STOCKS

News


10700 దిగువన స్వల్పకాలిక బేరిష్‌నెస్‌

Thursday 14th February 2019
Markets_main1550126019.png-24193

బొనాంజ పోర్టుఫోలియో 
దేశీయ సూచీలు కొంతకాలంగా స్వల్పకాలిక రేంజ్‌లోనే కదలాడుతూఉన్నాయి. ఇటీవల నిఫ్టీ అప్‌సైడ్‌ బ్రేకవుట్‌ ఇచ్చినట్లు కనిపించినా చివరకు అది ఫాల్స్‌ బ్రేకవుట్‌గా ముగిసిపోయింది. నిఫ్టీకి 11100 పాయింట్ల వద్ద అత్యంత బలమైన నిరోధం ఎదురవుతోంది. ఈ స్థాయిని ఛేదించలేక నిఫ్టీ మరోమారు 10730 పాయింట్ల వరకు వెనుకంజ వేసింది. ప్రస్తుతం చార్టుల్లో ఇండికేటర్లు బేరిష్‌క్రాసోవర్‌ చూపుతున్నాయి. ఆప్షన్స్‌ పరంగా నిఫ్టీ 11000 వద్ద కాల్స్‌ అధికంగా ఉండగా, 10400 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో నిఫ్టీకి 10700 పాయింట్లు అత్యంత కీలకంగా మారింది. ఈ స్థాయిని కాపాడుకోలేకుంటే సూచీలు స్వల్పకాలిక బేరిష్‌నెస్‌లోకి ప్రవేశిస్తాయి. అలాంటప్పుడు మరోమారు 10400-10500 పాయింట్ల వరకు దిగజారవచ్చు. నిఫ్టీ అప్‌మూవ్‌ చూపితే తక్షణం 10900 వద్ద నిరోధం ఎదురవుతుంది. దీన్ని దాటితే 11100 పాయింట్ల వరకు ఎగబాకవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులను పరిశీలిస్తే 10700- 10750 పాయింట్ల జోన్‌లోనే నిఫ్టీ కదలాడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. 



You may be interested

రూ.50 కోట్లతో ఎన్‌సీఎల్‌ వెకా ప్లాంట్‌

Thursday 14th February 2019

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: యూపీవీసీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎన్‌సీఎల్‌ వెకా హైదరాబాద్‌ శివారులో ప్లాంట్‌ను ప్రారంభించింది. మెదక్‌ జిల్లా ముచ్చెర్లలోని ఈ ప్లాంట్‌ను బుధవారం తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. 16.8 ఎకరాల్లో రూ.50 కోట్ల పెట్టుబడులతో ఈ ప్లాంట్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈ ప్లాంట్‌లో 18 ఎక్స్‌ట్రూడర్‌ లైన్స్‌ ఉన్నాయని.. డిమాండ్‌ను బట్టి భవిష్యత్తులో

'సింగిల్' రిటైలర్ల నిబంధనల సడలింపుపై కేంద్రం కసరత్తు

Thursday 14th February 2019

న్యూఢిల్లీ: విదేశీ సింగిల్ బ్రాండ్ రిటైలర్లను ఆకర్షించే దిశగా నిబంధనలను సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ఆయా సంస్థలు తప్పనిసరిగా 30 శాతం స్థానికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉంటుందన్న సోర్సింగ్‌ నిబంధనకు సంబంధించి కాలావధి విషయంలో కొంత వెసులుబాటునివ్వాలని భావిస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఈ ప్రతిపాదనకు సంబంధించి ఇప్పటికే వివిధ శాఖలకు ముసాయిదా క్యాబినెట్ నోట్‌ను పంపింది. ఆయా శాఖల నుంచి అభిప్రాయాలు అందగానే, క్యాబినెట్‌ ముందు ప్రతిపాదనలు

Most from this category