STOCKS

News


కొచర్‌ ఎగ్జిట్‌.. ఐసీఐసీఐకి పాజిటివ్‌..

Friday 5th October 2018
Markets_main1538722784.png-20890

చందా కొచర్‌ బ్యాంక్‌ చీఫ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో గ్లోబల్‌ బ్రోకరేజ్‌ సంస్థలు ఐసీఐసీఐ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉన్నాయి. యూబీఎస్‌, మెక్వైరీ సహా పలు సంస్థలు ఈ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగించాయి.

► చందా కొచర్‌ తప్పుకోవడం ఐసీఐసీఐ బ్యాంక్‌కు పాజిటివ్‌ అంశమని యూబీఎస్‌ పేర్కొంది. షేర్‌హోల్డర్లు ఇకపై కోర్‌ బ్యాంకింగ్‌ వ్యాపారంపై దృష్టి కేంద్రీకరిస్తారని తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ టార్గెట్‌ ప్రైస్‌ను రూ.410 నుంచి రూ.440కి పెంచింది. లోన్‌ బుక్‌ ప్రక్షాళన వల్ల ఎర్నింగ్స్‌ మెరుగుపడతాయని పేర్కొంది. తమ బై రేటింగ్‌కు కోర్‌ బ్యాంకింగ్‌ బిజినెస్‌, రిటైల్‌ విభాగాలు ప్రధాన కారణమని తెలిపింది. 

► మెక్వైరీ.. ఐసీఐసీఐ బ్యాంక్‌కు ఔట్‌పర్ఫార్మ్‌ రేటింగ్‌ను కొనసాగించింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.416గా నిర్ణయించింది. చందా కొచర్‌ నిష్క్రమణ వల్ల పెద్ద సమస్య పరిష్కారమైందని పేర్కొంది. సందీప్‌ బక్షి నియామకంపై ఆర్‌బీఐ ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయదని భావిస్తున్నట్లు తెలిపింది. క్రెడిట్‌ వ్యయం తగ్గడం వల్ల రిటర్న్‌ ఆన్‌ ఈక్విటీ మెరుగుపడుతుందని పేర్కొంది. 

► మార్కెట్‌ సెంటిమెంట్‌ కనిష్ట స్థాయిలకు పడిపోయినప్పుడు, బ్యాంకులు వాటి బ్యాలెన్స్‌ షీట్లలో ఎన్‌పీఏల సమస్యలతో సతమతమౌతున్నప్పుడు చందా కొచర్‌ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారని సింఘి అడ్వైజర్స్‌ ఫౌండర్‌ మహేశ్‌ సింఘి పేర్కొన్నారు. కొచర్‌ నిష్క్రమణ అనేది ఐసీఐసీఐ బ్యాంక్‌పై ఇన్వెస్టర్లలో మళ్లీ నమ్మకాన్ని నింపిందని తెలిపారు.  

వివాదం..
వీడియోకాన్ గ్రూప్‌నకు లంచం తీసుకుని రుణం మంజూరు చేశారన్న వివాదం ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్ పదవికి ఎసరు పెట్టింది. క్విడ్‌ప్రోకో ఆరోపణలపై విచారణ నేపథ్యంలో బ్యాంక్ ఎండీ, సీఈవో పదవులకు కొచర్ రాజీనామా చేశారు. 2019 మార్చి 31 దాకా ఆమె పదవీ కాలం ఉన్నప్పటికీ ముందుగానే వైదొలిగినట్లయింది. వీటితో పాటు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ సహా ఇతర అనుబంధ సంస్థల నుంచి కూడా ఆమె తప్పుకున్నారు. తాజా పరిణామాలతో కొత్త ఎండీ, సీఈవోగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ (సీవోవో) సందీప్ బక్షి నియమితులయ్యారు. 2023 అక్టోబర్ 3 దాకా అయిదేళ్ల పాటు ఆయన ఈ హోదాల్లో కొనసాగుతారని ఐసీఐసీఐ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది.You may be interested

పాతాళానికి ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు

Friday 5th October 2018

రెండున్నరేళ్ల కనిష్టానికి బీపీసీఎల్‌ రెండేళ్ల కనిష్టానికి ఐఓసీ ఏడాదిన్నర కనిష్టానికి హెచ్‌పీసీఎల్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఎక్సైంజ్‌ సుంకాలన్ని కేంద్రం లీటర్‌కు రూ.1.50, ఆయిల్‌ మార్కెట్‌ కంపెనీలు లీటరుకు రూ.1.00 భరించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రకటనతో శుక్రవారం ఆయిల్‌ కంపెనీల ప్రధాన షేర్లైన బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐఓసీ షేర్లు 28 శాతం కుప్పకూలాయి. గత ట్రేడింగ్‌లో జైట్లీ ప్రకటన కారణంగా చివరి అరగంటలోనే ఆయిల్‌ కంపెనీ షేర్లు ఏకంగా 20శాతం నష్టపోయిన

పాత తప్పిదాలే పుట్టి ముంచుతాయి

Friday 5th October 2018

ఆగస్టు నుంచి ఆరంభమైన సంక్షోభం ధాటికి దేశీయ మార్కెట్లలో దాదాపు 17 లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైంది. చిన్న ఇన్వెస్టర్ల నుంచి బడా హౌస్‌లవరకు అందరికీ ఈ దఫా గట్టి దెబ్బే తగిలింది. అయితే మార్కెట్లో దెబ్బలకు మన సొంత తప్పిదాలే అధిక కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎప్పుడూ చేసే తప్పులే మనకు తెలియకుండా రిపీట్‌ చేస్తుంటామని చెబుతున్నారు.  తాజా పతనంలో ఏమి నేర్చుకోవాలి... - ‘రోమ్‌ ఒక్కరోజులో నిర్మితం కాలేదు..

Most from this category