STOCKS

News


హెచ్‌యూఎల్‌ రేటింగ్‌ డౌన్‌గ్రేడ్‌

Tuesday 17th July 2018
Markets_main1531814111.png-18392

సోమవారం క్యు1 ఫలితాలు ప్రకటించిన హెచ్‌యూఎల్‌ షేరు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 3 శాతం పతనమైంది. ఫలితాలు బాగున్నప్పటికీ కొన్ని బ్రోకరేజ్‌లు కంపెనీ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేశాయి. కొన్ని సంస్థలు టార్గెట్‌ ధరను పెంచాయి. 
క్యు1 ఫలితాల అనంతరం హెచ్‌యూఎల్‌పై వివిధ బ్రోకరేజ్‌ల అంచనాలు, అభిప్రాయాలు...
1. యాక్సిస్‌ క్యాపిటల్‌: రేటింగ్‌- హోల్డ్‌. టార్గెట్‌ రూ. 1720. రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించింది. ఇటీవలి ర్యాలీతో షేరు వాల్యూషన్లు చాలా ఖరీదుగా మారాయి. వృద్ది అవకాశాలు ప్రైస్‌ఇన్‌ అయ్యాయి. భవిష్యత్‌ వృద్ధి అంచనాలు నామమాత్రంగా ఉన్నాయి. 
2. జెఫర్రీస్‌: రేటింగ్‌- హోల్డ్‌. టార్గెట్‌ రూ. 1680. కొనొచ్చు నుంచి రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్‌ చేసింది. వాల్యూం గ్రోత్‌ ఇకమీదట పెద్దగా ఉండకపోవచ్చని అంచనా వేసింది. ఇదే రేంజ్‌లో మార్జిన్ల విస్తరణను ఇకమీదట ఆశించలేమని తెలిపింది. వాల్యూషన్లు సైతం చాలా ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఇంకా పరుగులు తీసేందుకు ఛాన్సుల్లేవని అభిప్రాయపడింది.
3. ఫిలిప్‌క్యాప్‌: రేటింగ్‌- న్యూట్రల్‌. టార్గెట్‌ రూ. 1710. రేటింగ్‌ను కొనొచ్చు నుంచి తగ్గించింది. భారీ వాల్యూషన్ల కారణంగా ఇకమీదట పరుగులు ఉండవు. ఇంత స్థాయిలో వాల్యూం వృద్ధి నమోదు చేయడం చాలా కష్టం. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో వృద్ధి కుంటుపడొచ్చు.
4. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: రేటింగ్‌- రెడ్యూస్‌. టార్గెట్‌ రూ. 1570. టార్గెట్‌ను పెంచినా, రేటింగ్‌ను తగ్గించింది. ఇతర వ్యయాల్లో తరుగుదల కారణంగా మార్జిన్లు పుంజుకున్నాయని తెలిపింది. సమీప భవిష్యత్‌ ఈపీఎస్‌ అంచనాలను పెంచింది. 
5. ఎడెల్‌వీజ్‌ సెక్యూరిటీస్‌: రేటింగ్‌- హోల్డ్‌. టార్గెట్‌ రూ. 1887. ప్రస్తుత స్థాయిల నుంచి అప్‌సైడ్‌ కొంత వరకే ఉంటుంది. క్యు1 ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. కొత్త ఉత్పత్తులు, ఆయుష్‌ ఇకమీదట కీలక ట్రిగ్గర్లుగా పనిచేస్తాయి.
6. మోతీలాల్‌ ఓస్వాల్‌: రేటింగ్‌- బై. టార్గెట్‌ రూ. 2010. మార్జిన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎర్నింగ్స్‌ విజిబిలిటీ బాగుంది. ఇతర లార్జ్‌క్యాప్‌ కన్జూమర్‌ కంపెనీలతో పోలిస్తే రిటర్న్‌రేషియో పాజిటివ్‌గా ఉంది. 
7. మోర్గాన్‌స్టాన్లీ: రేటింగ్‌- అండర్‌వెయిట్‌. టార్గెట్‌ రూ. 1260. క్యు1 ఫలితాలు బాగున్నా, ఎర్నింగ్స్‌ అంచనాలకు డౌన్‌సైడ్‌ రిస్కులు పెరిగాయి.



You may be interested

ఎయిర్‌టెల్‌: ఆదాయానికి 3 రెట్లు అప్పులు

Tuesday 17th July 2018

భారతీ ఎయిర్‌టెల్‌ అప్పులు దాని ​ఆదాయానికి మూడు రెట్లపైగా ఎక్కువగా ఉన్నాయి. రిలయన్స్‌ జియో టారిఫ్‌ వార్‌ దీనికి ప్రధాన కారణం. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం చూస్తే.. బిలియనీర్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌ సారథ్యంలోని ఎయిర్‌టెల్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కంపెనీ చెల్లించాల్సిన రుణాలు రూ.71,460 కోట్లుగా ఉన్నాయి. ఇక దశాబ్ద కాలంలో కంపెనీ  నగదు రాబడి రూ.20,719 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆర్థిక అప్పులు 2018

చురుగ్గా ట్రేడవుతున్న షేర్లివే..!

Tuesday 17th July 2018

అంతర్జాతీయంగా ముడిచమురు ధర దిగిరావడంతో మంగళవారం మిడ్‌షెషన్‌ సమయానికి దేశీయ మార్కెట్‌ లాభాల్లో ట్రేడ్‌ అవుతోంది. మధ్యాహ్నం గం.12:45ని.లకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 25 పాయింట్ల లాభంతో 36,348 వద్ద,  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 28 పాయింట్ల లాభంతో 10,965 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ తరుణంలో ఎన్‌ఎస్‌ఈలో ట్రేడింగ్‌లో కొన్ని షేర్లు భారీ ట్రేడింగ్‌ పరిమాణంతో ట్రేడ్‌ అవుతున్నాయి. వాటిలో రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ షేరు  1.90 కోట్ల వాల్యూమ్స్‌తో ట్రేడ్‌ అవుతుండగా,

Most from this category