STOCKS

News


2019 కోసం బోటమ్‌అప్‌ విధానం: పొరింజు

Monday 31st December 2018
Markets_main1546278368.png-23336

గత ఆర్థిక సంవత్సరంలో చిన్న, మధ్య స్థాయి మార్కె్‌ట్‌ విలువ కలిగిన కంపెనీలు ఎక్కువగా నష్టపోయాయి. అయితే, ఇవి 2019లో మంచి లాభాలు ఇవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారు ప్రముఖ ఇన్వెస్టర్‌, ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ సంస్థ సీఈవో పొరింజు వెలియాత్‌. నూతన సంవత్సరంలో ఏ తరహా విధానం అనుసరణీయమన్నది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఆ వివరాలు... 

 

‘‘చాలా మంది మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఇరుక్కుపోయామని, బ్లూచిప్‌ స్టాక్స్‌లోకి మారిపోయే సమయం ఇదేనన్న అభిప్రాయంతో ఉన్నారు. కానీ, ఇది రెండో తప్పిదం అవుతుంది. 2019 మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సంవత్సరం అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. విలువలు ఆకర్షణీయ స్థాయిలకు వచ్చాయి. కొన్ని స్టాక్స్‌ వ్యాల్యూషన్లు మరీ ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకే వీటి పట్ల ఆసక్తితో ఉన్నాను. ఇప్పటికే వీటిల్లో ఇన్వెస్ట్‌ చేసిన వారు వాటిని కొనసాగించుకోవాలి. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు దూరంగా ఉండాలని, మార్కెట్‌ పరిస్థితుల దృష్ట్యా లార్జ్‌ బ్లూచిప్‌ స్టాక్స్‌నే కొనుగోలు చేయాలని ఈ సమయంలో సూచించడం తప్పు అవుతుంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇన్వెస్టర్లు గత కొన్నేళ్ల కాలంలో పెద్ద మొత్తంలో ఆర్జించారు. అభివృద్ధి చెందుతున్న కంపెనీలను ఎంచుకునేందుకు ఇప్పటికీ అపార అవకాశాలు భారత మార్కెట్లో ఉన్నాయి. 

 

స్థూల ఆర్థిక అంశాల పరంగా పూర్తి భిన్నమైన పరిస్థితి చూస్తున్నాం. చమురు ధరలు దిగొస్తున్నాయి. రూపాయి బలోపేతం అవుతోంది. చారిత్రక సంస్కరణల తాలూకూ ఫలితాలు వస్తున్నాయి. గతం కంటే 16-17 శాతం అధికంగా పన్ను వసూలవుతోంది. గత ఐదేళ్లలో పన్ను రెట్టింపైంది. ఇదేమీ చిన్న విషయం కాదు. ఆర్థిక వ్యవస్థ 6-7 శాతం చొప్పున వృద్ధి నమోదు చేస్తోంది. ఆదాయపన్ను శాఖ జీఎస్టీ డేటాను పరిశీలిస్తోంది. కనుక పన్నుల ఆదాయం 20-25 శాతం మేర పెరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.  

 

బోటమ్‌ అప్‌ విధానం
2019కి బోటమ్‌ అప్‌ విధానం ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఓ రంగానికి బదులు బోటమ్‌ అప్‌ విధానం అనుసరించడం మంచిది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఒక లార్జ్‌క్యాప్‌ కంపెనీ. ఏటా 20 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. కానీ, రెండు దశాబ్దాల క్రితం దీని మార్కెట్‌ క్యాప్‌ కేవలం రూ.500 కోట్లు. ఇప్పుడు రూ.5-6 లక్షల కోట్లు. ప్రతీ లార్జ్‌క్యాప్‌ ఏదో ఒక సమయంలో స్మాల్‌ లేదా మిడ్‌క్యాప్‌ కంపెనీయే అయి ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ భిన్నమైన పెట్టుబడుల విధానం అంటూ ఉంటుంది. కొంత మంది కేవలం బ్లూచిప్‌ కంపెనీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తారు. ఇది కూడా ఓ అద్భుతమైన విధానమే. ఏటా 10-15 శాతం రాబడులు అందుకోవచ్చు. అవి కూడా భద్రంగా. కానీ ఇదొక్కటే పెట్టుబడుల విధానం కాదు. కొంత మందికి ఏటా 25-30, 35 శాతం వరకూ రాబడులు కావాలి. అది బ్లూచిప్‌ కంపెనీల్లో సాధ్యం కాదు’’ అని పొరింజు తన అభిప్రాయాలను వివరించారు. బోటమ్‌ అప్‌ విధానంలో విడిగా ఓ కంపెనీ ఆర్థిక అంశాలు, మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది. You may be interested

2019లో ఏ రంగాలు ర్యాలీ చేయవచ్చు..?

Monday 31st December 2018

దేశీయ స్టాక్‌ మార్కెట్లు 2018లో ఆటుపోట్లతో కొనసాగాయి. చివరి సెషన్‌ కూడా ఒడిదుడుకుల మయంగానే సాగింది. మొత్తం మీద 2018లో నిఫ్టీ కేవలం 3.15 శాతం రాబడులను ఇచ్చింది. మరి 2019 ఎలా ఉండబోతుంది...? ఏ రంగాలు ర్యాలీ చేయనున్నాయనే అంశాలను జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌, అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలియజేశారు.   18 రంగాల్లో 13 రంగాలు నష్టాలనే మిగిల్చాయి. రియాలిటీ, మీడియా, ఆటో సూచీలు వరుసగా

ఫ్లాట్‌ ముగింపుతో 2018కు వీడ్కోలు

Monday 31st December 2018

మార్కెట్‌ 2018 సంవత్సరానికి ఫ్లాట్‌ ముగింపుతో వీడ్కోలు పలికింది. ఈ ఏడాదిలో మార్కెట్లకు చివరిరోజైన నేటి ట్రేడింగ్‌ సెషన్‌లో సూచీలు ఆద్యంతం ఒడిదుడుకుల ట్రేడింగ్‌ను సాగించిన సూచీలు చివరకు ఫ్లాట్‌గా ముగిశాయి. ప్రపంచ‌మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో ఉదయం భారీ లాభంతో మార్కెట్‌ ప్రారంభమైనప్పటికీ.., ఆసియా, ఐరోపా మార్కెట్ల మిశ్రమ ముగింపు, ముడిచమురు ధరల పెరుగుదల మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.మిశ్రమంగా ముగిశాయి. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 8పాయింట్లు నష్టపోయి 36,068

Most from this category