News


ఎస్‌బీఐ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Friday 10th May 2019
Markets_main1557470410.png-25649

మార్చి త్రైమాసిక ఫలితాలను ఎస్‌బీఐ శుక్రవారం ప్రకటించనుంది. నికర వడ్డీ ఆదాయంలో రెండంకెల వృద్ధి, ప్రొవిజన్లు తగ్గడంతో బ్యాంకు మంచి లాభాలను చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. క్యు4లో బ్యాంకు రూ.5-7వేల కోట్ల లాభాలన్ని ‍ప్రకటించవచ్చని బ్రోకింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. అంతకుముందేడాది ఇదే కాలానికి బ్యాంకు రూ. 7718 కోట్ల నష్టాన్ని ప్రకటించింది.

బ్యాంకు ఫలితాలపై వివిధ సంస్థల అంచనాలు ఇలా ఉన్నాయి..
- నార్నోలియా సెక్యూరిటీస్‌: లాభం 53 శాతం పెరిగి రూ. 6034 కోట్లకు చేరవచ్చు. అసెట్‌క్వాలిటీ మెరుగుపడుతుంది.
- కోటక్‌ సెక్యూరిటీస్‌: లాభం 70 శాతం వృద్ధి చెంది రూ. 6759 కోట్లను తాకుతుంది. స్లిపేజ్‌లు 2.5 శాతం దిగువకు వస్తాయి. స్థూల ఎన్‌పీఏలు సైతం క్షీణిస్తాయి. 
- ప్రభుదాస్‌ లీలాధర్‌: లోన్‌గ్రోత్‌ 11-12 శాతం, ఎన్‌ఐఐ వృద్ధి 16- 17 శాతం వరకు ఉంటాయి. ఎన్‌ఐఎం స్థిరంగా ఉంటుంది. ఆస్తుల నాణ్యత బాగుపడుతుంది. స్లిపేజ్‌లు పెరగకపోవచ్చు. 
- మోతీలాల్‌ ఓస్వాల్‌: రుణ వృద్ధిలో 11 శాతం పెరుగుదల ఉండొచ్చు. రిటైల్‌ రుణాల్లో మెరుగుదల కనిపిస్తుంది. డిపాజిట్లలో 8 శాతం వృద్ధి ఉంటుంది. ఎన్‌ఐఐలో 15 శాతం పెరుగుదల కనిపిస్తుంది. అయితే వడ్డీయేతర ఆదాయం తగ్గవచ్చు. 
కీలకంగా పరిశీలించాల్సిన అంశాలు..
రిటైల్‌, ఎస్‌ఎంఈ, అగ్రి స్లిపేజ్‌లపై అప్‌డేట్స్‌
ఎన్‌సీఎల్‌టీ అకౌంట్ల నుంచి రికవరీలు
పవర్‌ అసెట్స్‌పై అవుట్‌లుక్‌
ఆస్తుల నాణ్యతపై కామెంట్స్‌.



You may be interested

హెచ్‌సీఎట్‌ టెక్‌ లాభం రూ.2,550 కోట్లు

Friday 10th May 2019

-ఒక్కో షేర్‌కు రూ.2 మధ్యంతర డివిడెండ్‌ -ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్ల ఆదాయం లక్ష్యం  -హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈఓ విజయ్‌ కుమార్‌  న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌  గత ఆర్థిక సంవత్సరం(2018-19) మార్చి క్వార్టర్‌లో రూ.2,550 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌)సాధించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం (2017-18) ఇదే క్వార్టర్‌లో రూ.2,230 కోట్ల నికర లాభం వచ్చిందని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ తెలిపింది. ఆదాయం రూ.13,178 కోట్ల నుంచి 21 శాతం వృద్ధితో

స్వల్పంగా పెరిగిన పసిడి

Friday 10th May 2019

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం స్వల్పంగా పెరిగింది. ఆసియా ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర 3డాలర్ల లాభంతో 1,287.45 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అమెరికా చైనాకు చెందిన 200మిలియన్ల దిగుమతులపై అదనంగా విధించిన 15శాతం టారీప్‌ నేటి నుంచి అమల్లోకి రానుంది. చైనా ఈ టారీఫ్‌ పెంపు అంశంపై ప్రతీకార చర్యలు తప్పవని వ్యాఖ్యానించినప్పటికి.., ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రానున్న రోజుల్లో ట్రేడ్‌

Most from this category