STOCKS

News


హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంపీ ఐపీవో లాభంపై పన్ను పడుద్ది

Sunday 12th August 2018
Markets_main1534097425.png-19189

మీరు రిటైల్‌ ఇన్వెస్టర్లా...? ఇటీవలే ఐపీవోకు వచ్చి స్టాక్‌ మార్కెట్లో లిస్ట్‌ అయిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీలో పాల్గొని మంచి లాభాన్ని కళ్ల జూశారా? అయితే మీకు పన్ను చెల్లించాల్సిన బాధ్యత ఉన్నట్టే. ఐపీవోలో ఒక్కో షేరు రూ.1,100కు కేటాయించగా, రూ.1,739 వద్ద కంపెనీ లిస్ట్‌ అయిన విషయం తెలిసే ఉంటుంది. అంటే ఒక్కో షేరుపై రూ.639 లాభం అనమాట. ప్రస్తుతం షేరు రూ.1,739.40 స్థాయిలో ఉంది. అమ్మకుండా ఉంచుకున్న వారి విషయం పక్కన పెడితే... స్వల్ప కాలంలోనే 60 శాతం వరకు లాభం ఇస్తుండడంతో దాన్ని బుక్‌ చేసుకున్న రిటైల్‌ ఇన్వెస్టర్లు చాలా మందే ఉండుంటారు. అయితే, ఈ లాభంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

 

ఈక్విటీ లాభాలపై పన్ను
ఆదాయపన్ను శాఖ నిబంధనల ప్రకారం ఈక్విటీ పెట్టుబడులపై రాబడులన్నవి స్వల్పకాలం, దీర్ఘకాలంగా పరిగణించడం జరుగుతుంది. పెట్టుబడి పెట్టి ఏడాది లోపు విక్రయించడం ద్వారా ఆర్జించిన లాభాలను ఎస్‌టీసీజీగాను, ఏడాది దాటి విక్రయించిన లాభాలను ఎల్‌టీసీజీగాను పరిగణించాలి. లిస్టింగ్‌ రోజున అమ్మేసి లాభాలను పొందితే అది ఏడాది లోపే కనుక స్వల్ప కాల మూలధన లాభాల పన్ను కిందకు వస్తుంది. ఈ విక్రయం కూడా స్టాక్‌ ఎక్సేంజ్‌ల ద్వారా చేసి, నిబంధనల మేరకు సెక్యూరిటీ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) చెల్లించినట్టయితే, సెక్షన్‌ 111ఏ ప్రకారం లాభాలపై 15 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుందని హెచ్‌ఆర్‌ బ్లాక్‌ ఇండియా ట్యాక్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ చేతన్‌ చందక్‌ తెలిపారు.

 

ఎంత మేర...?
హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ ఐపీవో అలాట్‌మెంట్‌ ధర రూ.1,100. లిస్టింగ్‌ ధర రూ.1,739. ఒక్క షేరుపై లాభం రూ.639. అంటే దీనిలో 15 శాతం పన్ను అంటే రూ.95.85 అవుతుంది. దీనిపై సెస్‌ 4 శాతం రూ.3.83 కలిపితే సుమారు రూ.100 రూపాయల వరకు ఒక్కో షేరుపై పన్నుగా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ ఇంతకంటే తక్కువ ధరకు విక్రయించిన వారు, ఎక్కువ ధరకు విక్రయించిన వారు 15 శాతం పన్ను, దానిపై 4 శాతం సెస్సు ప్రకారం పన్ను చెల్లించాలి.

 

పన్ను కట్టకుండా మార్గం ఉందా?
ఒకవేళ షార్ట్‌ టర్మ్‌ నష్టాలు (ఏడాది లోపు పెట్టుబడులను విక్రయించడం ద్వారా వచ్చినవి) వచ్చి ఉంటే అది ఈక్విటీలే కానక్కర్లేదు, చట్టప్రకారం మరే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమైనా సరే... వాటిని స్వల్పకాలిక లాభాలే కాకుండా, దీర్ఘకాలిక మూలధన లాభాలతోనూ సర్దుబాటు చేసుకోవచ్చని చేతన్‌ చందక్‌ తెలిపారు. కానీ, స్వల్ప కాలిక లాభాలను మాత్రం, దీర్ఘకాలిక మూలధన నష్టాలతో సర్దుబాటు చేసుకోవడానికి లేదని పేర్కొన్నారు.You may be interested

యూటీఐ ఏఎంసీకి లియోపూరి షాక్‌

Sunday 12th August 2018

యూటీఐ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ లియోపూరి తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు. సోమవారం రాజీనామా చేయనున్నట్టు ఆయన తెలిపారు. కొత్త ఎండీ నియామకంపై కోర్టు కేసు నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మేరకు వాటాదారులకు పూరి తన నిర్ణయాన్ని లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘నా పదవీకాలం పొడిగింపును కోరుకోవడం లేదని స్పష్టం చేస్తున్నాను. దీంతో ప్రణాళిక మేరకు కార్యాలయాన్ని వీడుతున్నాను’’

మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇకపై మరింత ఆకర్షణీయం!

Sunday 12th August 2018

మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఇన్వెస్టర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు సెబీ నడుం బిగించింది. కొన్ని రకాల చర్యల ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో వ్యయాలను తగ్గించడంపై దృష్టి పెట్టింది. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించడంతోపాటు పలు రకాల పథకాలకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్స్‌పెన్స్‌ రేషియో (వ్యయాల నిష్పత్తి)లను సమీక్షించనుం‍ది. సెబీ ఇటీవలే మ్యూచువల్‌ ఫండ్స్‌ కేటగిరీల్లో భారీ మార్పులకు చర్యలు తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.   గవర్నెన్స్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఉత్పత్తుల పంపిణీదారుల చానల్స్‌,

Most from this category