STOCKS

News


ఫలితాల తర్వాత ఈ షేర్లపై బ్రోకరేజ్‌లు బుల్లిష్‌

Friday 26th October 2018
Markets_main1540539464.png-21494

తాజా సెప్టెంబర్‌ త్రైమాసిక ఫలితాల్ని వెల్లడించిన వివిధ కంపెనీలకు చెందిన షేర్లను మధ్య, దీర్ఘకాలానికి కొని, హోల్డ్‌చేయదగ్గ షేర్లను బ్రోకింగ్‌ సంస్థలు సిఫార్సుచేసాయి. అవి...

కోటక్‌ మహింద్రా బ్యాంక్‌
బ్రోకరేజ్‌: సీఎల్‌ఎస్‌ఏ. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 1420

ఫలితాల అనంతరం కోటక్‌ మహింద్రా బ్యాంక్‌ రేటింగ్‌ను సీఎల్‌ఎస్‌ఏ ‘అవుట్‌పెర్ఫార్మ్‌’ నుంచి ‘బై’కి రేటింగ్‌ను సవరించింది. అయితే ఏడాది కాలానికి టార్గెట్‌ ధరను రూ. 1480 నుంచి రూ. 1420కి తగ్గించింది. ఈ బ్యాంకు లాభాల్లో ఆరోగ్యకరమైన వృద్ధిని కనపర్చిందని, కానీ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రొవిజన్లు నికరలాభాన్ని కుదించినట్లు బ్రోకరేజ్‌ సంస్థ పేర్కొంది. అయినా ప్రస్తుత షేరు విలువ సబబుగా వున్నందున, కొనుగోలుకు ఆకర్షణీయమని సిఫార్సుచేసింది. పటిష్టమైన కాసా, కేపిటలైజేషన్‌ను బ్యాంకు కలిగివుందని విశ్లేషించింది. 


క్యాడిలా హెల్త్‌కేర్‌
బ్రోకరేజ్‌: సిటీగ్రూప్‌. రేటింగ్‌: బై, టార్గెట్‌: రూ. 450

ఫలితాల ప్రకటన అనంతరం క్యాడిలా హెల్త్‌కేర్‌ షేరుకు బై రేటింగ్‌ను కొనసాగిస్తూ రూ. 450 టార్గెట్‌ ధరతో కొనొచ్చని సిటిగ్రూప్‌ సిఫార్సుచేసింది. హెయింజ్‌ ఇండియాను ఈ కంపెనీ టేకోవర్‌ చేసినందున, తొలి ఏడాది నుంచే ఈపీఎస్‌లో అనుకూల ప్రభావం కనపడుతుందని బ్రోకరేజ్‌ అంచనావేసింది. హెయింజ్‌ ఇండియాకు వున్న  పటిష్టమైన బ్రాండ్‌ ఈక్విటీ..క్యాడిలాకు ఉపకరిస్తుందని పేర్కొంది. హెయింజ్‌ ఇండియాను రూ. 4495 కోట్లకు క్యాడిలా తన అనుబంధ సంస్థ జైడస్‌తో కలిసి గతవారం కొనుగోలు చేసింది. 

అపోలో టైర్స్‌
బ్రోకరేజ్‌: ఈక్విరస్‌ సెక్యూరిటీస్‌. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 270

అపోలోటైర్స్‌కు ఈక్విరస్‌ సెక్యూరిటీస్‌ ‘బై’ రేటింగ్‌ను రూ. 270 టార్గెట్‌ ధరతో కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, రూపాయి విలువ తరుగుదల కారణంగా పెరిగిన వ్యయాలకు అనుగుణంగా టైర్ల ధరల పెంపు టైర్ల కంపెనీలు వాయిదా వేసినందున, గత మూడు నెలలుగా ఈ షేరు బాగా కరెక్షన్‌కు లోనయ్యిందని, ఇప్పుడు ధరల పెంపుదల ఆరంభంకావడంతో పాటు మరికొద్ది నెలల్లో ఇంకో రౌండు పెంపు వుంటుందని అంచనావేస్తూ ఈ షేరుకు ధరకు బై రేటింగ్‌ను కేటాయిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ వివరించింది. 

విప్రో
బ్రోకరేజ్‌: ఎలారా కేపిటల్‌. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 405

ఐటీ రంగంలో టాప్‌పిక్‌గా ఎలారా కేపిటల్‌ పేర్కొంటూ రూ. 405 టార్గెట్‌ ధరతో కొనొచ్చని సిఫార్సుచేసింది. విప్రో క్వార్టర్‌ ఆన్‌ క్వార్టర్‌ ప్రాతిపదికన ఆదాయాన్ని 1.6 శాతం మేర పెంచుకుందని, ఇది తమ అంచనా 0.7 శాతంకంటే అధికమని ఎలారా తెలిపింది. బీఎఫ్‌ఎస్‌ఐ విభాగంలో విప్రో వరుసగా పదవ క్వార్టర్లో 3.3 శాతం మెరుగైన వృద్ధిని సాధించిందని, ఇది ఇతర టాప్‌ ఐటీ కంపెనీలకంటే అధికమని బ్రోకరేజ్‌ సంస్థ వివరించింది. 

