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండంకెల వృద్ధిని నిర్ణయించుకుంది. స్టాక్ రేటింగ్‌ను బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం.

స్టాక్‌: గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.899
రిటర్న్‌ అంచనా: 29 శాతం
స్టాక్‌ రేటింగ్‌ను యాడ్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.899గా కొనసాగిస్తున్నాం. ప్రస్తుత క్యూ1లో కంపెనీ రెవెన్యూలో ఎక్కువ భాగం బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ నుంచే ఉంది. కొత్త ఆవిష్కరణల వల్ల విక్రయాలు పెరిగాయి.

స్టాక్‌: ఈక్విటస్‌ హోల్డిం‍గ్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.190
రిటర్న్‌ అంచనా: 23 శాతం
ఈ స్టాక్‌ రేటింగ్‌ను యాడ్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.180 నుంచి రూ.190కి పెంచాం. అసెట్స్‌ వృద్ధి నేపథ్యంలో ఎర్నింగ్స్‌ను అప్‌గ్రేడ్‌ చేశాం. రుణ వృద్ధి, ఎర్నిం‍గ్స్‌ అంచనాలను కూడా పెంచాం.

బ్రోకరేజ్‌: ఐఐఎఫ్‌ఎల్‌ ప్రైవేట్‌ వెల్త్‌

స్టాక్‌: ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.2,120
రిటర్న్‌ అంచనా: 25 శాతం
ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1లో బలమైన ఎర్నిం‍గ్స్‌ను ప్రకటించింది. విక్రయాల్లో బలమైన వృద్ధి నమోదయ్యింది. రానున్న కాలంలోనే ఇదే ట్రెండ్‌ కొనసాగే అవకాశముంది. సామర్థ్యం పెంపు కలిసొచ్చే అంశం. ఎగ్నింగ్స్‌ వృద్ధి బాగుంటుంది. అందువల్ల స్టాక్‌ రేటింగ్‌ను బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం.

స్టాక్‌: ఎన్‌టీపీసీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.187
రిటర్న్‌ అంచనా: 11 శాతం
ఎన్‌టీపీసీ క్యూ1 పనితీరు అంచనాలకు అనుగుణంగానే ఉంది. రానున్న కాలంలో బొగ్గు కొరత వల్ల స్వల్ప స్థాయిలోనే ప్రభావం ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనివల్ల రెవెన్యూ పెరిగే అవకాశముంది. స్టాక్‌ ధరలో ఇటీవల కరెక‌్షన్‌ చోటుచేసుకుంది. స్టాక్‌ రేటింగ్‌ను బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 

బ్రోకరేజ్‌: హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌

స్టాక్‌: ఒబెరాయ్‌ రియల్టీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.598
రిటర్న్‌ అంచనా: 30 శాతం
కంపెనీ 2018 ఆర్థిక సంవత్సరపు క్యూ4లో ఆశించినంత పనితీరు కనబర్చలేదు. అయితే ప్రస్తుత క్యూ1లో చెప్పుకోదగ్గ పనితీరు సాధించింది. కంపెనీ ఇటీలవ క్విప్‌ పద్ధతిలో రూ.1,200 కోట్లు సమీకరించింది. దీన్ని మూలధనంగా ఉపయోగించుకోనుంది. అలాగే ఇటీవల కాలంలో స్టాక్‌ ధరలో కరెక‌్షన్‌ వచ్చింది. ఇది సానుకూలమే. అందువల్ల స్టాక్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 

బ్రోకరేజ్‌: నొమురా

స్టాక్‌: ఏసీసీ
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,900
రిటర్న్‌ అంచనా: 17 శాతం
ఈ స్టాక్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,890 నుంచి రూ.1,900కి పెంచుతున్నాం. సైకిల్‌ అప్‌ట్రెండ్‌ ప్రారంభమైంది. ఎర్నింగ్స్‌ రికవరీ ట్రాక్‌లోనే ఉంది. 

స్టాక్‌: అంబుజా సిమెంట్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.295
రిటర్న్‌ అంచనా: 25 శాతం
స్టాక్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.300 నుంచి రూ.295కి తగ్గిస్తున్నాం. కరెక‌్షన్‌ తర్వాతి వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయి. డిమాండ్‌ వృద్ధి కొనసాగితే, ఎర్నిం‍గ్స్‌ ఔట్‌లుక్‌ బాగుంటుంది. సామర్థ్యం పెంపు వల్ల విక్రయాలు పెరగొచ్చు. 

స్టాక్‌: డీహెచ్‌ఎఫ్‌ఎల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.775
రిటర్న్‌ అంచనా: 16 శాతం
రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ (ఆర్‌వోఈ) మెరుగుపడుతుందనే అంచనాల వల్ల ఈ స్టాక్‌ను రిరేటింగ్‌ చేస్తున్నాం. ఆర్‌వోఈ 15-16 శాతానికి మెరుగుపడొచ్చని అంచనా. ఈ స్టాక్‌ రేటింగ్‌ను బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.775గా నిర్ణయించాం. 

స్టాక్‌: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,750
రిటర్న్‌ అంచనా: 35 శాతం
ఈ స్టాక్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. అలాగే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,500 నుంచి రూ.1,750కి పెంచుతున్నాం. ప్రాఫిట్‌ అంచనాలను కూడా 3-7 శాతం పెంచాం. 

