STOCKS

News


11750 కోల్పోతే భారీ పతనం?!

Monday 10th June 2019
Markets_main1560148748.png-26191

బొనాంజ పోర్టుఫోలియో అంచనా
దేశీయ మార్కెట్లు వారాన్ని లాభాలతో ఆరంభించాయి. నిఫ్టీ 11975 పాయింట్ల వరకు ఎగిసినా ఆ లాభాలని నిలబెట్టుకోలేక మధ్యాహ్నానికి 11900 పాయింట్ల వద్ద స్వల్పలాభంతో ట్రేడవుతోంది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ రైజింగ్‌ చానెల్‌ మధ్యలో కదలాడుతోందని, ఈ చానెల్‌లో ఉన్నంత వరకు దిగవకు వచ్చినప్పుడల్లా కొనుగోలు చేయడం, పై అవధి వద్ద అమ్మడం చేయవచ్చని బొనాంజా పోర్టుఫోలియో అనలిస్టు రూపక్‌డే సూచించారు. దీంతో పాటు చార్టుల్లో హైపీక్‌ కనిపిస్తోందని, ఇది మార్కెట్లో ఇప్పటికీ మిగిలిన ఆశావహ ధృక్పథానికి సంకేతమని చెప్పారు. అయితే నిఫ్టీ 12వేల పాయింట్లకు చేరువైనప్పుడల్లా కొనుగోళ్లు మందగిస్తున్నాయని చెప్పారు. దీంతో ఆ స్థాయిల నుంచి సూచీ తిరిగి రైజింగ్‌ చానెల్‌ దిగువ అవధికి వస్తోందన్నారు. ఇక్కడ కొనుగోళ్ల మద్దతు దొరకడంతో తిరిగి అప్‌మూవ్‌ చూపుతోందని వివరించారు.

నిఫ్టీలో బలమైన ర్యాలీ వచ్చినా ఆర్‌ఎస్‌ఐ ఇండికేటర్‌ పెద్దగా పాజిటివ్‌ సంకేతాలు చూపలేదని, నెగిటివ్‌ డైవర్జెన్స్‌ చూపిందని చెప్పారు. ఇంత ర్యాలీ తర్వాత ఆర్‌ఎస్‌ఐ ఇలా ప్రవర్తించడం పాజిటివ్‌ కదలికలు తగ్గుతున్నాయనేందుకు సంకేతమని చెప్పారు. ప్రస్తుతం నిఫ్టీ కన్సాలిడేషన్‌ మూడ్‌లో ఉందన్నారు. ఈ మూడ్‌లోనుంచి అప్‌మూవ్‌ చూపాలంటే 12వేల పాయింట్ల పైన బలంగా క్లోజవ్వాలని చెప్పారు. అప్పుడు 12500 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చన్నారు. దిగువన 11750 పాయింట్లు చాలా కీలమన్నారు. ఈ స్థాయిని కోల్పోతే నిఫ్టీలో భారీ పతనం ఉండవచ్చని హెచ్చరించారు. ఈ స్థితిలో నిఫ్టీ 11400 పాయింట్ల వరకు పడిపోవచ్చని చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 11750- 12000 పాయింట్ల మధ్యలోనే మరికొన్నాళ్లు కదలవచ్చని అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో ఐటీ, కన్జూమర్‌ గూడ్స్‌, రియల్టీ రంగాల్లో కొనుగోళ్లు కనిపించవచ్చని అంచనా వేశారు. హెచ్‌యూఎల్‌, హావెల్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు బలంగా ట్రేడవుతాయన్నారు. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ రంగంలో కొంత ప్రాఫిట్‌ బుకింగ్‌కు అవకాశం ఉందన్నారు. You may be interested

పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం కీలకం

Monday 10th June 2019

వాణిజ్య యుద్ధ భయాలు, క్రూడాయిల్‌ ధరలూ ప్రధానమే ఈ వారం మార్కెట్లకు దిశా నిర్దేశం చేసే అంశాలు పారిశ్రామికోత్పత్తి, ద్రవ్యోల్బణం గణాంకాలతో పాటు అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధాలు, క్రూడాయిల్‌ ధరలు తదితర అంతర్జాతీయ అంశాలు ఈ వారం దేశీ మార్కెట్లకు దిశా నిర్దేశం చేయనున్నాయి. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగంలో నిధుల సంక్షోభ పరిస్థితులు గత వారం ఈక్విటీ మార్కెట్లను కలవరపర్చాయి. ఈ వారం కూడా ఇన్వెస్టర్లు ఈ అంశంపై దృష్టి

ఎఫ్‌పీఐలు ఏం కొంటున్నారు!

Monday 10th June 2019

విదేశీ సంస్థాగత మదుపరులు దేశీయ మార్కెట్లో నాణ్యమైన మిడ్‌క్యాప్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా ఎఫ్‌ఐఐలు తాము పెట్టుబడులు పెట్టదలిచిన కౌంటర్లలో ఇతర ఇన్వెస్టర్లు మేల్కొనే ముందే పెట్టుబడులు పెడతారు. వివిధ రంగాలు, ప్రాంతాల్లో ట్రెండ్స్‌ను ముందే పసిగడతారు. దీర్ఘకాలిక సంపద సృష్టికి వీరు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అందువల్ల వీరు ఎందులో పెట్టుబడులు పెట్టాయో పరిశీలించి మదుపరులు తమ పోర్టుఫోలియోలో సదరు స్టాకులను చేర్చుకుంటుంటారు. గత ఏడాది కాలంలో

Most from this category