STOCKS

News


బడ్జెట్‌ రోజు బెట్టింగ్‌ ఎందులో...?

Friday 1st February 2019
Markets_main1548961530.png-23933

బడ్జెట్‌ రోజున స్టాక్‌ మార్కెట్లో రంగాల వారీగా కంపెనీల షేర్ల ధరల్లో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకోవచ్చు. ప్రభుత్వం తీసకునే నిర్ణయాలు ఇందుకు కారణం అవుతాయి. కొన్నింటికి పాజిటివ్‌గా, కొన్ని రంగాలకు నెగెటివ్‌గా, మరికొన్నింటికి తటస్థమైన నిర్ణయాలు బడ్జెట్‌లో ఉంటుంటాయి. ఈ నిర్ణయాల ఆధారంగా ఆ రోజు ట్రేడర్లు, ఇన్వెస్టర్లు పొజిషన్లకు మొగ్గు చూపుతుంటారు. మరి ఈ దఫా కేంద్రంలోని మోదీ సర్కారు లోక్‌సభ ఎన్నికల ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్‌ కావడంతో కీలక నిర్ణయాలకు చోటు ఉంటుందని భావిస్తున్న సంగతి తెలిసిందే. బ్రోకరేజీ సంస్థలు బడ్జెట్‌ సందర్భంగా పలు రంగాలపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. 

 

ప్రభుదాస్‌ లీలాధర్‌
కార్పొరేట్‌ పన్నును, దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను లేదా డివిడెండ్‌ పంపిణీ పన్నును సరళిస్తే అది మార్కెట్లకు సానుకూలం. సాగు రంగానికి ఏదైనా ప్యాకేజీ ఇస్తే, వ్యక్తిగత ఆదాయపన్ను మినహాయింపు పెంచితే... దేశీయ వినియోగంపై ఆధారపడే కంపెనీలు ఐటీసీ, హెచ్‌యూఎల్‌, బ్రిటానియా, డాబర్‌, టీవీఎస్‌ తరహా ద్విచక్ర వాహన కంపెనీలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, కన్జ్యూమర్‌ ఫైనాన్స్‌ విభాగంలోని బజాజ్‌ ఫైనాన్స్‌ను ఎంచుకోవచ్చు. వినియోగం పెరిగితే ఈ కంపెనీలకు లాభం చేకూరుతుంది. సాగు రంగానికి ప్యాకేజీ ప్రకటిస్తే ఎంఅండ్‌ఎం, పీఐ ఇండస్ట్రీస్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ మంచి బెట్స్‌. 

 

రిలయన్స్‌ సెక్యూరిటీస్‌
కన్జ్యూమర్‌ విభాగంలో ఐటీసీపై దృష్టి సారించొచ్చు. సిగరెట్లపై ఎక్సైజ్‌ సుంకం పెంచితే అమ్మకాలపై ప్రభావం పడుతుంది. గ్రామీణ వినియోగం పెరిగితే ఎస్కార్ట్స్‌, హెచ్‌యూఎల్‌, డాబర్‌, కోల్గేట్‌కు లాభం. పన్ను మినహాయింపు పెంచితే విచక్షణారహిత వినియోగం పెరుగుతుంది. రైల్వేకు నిధులు కేటాయింపు పెంచొచ్చు. రోడ్లు, ఇన్‌ఫ్రా, రియల్‌ ఎస్టేట్‌లకూ సానుకూలంగా ఉండొచ్చు. ఎల్‌అండ్‌టీ, కేఈసీ ఇంటర్నేషనల్‌, అహ్లువాలియా కాంట్రాక్ట్స్‌, ఎన్‌సీసీ, అల్ట్రాటెక్‌ కంపెనీలపై దృష్టి సారించొచ్చు. భారత్‌లో తయారీకి ప్రోత్సాహం ఉంటే ఇంజనీరింగ్‌, ఆర్‌అండ్‌కి ప్రోత్సాహం లభిస్తుంది. ఐటీ, టెలికం కంపెనీలపై పెద్దగా బడ్జెట్‌ ప్రభావం ఉండకపోవచ్చు. ముందస్తు ఆరోగ్య పరీక్షలకు ప్రభుత్వం పన్ను మినహాయింపు కల్పించొచ్చు. ఆరోగ్యరంగం కీలకమైనది కనుక ఫార్మా కంపెనీలపై దృష్టి సారించొచ్చు. గ్రామీణ విద్యుదీకరణపై దృష్టితో ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌కు లాభిస్తుంది. 

 

షేర్‌ఖాన్‌
బాటా ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్‌, సెంచురీ ప్లైబోర్డ్స్‌,  డాబర్‌ ఇండియా, ఎస్కార్ట్స్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టయిల్‌ ఫ్యాషన్స్‌, జీఎన్‌ఏ యాక్సిల్స్‌, హిందుస్తాన్‌ యునిలీవర్‌, ఐసీఐసీఐ బ్యాంకు, వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌. 
 You may be interested

10850పై ప్రారంభమైన నిఫ్టీ

Friday 1st February 2019

ప్రపంచమార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీ మార్కెట్‌ శుక్రవారం లాభాలతో ప్రారంభమైంది. నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 10851 వద్ద, సెన్సెక్స్‌ 56 పాయింట్ల పెరుగుదలతో 36312 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభలో మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టడం, అలాగే నేడు ఫిబ్రవరి ఎఫ్‌అండ్‌వో సిరీస్‌ ప్రారంభంకానుండటం ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. ఎఫ్‌ఎంసీజీ, అటో రంగ షేర్లలో కొనుగోళ్లలో జోరుగా సాగుతున్నాయి. మెటల్‌, బ్యాంకింగ్‌

ఏయే షేర్లు...ఎన్నెన్ని పాయింట్లు.?

Thursday 31st January 2019

హెవీవెయిట్‌ షేర్లలో జరిగిన భారీ కొనుగోళ్లు, షార్ట్‌ కవరింగ్‌ కారణంగా గురువారం భారత్‌ మార్కెట్‌ పెద్ద ర్యాలీ జరిపింది. నిఫ్టీ ఇండెక్స్‌ ఆర్జించిన 179 పాయింట్ల లాభంతో రిలయన్స్‌ ఇండస్ట్రీట్‌ లిమిటెడ్‌ షేరు అత్యధికంగా 27 పాయింట్లను సమకూర్చింది. అదే బాటలో ఇన్ఫోసిస్‌ 21 పాయిం‍ట్లను, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 16 పాయింట్లను హెచ్‌డీఎఫ్‌సీ 14 పాయింట్లను, ఐటీసీ షేరు 11పాయింట్ల, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ 10పాయింట్లను అందజేశాయి. అలాగే టీసీఎస్‌,

Most from this category