News


విలీనం ఎఫెక్ట్‌: భారీ నష్టాల్లో దేనా, విజయా బ్యాంక్‌ షేర్లు

Thursday 3rd January 2019
Markets_main1546504048.png-23386

3.50శాతం లాభపడ్డ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా(బీవోబీ)లో దేనా బ్యాంక్‌, విజయా బ్యాంక్‌ల విలీనానికి కేంద్ర కేబినెట్‌ విలీనం తెలపడంతో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు గురువారం ట్రేడింగ్‌లో 3.50శాతం లాభపడ్డాయి. మరోవైపు ఈ బ్యాంకులో విలీనమయ్యే దేనా బ్యాంక్‌ 19 శాతం నష్టపోయి రూ.14.55కు చేరుకుంది. అలాగే విజయా బ్యాంక్‌ షేరు 7శాతం నష్టపోయి రూ.48 వద్ద ట్రేడవుతోంది.
విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోనున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ).. తాజాగా షేర్ల మార్పిడి నిష్పత్తిని నిర్ణయించింది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ షేర్లు లభిస్తాయి. బీవోబీ, దేనా బ్యాంక్‌ల బోర్డులు షేర్ల స్వాప్ నిష్పత్తి ప్రతిపాదనకు ఆమోదముద్ర వేశాయి.



You may be interested

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా...కొనొచ్చు: బ్రోకరేజ్‌లు

Thursday 3rd January 2019

బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్ల మార్పిడి నిష్పత్తి ద్వారా విజయా బ్యాంక్‌, దేనా బ్యాంక్‌లను విలీనం చేసుకోడానికి సిద్ధమైంది. ఈ రెండు బ్యాంకులను విలీనం చేసుకున్న బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా దేశంలోనే మూడో అతిపెద్ద బ్యాంకుగా అవతరించనుంది. విలీన ప్రతిపాదన ప్రకారం.. విజయా బ్యాంక్ షేర్‌హోల్డర్లకు సంబంధించి ప్రతి 1,000 షేర్లకు బీవోబీ షేర్లు 402 లభిస్తాయి. అటు దేనా బ్యాంక్ విషయానికొస్తే.. ప్రతి 1,000 షేర్లకు 110 బీవోబీ

అమ్మకాల ఒత్తిడిలో పెట్రో మార్కెటింగ్‌ షేర్లు

Thursday 3rd January 2019

అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధర ఒడిదుడుకుల నేపథ్యంలో దేశీయ ఆయిల్‌ మార్కెటిం‍గ్‌ కంపెనీల షేర్లు గురువారం నష్టాల బాట పట్టాయి. ఆర్థిక వృద్ధి మందగమనంతో క్రూడాయిల్‌కు డిమాండ్‌ తగ్గడం, సరఫరా పెరగడంతో గత కొన్ని నెలలుగా క్రూడాయిల్‌ ధర క్షీణిస్తూ వస్తోంది. క్రూడ్‌ ధరలు తగ్గితే ఇప్పటికే ఎక్కువ ధరల వద్ద కొన్న నిల్వలను ఓఎంసీలు తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుంది. అలాగే ఈ కంపెనీలు నిర్వహిస్తున్న రిఫైనరీల మార్జిన్లు క్షీణించడంతో డిసెంబర్‌

Most from this category