STOCKS

News


ఎంఅండ్‌ఎంపై బుల్లిష్‌

Wednesday 8th August 2018
Markets_main1533723737.png-19055

ఆటోమొబైల్‌ రంగానికి చెందిన మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో మంచి ఫలితాలను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంఅండ్‌ఎం స్టాక్‌పై బ్రోకరేజ్‌ సంస్థల అంచనాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..

బ్రోకరేజ్‌: మెక్వైరీ
రేటింగ్‌: ఔట్‌పర్ఫార్మ్‌
టార్గెట్‌: రూ.1,050
ఈ గ్లోబల్‌ రీసెర్చ్‌ సంస్థ ఎంఅండ్‌ఎం టార్గెట్‌ ధరను రూ.940 నుంచి రూ.1,050కి పెంచింది. కొత్త మోడళ్ల వల్ల 2018-19 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో యుటిలిటీ వాహన విక్రయాలు పెరగొచ్చని అంచనా వేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరపు ఈపీఎస్‌ అంచనాలను 11-12 శాతం పెంచింది. దేశీ ఇతర సంస్థలతో పోలిస్తే ఎంఅండ్‌ఎం స్టాక్‌ వ్యాల్యుయేషన్స్‌ ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొంది. 

బ్రోకరేజ్‌: డాయిష్‌ బ్యాంక్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌: రూ.1,005
ఈ సంస్థ ఎంఅండ్‌ఎం ట్రాక్టర్‌ బిజినెస్‌ ఔట్‌లుక్‌ సానుకూలముగా ఉందని పేర్కొంది. ఎస్‌యూవీ విభాగంలో రికవరీ ద్వారా తదుపరి వృద్ధి జరగొచ్చని పేర్కొంది. 

బ్రోకరేజ్‌: మోర్గాన్‌ స్టాన్లీ
రేటింగ్‌: ఓవర్‌వెయిట్‌
టార్గెట్‌: రూ.1,063
ఈ బ్రోకరేజ్‌ సంస్థ ప్రస్తుత స్థాయిల్లో సాధారణమైన లాభాలు పొందొచ్చని పేర్కొంది. రానున్న పండుగ సీజన్‌ నేపథ్యంలో విక్రయాల పెరుగుదల సంస్థకు సానుకూల అంశమని తెలిపింది.

బ్రోకరేజ్‌: క్రెడిట్‌ సూసీ
రేటింగ్‌: ఔట్‌పర్ఫార్మ్‌
టార్గెట్‌: రూ.1,100
ఈ రీసెర్చ్‌ సంస్థ ఎంఅండ్‌ఎం స్టాక్‌పై పాజిటివ్‌గా ఉంది. గ్రామీణ డిమాండ్‌ ఇందుకు కారణం. ట్రాక్టర్‌ బిజినెస్‌లో బలమైన లాభదాయకత ఉంటుందని అంచనా వేస్తోంది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,030 నుంచి రూ.1,100కి పెంచింది.  

బ్రోకరేజ్‌: యాక్సిస్‌ క్యాప్‌
రేటింగ్‌: కొనొచ్చు 
టార్గెట్‌: రూ.1,042
ఈ బ్రోకరేజ్‌ సంస్థ జూన్‌ క్వార్టర్‌ ఎర్నింగ్స్‌ అంచనాలను మించాయని తెలిపింది. బలమైన మార్జిన్లు ఇందుకు కారణమని పేర్కొంది. బీఎస్‌-6 ప్రమాణాల వల్ల కంపెనీపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్‌ బిజినెస్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉండొచ్చని అంచనా వేసింది. అయినప్పటికీ ఈ సంస్థ ఎంఅండ్‌ఎంపై రేటింగ్‌ను హోల్డ్‌ నుంచి కొనొచ్చని అప్‌గ్రేడ్‌ చేసింది. అలాగే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.950 నుంచి రూ.1,042కి పెంచింది. 

బ్రోకరేజ్‌: జెఫెరీస్‌
రేటింగ్‌: కొనొచ్చు
టార్గెట్‌: రూ.975
ఈ బ్రోకరేజ్‌ సంస్థ ట్రాక్టర్‌, ఎల్‌సీవీ విభాగాల్లో అప్‌ట్రెండ్‌ ఉండొచ్చని అంచనా వేస్తోంది. సానుకూల రుతుపవనాల నేపథ్యంలో బలమైన గ్రామీణ డిమాండ్‌ ఉండొచ్చని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని పేర్కొంది. 

జూన్‌ క్వార్టర్‌ ఫలితాలను గమనిస్తే..
మహీంద్రా నికర లాభం 67 శాతం వృద్ధితో రూ.1,257 కోట్లకు పెరిగింది. ఇది మార్కెట్‌ అంచనాలను మించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ రూ.752 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇక కంపెనీ మొత్తం ఆదాయం 23 శాతం వృద్ధితో రూ.13,358 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో కంపెనీ ఆదాయం రూ.11,006 కోట్లుగా ఉంది. ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ మార్జిన్‌ వార్షిక ప్రాతిపదికన 13.8 శాతం నుంచి 15.8 శాతానికి పెరిగింది. You may be interested

మరో కొత్త రికార్డు ముగింపు

Wednesday 8th August 2018

11450 వద్ద నిఫ్టీ ముంబై:- ఒక రోజు మిశ్రమ ముగింపు అనంతరం సూచీలు మళ్లీ సరికొత్త రికార్డులకు శ్రీకారం చుట్టాయి. బ్యాంకింగ్‌, ఇంధన, ఫైనాన్షియల్‌ సర్వీసెస్ రంగ షేర్ల అండతో సూచీలు ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త రికార్డులను సృష్టించాయి. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలు రోజంతా లాభాల ర్యాలీ చేశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 221 పాయింట్ల లాభపడి 37,887 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 60.55 పాయింట్లు

ఎన్నికలయ్యేంత వరకు ఆగండి!

Wednesday 8th August 2018

ఆ తర్వాతే పెట్టుబడులు బెటర్‌ ప్రిన్సిపాల్‌ పీఎన్‌బీ ఏఎంసీ సీఐఓ రజత్‌ జైన్‌ ఈ ఏడాది ఆరంభంలో కరెక‌్షన్‌ అనంతరం నిఫ్టీ పుంజుకొని కొత్త గరిష్ఠాలను తాకింది. అయితే ఈ ఊపు మొత్తం స్టాకులన్నింటిలో కనిపించలేదు. కేవలం కొన్ని లార్జ్‌ క్యాప్స్‌ మాత్రమే నిఫ్టీని పైకి లేపాయని రజత్‌ చెప్పారు. ఇక మీదట ఇలాంటి మూవ్‌కు ఆస్కారం ఉండకపోవచ్చన్నారు. ఇప్పటినుంచి లార్జ్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ అన్నీ ఒకేలా ప్రవర్తించే ఛాన్సులున్నాయని అంచనా

Most from this category