హీరో మోటార్‌ కార్ప్‌
బ్రోకరేజ్‌: ఎలారా కేపిటల్‌. రేటింగ్‌: బై, టార్గెట్‌: రూ. 3,750

మోటారు సైకిళ్ల రంగంలో పోటీ పెరుగుతున్నా, హీరో మోటో కార్ప్‌ మార్కెట్‌ వాటాను పెంచుకోవడం పట్ల ఆశ్చర్యపడుతున్నట్లు ఎలారా కేపిటల్‌ పేర్కొంటూ షేరుకు బై రేటింగ్‌ను కేటాయించింది. ప్రస్తుత షేరు ధరతో పోలిస్తే 38 శాతం పెరుగుదలను అంచనావేస్తూ రూ. 3,750 టార్గెట్‌ ధరగా నిర్ణయించింది. మార్కెట్‌ వాటా పెరుగుదలకు ధర ఒక్కటే కారణం కాబోదని, కస్టమర్లు...ఆయా వాహనాల రీసేల్‌ వాల్యూను బట్టికూడా ఆకర్షితులవుతారని బ్రోకరేజ్‌ సంస్థ హీరో మోటో కార్ప్‌ను విశ్లేషించింది. 

ఆసియన్‌ పెయింట్స్‌
బ్రోకరేజ్‌: బోఫా. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 1,650

ఫలితాల ప్రకటన అనంతరం ఆసియన్‌ పెయింట్స్‌ షేరును రూ. 1,650 టార్గెట్‌ ధరతో కొనవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ (బోఫా) సిఫార్సుచేసింది. తాజా క్వార్టర్లో కంపెనీ అమ్మకాల పరిమాణం మెరుగ్గావుందని, బలహీన మార్జిన్ల కారణంగా నికరలాభం అంచనాలకంటే తక్కువగా వుందని బోఫా పేర్కొంది. పెయింట్స్‌ ధరల పెంపును వాయిదా వేయడం మార్జిన్ల తగ్గుదలకు కారణమని, అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నికరలాభపు మార్జిన్లు మెరుగవుతాయని అంచనావేస్తున్నట్లు తెలిపింది. 

అల్ట్రాటెక్‌ సిమెంట్‌
బ్రోకరేజ్‌: నోమురా. రేటింగ్‌: బై. టార్గెట్‌: రూ. 5,150

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరును  రూ. 5,150 టార్గెట్‌ ధరతో కొనవచ్చని..ఫలితాల వెల్లడి తర్వాత నోమురా సిఫార్సుచేసింది. అధిక వ్యయాలు, అమ్మకాల తగ్గుదల కారణంగా తాజా ఫలితాలు నిరుత్సాహకరంగా వున్నాయని, అయితే క్యూ3లో సిమెంటు ధరలు పెరుగతాయన్న అంచనాల్ని, విద్యుత్, ఇంధన వ్యయాలు గరిష్టస్థాయికి  చేరాయన్న విశ్వాసాన్ని కంపెనీ యాజమాన్యం వెల్లడించినట్లు నోమురా వివరించింది. సిమెంట్‌ రంగ వృద్ధిని అందిపుచ్చుకునేందుకు అల్ట్రాటెక్‌ సిద్ధంగా వుందన్న అభిప్రాయాన్ని బ్రోకరేజ్‌ సంస్థ వ్యక్తంచేసింది. ఇవే కారణాలతో మరో బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌ స్టాన్లీ...అల్ట్రాటెక్‌ షేరును రూ. 4,955 ధరతో కొనొచ్చని సిఫార్సుచేసింది.  

 



You may be interested

ప్రమోటర్లు వాటాలను పెంచుకున్న కంపెనీలివే..!

Friday 26th October 2018

మార్కెట్‌ ప్రస్తుతం కష్టాల కడలిలో కొట్టుమిట్టులాడుతోంది. షేర్లు ఎప్పటికప్పుడు కొత్త కనిష్టాలను తాకుతూ తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నాయి. అటు ట్రేడర్లు, ఇటు ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్‌ నుంచి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. అయితే ఈ తరుణంలో అనూహ్యంగా కొన్ని కంపెనీల ప్రమోటర్లు సంస్థలో తమ వాటాలను పెంచుకుంటున్నారు. వ్యాపార విస్తరణ, అభివృద్ధికి తీసుకోబోతున్న కంపెనీ తీసుకోబోతున్న నిర్ణయాలు ప్రమోటర్లకు తెలియడం, కంపెనీ షేరుకు ఉన్న వాల్యూను వారు గుర్తించటం,

రూపీ రికవరీ: నష్టాల్లో ఐటీ షేర్లు

Friday 26th October 2018

ఐటీ, బ్యాకింగ్‌ రంగ షేర్ల పతనంతో మార్కెట్‌ శుక్రవారం మిడ్‌సెషన్‌ సమయానికి స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. డాలర్‌ మారకంలో రూపాయి రీవకరీ కారణంగా ఐటీ షేర్లు నేటి ట్రేడింగ్‌లో భారీగా నష్టపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిప్టీ ఐటీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో అన్ని ఇండెక్స్‌ల్లో కెల్లా అత్యధికంగా 2శాతం నష్టపోయింది. మధ్యాహ్నం గం.12:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపుతో ముగింపు (14071)తో పోలిస్తే 1.50శాతం నష్టపోయి 13,856ల

Most from this category