STOCKS

News


ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌పై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Tuesday 16th October 2018
Markets_main1539677134.png-21203

ముంబై:- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేయడంతో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ కంపెనీ షేరుకు పలు బ్రోకరేజ్‌ సంస్థలు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించాయి. ప్రస్తుత స్థాయి(రూ.926.95) నుంచి కంపెనీ షేరు ధీర్ఘకాలంలో 40 నుంచి 60శాతం వరకు లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచవచ్చని రేటింగ్‌ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇప్పుడు ఆయా రేటింగ్‌ సంస్థలు ఐబీఎల్‌ షేరుపై విశ్లేషణలను పరిశీలిద్దాం...
1.జేపీ మోర్గాన్‌:- కంపెనీ ఇటీవల మార్కెట్లో నెలకొన్న అనిశ్చితిని సమర్థవంతగా తట్టుకోగలింది. అస్తులు- అప్పులు- నిర్వహణ(అస్సెట్‌ లయబిలిటి మేనేజ్‌మెంట్‌) సంప్రదాయ పద్దతిలో ఉండటం కంపెనీకి కలిసోచ్చే అంశం. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. ప్రస్తుతం ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో ఇది అత్యుత్తమ షేరు అని చెప్పడానికి ఎలాంటి సందేహాం లేదు. కావున షేరుకు ప్రస్తుత ధర నుంచి 68శాతం అప్‌ట్రెండ్‌తో రూ.1600ల టార్గెట్‌ ధరను నిర్ణయించడమైంది.
2.మెక్వెరీ:- కంపెనీ క్యూ2లో గణనీయమైన గణాంకాలను వెల్లడించింది. ప్రకటించిన ఫలితాలను పరిశీలిస్తే కంపెనీకి ద్రవ్యత్వలోటు లేదని విషయం స్పష్టం అవుతోంది. వృద్ధి తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక సంవత్సరం 2019 నుంచి 2020 వరకు రుణ వృద్ధిని తగ్గించుకోవడం కంపెనీ తగిన మార్గదర్శకాలను రూపోందిస్తోంది. ఇటీవల జరిగి కరెక్షన్‌ షేరుకు కలిసొచ్చే అంశం. ఈ పరిణామాల నేపథ్యంలో షేరుకు అవుట్‌ ఫెర్మామింగ్‌ రేటింగ్‌ కేటాయింపుతో పాటు షేరు టార్గెట్‌ ధరను రూ.1400లకు పెంచడం జరిగింది.
3.సీఎల్‌ఎస్‌ఏ:- వృద్ది ఓ మోస్తారు ఉన్నప్పటికీ లిక్విడిటీ అధికంగా ఉంది. కంపెనీ స్థిరమైన ఆర్థిక ఫలితాలను సాధించింది. కాబట్టి షేరు ప్రస్తుత ధర నుంచి 58 శాతం అప్‌ట్రెండ్‌తో రూ.1500ల టార్గెట్‌ ధరను నిర్ణయించడమైంది. ఇటీవల కంపెనీ షేరుకు టార్గెట్‌ ధరను రూ.1770 కేటాయించింది. ఈ క్యూ2లో కొన్ని బలహీనమైన కారకాల నేపథ్యంలో షేరు రేటిం‍గ్‌ను 3శాతం నుంచి 5శాతం మధ్యలో తగ్గించింది.
మంగళవారం మధ్యాహ్నం సమయానికి బీఎస్‌ఈలో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ షేరు గత ముగింపు ధర(రూ.948.7)తో పోలిస్తే 2.81నష్టంతో రూ.922.05ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.



You may be interested

ఫెడరల్‌ బ్యాంక్‌ లాభం రూ.266 కోట్లు

Tuesday 16th October 2018

ప్రైవేట్‌ రంగ ఫెడరల్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. బ్యాంక్‌ నికర లాభం వార్షిక ప్రాతిపదికన 1 శాతం వృద్ధితో రూ.266 కోట్లకు పెరిగింది. మొండి బకాయిల కేటాయింపులు పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ క్యూ2లో వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 13.7 శాతం వృద్ధితో రూ.1,022 కోట్లకు ఎగసింది. ఫెడరల్‌ బ్యాంక్‌ రుణ

మార్కెట్‌లో మరింతకాలం అమ్మకాల ఒత్తిడి

Tuesday 16th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు ఇప్పుడే ఆగవని కోటక్‌ సెక్యూరిటీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (ఈక్విటీ టెక్నికల్‌ రీసెర్చ్‌) శ్రీకాంత్‌ చౌహాన్‌ తెలిపారు. మార్కెట్‌ జనవరి నుంచే కరెక్టివ్‌ ట్రెండ్‌ను సూచిస్తూ వస్తోందని పేర్కొన్నారు. 2018 బడ్జెట్‌ ప్రకటనకు ముందు నిఫ్టీ 11,170 వద్ద ట్రేడయ్యిందని తెలిపారు. నిఫ్టీ 11,760 గరిష్ట స్థాయిని తాకిన తర్వాత 9,950 కనిష్ట స్థాయికి పతనమైందని పేర్కొన్నారు. టెక్నికల్‌గా చూస్తే ఇది కరెక్టివ్‌ అప్‌వర్డ్‌ అని

Most from this category