బ్రోకరేజ్‌: ఎలరా క్యాపిటల్‌

స్టాక్‌: బీపీసీఎల్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.509
రిటర్న్‌ అంచనా: 42 శాతం
బీపీసీఎల్‌ స్టాక్‌ రేటింగ్‌ను రెడ్యూస్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు క్రూడ్‌ ఆయిల్‌ ధరల పెరుగుదల భారాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తాయని విశ్వాసిస్తున్నాం. క్రూడ్‌ ధరలు పెరిగినా మార్జిన్ల రికవరీ అంశం ఇదే అంశాన్ని సూచిస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.496 నుంచి రూ.509కి పెంచుతున్నాం. 

బ్రోకరేజ్‌: యాక్సిస్‌ క్యాపిటల్‌

స్టాక్‌: ఐషర్‌ మోటార్స్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.32,249
రిటర్న్‌ అంచనా: 12 శాతం
కంపెనీ క్యూ1 ఫలితాలు అంచనాలకు అనువుగానే ఉన్నాయి. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మార్జిన్లు 32.3 శాతంగా, వీఈసీవీ మార్జిన్లు 9.2 శాతంగా ఉన్నాయి. రాయన్‌ ఎన్‌ఫీల్డ్‌ బలమైన అమ్మకాల వృద్ధిని ప్రకటిస్తూనే ఉంది. రెండేళ్లపాటు పోటీ పెద్దగా ఉండకపోవచ్చు. రూ.32,249 టార్గెట్‌ ప్రైస్‌తో స్టాక్‌ రేటింగ్‌ను బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. 

స్టాక్‌: ఎంఅండ్‌ఎం
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,042
రిటర్న్‌ అంచనా: 6 శాతం
ఎంఅండ్‌ఎం స్టాక్‌ రేటింగ్‌ను హోల్డ్‌ నుంచి బైకి అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.950 నుంచి రూ.1,042కి పెంచుతున్నాం. క్యూ1 ఎర్నింగ్స్‌ అంచనాలు మించడం ఇందుకు కారణం. బీఎస్‌-6 ప్రమాణాల అమలు వల్ల కంపెనీపై ఎక్కువగా ప్రభావం పడొచ్చు. అలాగే 2020-21 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల డిమాండ్‌ తగ్గే అవకాశముంది. 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు కంపెనీ బలమైన వృద్ధిని నమోదు చేస్తుంది. అలాగే కంపెనీ ఎర్నింగ్స్‌ అంచనాలను కూడా పెంచాం. 

బ్రోకరేజ్‌: క్రెడిట్‌ సూసీ

స్టాక్‌: కోల్గేట్‌ పామోలివ్‌
రేటింట్‌: ఔట్‌ పర్ఫార్మ్‌
టార్గెట్‌ ప్రైస్‌: రూ.1,320
రిటర్న్‌ అంచనా: 15 శాతం
ఈ స్టాక్‌ రేటింగ్‌ను న్యూట్రల్‌ నుంచి ఔట్‌ పర్ఫార్మ్‌కు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,150 నుంచి రూ.1,320కి పెంచుతున్నాం. పతంజలి ప్రభావం తగ్గే వరకు మార్కెట్‌ వాటాను కోల్పోవడం జరుగుతుంది. అయితే వచ్చే రెండు త్రైమాసికాల్లో కంపెనీ మార్కెట్‌ వాటా తగ్గడం ఆగిపోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్జిన్లు తక్కువగా ఉండొచ్చు. అయితే అటుపైన పుంజుకుంటాయి. 

గమనిక: వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు ఈ స్టాక్‌ రికమెండేషన్లు ఇచ్చాయి. అందువల్ల వీటితో సాక్షి వెబ్‌సైట్‌కి ఎలాంటి సంబంధం లేదు. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసే ముందు స్టాక్‌ అడ్వైజర్లను సంప్రదించడం ఉత్తమం.  



You may be interested

లుపిన్‌ 5శాతం అప్‌

Friday 31st August 2018

అమెరికా మార్కెట్లో పొటాషియం క్లోరైడ్ ఓరల్‌ సెల్యూషన్‌ ఔషధ విక్రయాలకు యూఎస్‌ఎఫ్‌డీఏ నుంచి అనుమతులు లభించడంతో లుపిన్‌ షేరు శుక్రవారం 5శాతానికి లాభపడింది. నేడు బీఎస్‌ఈలో లుపిన్‌ షేరు రూ.897.20ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అమెరికా మార్కెట్లో పొటాషియం క్లోరైడ్ ఓరల్‌ సెల్యూషన్‌ ఔషధాలను విక్రయించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతినిచ్చినట్లు లుపిన్‌ నేడు స్టాక్‌ సమాచారం ఇచ్చింది. ఈ ఔషధాన్ని మానవ రక్తంలో పొటాషియం మూలక సమతుల్యం కాపాడటానికి వినియోగిస్తున్నట్లు కంపెనీ

రూపీ పతనంతో ఐటీ షేర్ల ర్యాలీ

Friday 31st August 2018

కొత్త గరిష్టానికి నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ ఏడాది గరిష్టానికి ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ డాలర్‌ మారకంలో రూపాయి పతనంతో శుక్రవారం ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయి. కొంతకాలంగా డాలర్‌ మారకంలో రూపాయి కొత్త జీవితకాల కనిష్టాలకు చేరుకుంటున్న నేడు తొలిసారిగా 71 స్థాయికి పడిపోయింది. ఫలితంగా ఎగుమతులపై ఆధారపడే ఐటీ కంపెనీ షేర్లు భారీ ర్యాలీ చేస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఐటీ ఇండెక్స్‌ 2శాతానికి పైగా లాభపడి కొత్త

Most from this category