STOCKS

News


11400 దిగువన 11100 పాయింట్ల వరకు పతనం!

Thursday 11th July 2019
Markets_main1562827804.png-26984

నిఫ్టీపై నిపుణుల అంచనా
నిఫ్టీ తన ఇటీవల కాలపు రేంజ్‌ నుంచి బడ్జెట్‌ తర్వాత బ్రేక్‌డౌన్‌ చూపింది. అప్పటి నుంచి ఆరేంజ్‌ దిగువ అవధి 11625 పాయింట్ల కిందనే కదలాడుతోంది. బుధవారం డైలీ చార్టుల్లో ట్రెండ్‌లైన్‌ నుంచి కూడా బ్రేక్‌డౌన్‌ చూపినట్లు కనపడుతోంది. ఇవన్నీ మార్కెట్‌ వర్గాల్లో పెరుగుతున్న నిరాశాధోరణికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. ఎగ్జిట్‌ పోల్‌ రోజు చార్టుల్లో ఏర్పడ్డ గ్యాప్‌ను పూరించేవరకు ఈ పతనం తప్పకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. గత రెండు రోజుల క్యాండిల్‌స్టిక్స్‌ పరిశీలిస్తే హ్యామర్‌, ఇన్వర్టెడ్‌ హ్యామర్‌ కనిపిస్తున్నాయి. ఇవి బుల్లిష్‌ రివర్సల్‌కు సంకేతం. అందువల్ల స్వల్ప బౌన్స్‌కు అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సూచీల్లో స్వల్పకాలిక ట్రెండ్‌ నెగిటివ్‌గా, మిడ్‌టర్మ్‌ ట్రెండ్‌ పాజిటివ్‌గా ఉన్నట్లు చెప్పవచ్చు. ఇప్పటికీ దీర్ఘకాల చార్టుల్లో నిఫ్టీ హయ్యర్‌హై, హయ్యర్‌లో ప్యాటర్న్‌లోనే ఉంది. ఒకవేళ నిఫ్టీ 11400 పాయింట్లను కాపాడుకోలేకపోతే వేగంగా 11100 పాయింట్ల వరకు దిగజారవచ్చు. ఈ స్థాయి నిఫ్టీకి మద్దతుగా నిలుస్తుంది. పైవైపున 11600- 11640 పాయింట్లు నిరోధంగా నిలుస్తాయి. ఈ స్థాయికి పైన బలంగా ముగిస్తే మరోమారు 11850- 12000 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు. క్యు1 సీజన్‌ ఆరంభమైనందున స్వల్పకాలానికి సూచీలు అస్థిరంగా ఉండొచ్చని అంచనా
నిఫ్టీ కీలక స్థాయిలు: 11461, 11593.
ఎక్కువ కాల్స్‌ 12000 పాయింట్ల వద్ద ఎక్కువ పుట్స్‌ 11300 పాయింట్ల వద్ద ఉన్నాయి. 



You may be interested

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Thursday 11th July 2019

మార్కెట్‌ ర్యాలీలో భాగంగా గురువారం రియల్టీ రంగ షేర్లు రాణిస్తున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీరంగ షేర్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ దాదాపు 2శాతం ర్యాలీ చేసింది. నేడు ఈ ఇండెక్స్‌లో 277.25 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించిది. వరసుగా మూడు ట్రేడింగ్‌లో సెషన్లలో భారీ నష్టాలను చవిచూసిన ఈ రంగ షేర్లలో నేడు షార్ట్‌ కవరింగ్‌ జరిగింది. ఫలితంగా ఇంట్రాడే ఇండెక్స్‌ 1.50శాతం పెరిగి 279.70 స్థాయికి చేరుకుంది. ఇండెక్స్‌లో

టాక్స్‌ భయాలతో షార్ట్స్‌కు దిగిన ఎఫ్‌ఐఐలు

Thursday 11th July 2019

నిఫ్టీ, బ్యాంకు నిఫ్టీ ఫ్యూచర్లలో విదేశీ సంస్థాగత మదుపరులు(ఎఫ్‌ఐఐ) నికర విక్రయదారులుగా మారారు. కార్పొరేట్‌ నిర్మితిలేని ట్రస్ట్‌ స్ట్రక్చర్‌ ఉన్న ఎఫ్‌ఐఐలు అధిక పన్నులను ఎదుర్కోవాల్సి వస్తుందని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఎఫ్‌ఐఐలు అమ్మకాలకు దిగినట్లు నిపుణులు భావిస్తున్నారు. ఇండెక్స్‌ ఫ్యూచర్లలో జూలై4న దాదాపు 41వేల వరకు లాంగ్స్‌ ఉన్న ఎఫ్‌ఐఐలు జూలై9కి తమ లాంగ్‌ పొజిషన్లను 15745కు తగ్గించుకున్నారు. అధిక పన్నుతో పాటు లిస్టెడ్‌ కంపెనీల బైబ్యాక్‌పై

Most from this category