News


2019 జూన్‌ నాటికి 95 డాలర్లకు బ్రెంట్‌ క్రూడ్‌

Tuesday 25th September 2018
Markets_main1537851205.png-20545

 ముంబై: అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర 2019 జూన్‌ నాటికి 95 డాలర్లకు చేరే అవకాశం ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ- బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా మెరిలించ్‌ (బీఆఫ్‌ఏఎంఎల్‌) విశ్లేషించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్‌లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర సోమవారం నాలుగు సంవత్సరాల గరిష్టస్థాయి 80.74ను తాకిన నేపథ్యంలో  బీఓఏ ఎంఎల్‌ తాజా విశ్లేషణ చేసింది. ఈ ఏడాది మే నెలలో అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ధర నాలుగేళ్ల గరిష్టం 80.50ని తాకింది. మళ్లీ సోమవారం ఈ స్థాయిని క్రూడ్‌ అధిగమించడం గమనార్హం. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు దీనికి నేపథ్యం. 
భారత్‌ క్యాడ్‌పై ప్రభావం...
కాగా అంతర్జాతీయంగా క్రూడ్‌ ధరల పెరుగుదల భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌)పై ప్రతికూల ప్రభావం చూపుతుందని బీఓఏ ఎంఎల్‌ విశ్లేషించింది. ‘‘2018-19లో 2.8 శాతానికి క్యాడ్‌ పెరిగే అవకాశం ఉంది. 2019-20లో ఇది 2.9 శాతంగా ఉంటుంది’’ అని విశ్లేషించింది. గతంలో ఇది 2.6 శాతంగా  ఉండొచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది ఇప్పటికే దాదాపు 13 శాతం పతనమైన రూపాయికి బీఓఏ ఎంఎల్‌ తాజా అంచనా ప్రతికూలమైనదే. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా ఒక దేశానికి వచ్చీ- పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర  వ్యత్యాసమే క్యాడ్‌. దీనిని సంబంధిత నిర్దిష్ట కాల స్థూల దేశీయోత్పత్తి విలువతో పోల్చి శాతాల్లో చూస్తారు. 2018-19 మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్‌-జూన్‌) భారత్‌ క్యాడ్‌ జీడీపీలో 2.4 శాతం. విలువలో 15.8 బిలియన్‌ డాలర్లు. 



You may be interested

ఆగస్టులో 17 శాతం పెరిగిన విమాన ప్రయాణీకులు!

Tuesday 25th September 2018

ముంబై: భారత్‌లో విమాన ప్రయాణికుల సంఖ్య ఆగస్టులో 17.17 శాతం పెరిగింది. సంఖ్యా పరంగా చూస్తే, 1.13 కోట్లు. 2017 ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 96.9 లక్షలు. డీజీసీఏ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జనవరి నుంచి ఆగస్టు వరకూ దేశీయ విమాన ప్రయాణీకుల సంఖ్య 21.20 శాతం పెరుగుదలతో 7.54 కోట్ల నుంచి 9.13 కోట్లకు చేరింది. మార్కెట్‌ వాటాలో ఇండిగో 41.9 శాతంతో

రూపాయి బలపడకపోవచ్చు: మూడీస్‌

Tuesday 25th September 2018

విదేశీ పెట్టుబడులు పెరగడానికి ఇటీవల కేంద్రం ప్రకటించిన ఐదు సూత్రాల ప్రణాళిక రూపాయి బలోపేతానికి దోహదపడకపోవచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ అంచనా వేసింది. ఈ చర్యలు ఫలితాన్ని ఇవ్వడానికి కొన్నాళ్లు పట్టే అవకాశం ఉండడమే తన అంచనాలకు కారణమని తెలిపింది. భారత్‌ విదేశీ నిధులకు సంబంధించి అకౌంట్‌కు కేంద్ర చర్యలు క్రెడిట్‌ పాజిటివ్‌ అవుతాయే తప్ప రూపాయి బలోపేతానికి మాత్రం తక్షణం దోహదపడవన్నది తమ అంచనా

Most from this category