STOCKS

News


11830 పాయింట్లకు దిగువన మరింత పతనం!

Friday 7th June 2019
Markets_main1559891778.png-26156

నిఫ్టీపై నిపుణుల అంచనా
చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ పాటర్న్‌ ఏర్పరిచింది. ఈ నేపథ్యంలో నిఫ్టీలో కొత్త షార్ట్స్‌ తీసుకోవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిఫ్టీలో స్వల్పకాలిక ట్రెండ్‌ రివర్సల్‌ ఆరంభమైందని నిపుణుల భావన. నిఫ్టీ 11830 పాయింట్ల దిగువన బలంగా క్లోజయితే ట్రెండ్‌ రివర్సల్‌ను నిర్ధారించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టీ క్రమంగా 11600 పాయింట్ల వరకు పతనం కావచ్చు. పైన 12103 పాయింట్ల వద్ద అప్‌సైడ్‌నిరోధం కనిపిస్తోంది. డైలీ చార్టుల్లో బేరిష్‌ హరామీ క్యాండిల్‌ స్టిక్‌ పాటర్న్‌ ఏర్పడింది. నిఫ్టీ 11800-11830 జోన్‌ను కాపాడుకోలేకపోతే తదుపరి మద్దతు 50 రోజుల డీఎంఏ స్థాయి 11650 పాయింట్ల వద్ద కనిపిస్తోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ బ్రేకవుట్‌ సాధించినా, దాన్ని నిలబెట్టుకోలేక అవస్థలు పడుతోంది. అందువల్ల అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చు. స్వల్పకాలానికి ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించాలి.
నిఫ్టీ కీలక స్థాయిలు: 11830. 12103
కాల్స్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉన్న స్ట్రైక్‌ ప్రైస్‌లు: 12500, 12000
పుట్‌ ఓపెన్‌ ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉన్న స్ట్రైక్‌ ప్రైస్‌లు: 11500, 11000. 
శుక్రవారం నిఫ్టీ తీవ్ర కదలికలు నమోదు చేసింది. ఒకదశలో 11769 పాయింట్లకు దిగజారి వెనువెంటనే పైకి ఎగిసింది. ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతోంది.



You may be interested

ఒడిదుడుకుల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Friday 7th June 2019

ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నేపథ్యంలో శుక్రవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ భారీ ఒడిదుడుకులకు లోనవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 30,943.15 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ట్రేడింగ్‌ ప్రారంభంలో మార్కెట్లో జరిగిన అమ్మకాల్లో భాగంగా ఇండెక్స్‌ 0.75శాతం(230 పాయింట్లు) నష్టపోయి 30,627.05 వద్ద ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదు చేసింది. అయితే, సమయం గడుస్తున్న కొద్ది ఇన్వెస్టర్లు క్రమంగా కొనుగోళ్లుకు మొగ్గుచూపడంతో సూచీలు తిరిగిలాభపడ్డాయి. ఈ

బైజూస్‌ నుంచి ఎర్లీ లెర్న్‌యాప్‌

Friday 7th June 2019

బెంగళూరు: ఆన్‌లైన్‌ విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బైజూస్‌... తాజాగా ఎర్లీ లెర్న్‌ యాప్‌ను విడుదల చేసింది. 6-8 ఏళ్ల వయసు గ్రూపులోని  (1-3 తరగతులు) వారి కోసం ఈ యాప్‌ను రూపొందించినట్టు థింక్‌ అండ్‌ లెర్న్‌ ప్రైవేటు లిమిటెడ్‌ (బైజూస్‌ మాతృ సంస్థ) తెలిపింది. డిస్నీ కథలు, క్యారక్టర్లతో అలరిస్తూ  విద్యార్థుల కోసం ఉద్దేశించిన వ్యక్తిగత ప్రొగ్రామ్‌లను ఈ యాప్‌ ద్వారా ఆఫర్‌ చేస్తున్నట్టు పేర్కొంది. ఈ యాప్‌లో

Most from this category