STOCKS

News


నిఫ్టీ తదుపరి టార్గెట్‌ 11200!

Monday 21st January 2019
Markets_main1548048971.png-23688

నార్నోలియా అంచనా
గతవారం మొత్తం కన్సాలిడేషన్‌ చూపిన సూచీలు సోమవారం మరోమారు గతకొద్ది నెలల రేంజ్‌ పైఅవధిని చేరాయి. నాలుగు రోజులుగా హయ్యర్‌హై, హయ్యర్‌ లో ఏర్పాటుచేస్తున్న నిఫ్టీ సోమవారం గత కొన్ని నెలల టాపింగ్‌ స్థాయి 10980 పాయింట్లను చేరింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ బ్రేకవుట్‌ సాధిస్తే తదుపరి 11200 పాయింట్ల వరకు ర్యాలీ జరపవచ్చని నార్నోలియా బ్రోకింగ్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుతం నిఫ్టీ తన 20, 100, 200 రోజుల డీఎంఏ స్థాయిలకు పైన ట్రేడవుతూ బలంగా కనిపిస్తోందని తెలిపింది. నిఫ్టీ 10820- 10830 పాయింట్ల పైన ఉన్నంత వరకు బలంగానే ఉండొచ్చని తెలిపింది. ఒకవేళ చిన్నపాటి వెనుకంజ ఏర్పడి ఈ స్థాయికి నిఫ్టీ వస్తే కొనుగోళ్లకు అవకాశంగా చూడాలని సూచించింది.

గత కొన్ని నెలల రేంజ్‌మూవ్‌ కారణంగా నిఫ్టీ చార్టుల్లో ఊర్ధ్వముఖ త్రిభుజాకృతి ఏర్పడిందని వివరించింది. ఈ త్రిభుజాకృతిని ఛేదించి బయటపడితే సూచీలు మరింత పాజిటివ్‌గా మారతాయని పేర్కొంది. చార్టుల్లో ఇండికేటర్లు కొనుగోళ్లకు మద్దతుగా ఉన్నాయని తెలిపింది. బ్యాంకు నిఫ్టీ 26950- 27600 పాయింట్ల మధ్య కదలాడుతోందని, ఈ రేంజ్‌ నుంచి బ్రేకవుట్‌ సాధిస్తే 27900పాయింట్ల వరకు చేరవచ్చని అంచనా వేసింది. 



You may be interested

రుణానికి కొత్త రూటు.. పీ2పీ

Monday 21st January 2019

సులభంగా రుణాలు పొందే చోటు మరొకరికి రుణాలను ఆఫర్‌ చేయడానికీ ఇదే మార్గం ఒకరికి అవసరం.. మరొకరికి రాబడి పీర్‌ టు పీర్‌ (పీటూపీ) లెండింగ్‌కు 2018 మంచి ప్రోత్సాహకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పీటూపీ సంస్థలను ఎన్‌బీఎఫ్‌సీలుగా ఆర్‌బీఐ గుర్తించి, లైసెన్స్‌లను మంజూరు చేసింది గతేడాదే. దీంతో క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలకు అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 2016 నాటికి 30కి పైగా పీటూపీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 11 సంస్థలకు గతేడాది

11000 పాయింట్లకు చేరువలో నిఫ్టీ

Monday 21st January 2019

ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను ప్రారంభించిన సూచీలు వేగంగా తమ లాభాల్ని పెంచుకుంటూ వెళ్తున్నాయి. నిఫ్టీ సూచీ 77 పాయింట్లు లాభపడి 11వేల దిశగా కదులుతుంది. అన్ని రంగాలకు చెందిన షేర్లలో అకస్మాత్తుగా కొనుగోళ్ల మొదలవడంతో కేవలం అరగంటలోనే వ్యవధిలోనే సెన్సెక్స్‌ 300పాయింట్లను ఆర్జించి 36,682.61 వద్ద, నిఫ్టీ సూచీ 77 పాయింట్ల లాభపడి 10,984 వద్ద ఇంట్రాడేలో గరిష్టాలను నమోదు చేశాయి. ముఖ్యంగా ఫార్మా, ఇంధన, ఐటీ షేర్లు ర్యాలీకి ప్రాతినిథ్యం

Most from this category